Suma kanakala: ప్రముఖ నటిగా, బుల్లితెర మహారాణిగా పేరు సొంతం చేసుకుంది సుమా కనకాల(Suma kanakala). యాంకర్ గా వరుస షోలు చేస్తూ.. బిజీగా మారిన ఈమె తాజాగా హైదరాబాదులోని కొండాపూర్ లో సందడి చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన ఆర్.ఆర్.జ్యువెలర్స్ స్టోర్ ను ఆరంభించారు. ఈ కార్యక్రమానికి సుమాతో పాటు ఎంఎల్ఏ గాంధీ, కార్పొరేట్ హమీద్ పటేల్, సీనియర్ కాంగ్రెస్ లీడర్ చంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.
ఆర్.ఆర్. జ్యువెలర్స్ స్టోర్ ఆరంభించిన సుమా కనకాల..
ఇక మన్నికైన, నాణ్యత కలిగిన ఆభరణాల సంస్థగా పేరు సొంతం చేసుకున్న ఆర్.ఆర్. జ్యువెలర్స్ ఇప్పుడు హైదరాబాదులోని కొండాపూర్ లగ్జరీ జ్యువెలరీ, గోల్డ్, డైమండ్, సిల్వర్ స్టోర్ ను కొండాపూర్ లో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా యాంకర్ సుమా కనకాల మాట్లాడుతూ..” ఆర్ ఆర్ జ్యువెల్లర్స్ షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. నేడు యువతులు అందంగా కనిపించేందుకు ఈ జ్యువెలరీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ షోరూం లో ఎవరు ఊహించని కొత్త కొత్త కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మీ అమ్మగారి పాత ఆభరణాలను కొత్త డిజైన్స్ తో తయారు చేయించుకోవచ్చు. పాత ఆభరణాలను మీ బట్టలు సారీ, బ్లౌజ్ పై కూడా డిజైన్ చేస్తారు. నేను కూడా మా అమ్మమ్మ నగలను ఇప్పుడు మార్చుకున్నాను అంటూ తెలిపింది సుమ.
జ్యువెలరీ స్టోర్ ఆరంభం.. అద్భుతమైన ఆఫర్లు..
ఇకపోతే ఆర్ఆర్ జ్యువెలర్స్ స్టోర్ ప్రారంభం సందర్భంగా జులై 27 నుండి ఆగస్టు 10 వరకు అద్భుతమైన ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. గొప్ప ప్రారంభ ఆఫర్లతో సహా దాని విస్తృత సేకరణలతో మిమ్మల్ని మరింత ఆనందం చేస్తుందని స్టోరీ యాజమాన్యం తెలిపింది. 50, 000 విలువైన గోల్డ్ ఆభరణాలను కొనుగోలు చేసిన వారికి 100 మిల్లీగ్రామ్ ల గోల్డ్ కాయిన్ ఉచితంగా లభిస్తుంది. అలాగే ప్రతి 50,000 వెండి ఆభరణాలు కొనుగోలుపై 100 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ఉచితంగా పొందవచ్చు.
50 వేల కంటే ఎక్కువ డిజైన్లు..
ఇకపోతే ఈ స్టోర్ నిర్వాహకులు రాధా గంటచాల మాట్లాడుతూ.. అతి తక్కువ సమయంలోనే ప్రజల మన్ననలు పొందిన ఏకైక జ్యువెలరీ స్టోర్ ఇది. మా వద్ద అన్ని ఆభరణాలు హాల్ మార్కు కలిగినవే. మీ పాత ఆభరణాలను కొత్త డిజైన్తో మీకు అందిస్తాము. ఇదే మా ప్రత్యేకత మా దగ్గర అన్ని రకాల వెండి ఆభరణాలు కూడా దొరుకుతాయి. 50 వేల కంటే ఎక్కువ డిజైన్లు మీరు ఎంచుకోవచ్చు. ఇక హైదరాబాద్ ఆర్ఆర్ జ్యువెలర్స్ వారి అతిపెద్ద లగ్జరీ ఆభరణాల దుకాణాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి అంటూ తెలిపారు. మొత్తానికైతే జ్యువెలరీ స్టోర్ ఆరంభోత్సవం ఇప్పుడు మగువలకు నచ్చిన ఆభరణాలను సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.
ALSO READ:Aamir Khan: అమీర్ ఖాన్ ఇంటికి 25 మంది కలెక్టర్లతో పోలీసులు.. షాక్ లో ఇండస్ట్రీ.. కారణం?