BigTV English

Panjabi Industry : పంజాబీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత..

Panjabi Industry : పంజాబీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత..

Panjabi Industry : ఈమధ్య సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటులు ఒక్కొక్కరుగా మరణిస్తూ వస్తున్నారు.. మొన్నటి వరకు తెలుగు ఇండస్ట్రీలో కేవలం రోజులలో వరసగా నటీనటులు మరణించారు. అటు బాలీవుడ్ లో కూడా అదే పరిస్థితి సీనియర్ నటులు పలు కారణాలతో మృత్యు ఒడిలోకి చేరారు.. అలాగే ఇప్పుడు పంజాబీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తాజాగా ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ప్రముఖ కమెడియన్ మరణించారు. ప్రముఖ నటుడు, కమెడియన్ జస్విందర్ భల్లా మరణించారు. వయసు పైబడటంతో గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.. ఇటీవలే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈయన మరణ వార్తతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆయన భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అలాగే పంజాబీ ఇండస్ట్రీలోని స్టార్స్ ఆయన ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.


అనారోగ్య సమస్యలతో ఇబ్బంది..

ఇటీవల కాలంలో 50 ఏళ్లు పైబడిన వారికి అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉన్న వారికి కొన్ని వ్యాధులు అనుకొని అతిధిలాగా పలకరిస్తున్నాయి.. అయితే ఈమధ్య చాలామంది అనారోగ్య సమస్యలతో పోరాడుతూ ఆసుపత్రిలోనే ప్రాణాలను వదులుతున్నారు. అలానే ఈ పంజాబీ నటుడు జస్విందర్ భల్లాల్ కూడా గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు.. కుటుంబ సభ్యులు ఆయన్ని పంజాబ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. సమస్యలు తీవ్రమవ్వడంతో వైద్యులు ఆయనకు అన్ని రకాల పరీక్షలు చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. దాంతో ఆయన ఇవాళ ఆసుపత్రిలోనే ప్రాణాలను వదిలారు.. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.. కమెడియన్ మరణ వార్త విన్న అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.. మంచి నటుడిని కోల్పోయామంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెడుతూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నారు..


Also Read : గర్భవతిగా ఉన్నప్పుడే నన్ను చంపాలని చూశాడు.. హీరోపై భార్య సంచలన కామెంట్స్..

జస్విందర్ భల్లాల్ సినిమాలు.. 

ఈయన 1988లో చంకట 88తో హాస్యనటుడిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు.. దుల్లా భట్టి చిత్రంతో నటుడు అయ్యాడు. అతను తన హాస్య ధారావాహిక చంకట, వివిధ పంజాబీ చిత్రాలలో హాస్య పాత్రలకు ప్రసిద్ధి చెందాడు. అతను రంగస్థల నటనలలో కూడా నటించాడు. ఈయన ఇప్పటివరకు ఎన్నో చిత్రాల్లో నటించి హాస్యనటుడుగా ఎన్నో అవార్డులను అందుకున్నాడు.. చివరగా 2024 లో ఓ సినిమా చేశాడు. ప్రస్తుతం ఆయనకు రెండు మూడు భారీ ప్రాజెక్టులలో నటిస్తున్నాడు.. 65 ఏళ్ల వయసులోనే ఆయనకు మరణించడంతో ఇండస్ట్రీలోని ప్రముఖులు జీర్ణించుకోలేకున్నారు. ఇవాళ ఆయనకు అంత్యక్రియలు స్వగ్రామంలోనే జరగనున్నాయని సమాచారం..

 

Related News

Mega158 : పోస్టర్ లోనే విధ్వంసం, భారీ యాక్షన్ ప్లాన్ చేసిన బాబీ

MEGA 158 Movie : అదే పాత టెంప్లేట్… బాలయ్య మూవీనే చిరు కోసం కాపీ కొడుతున్నాడా?

Hero Dharma Mahesh Wife : గర్భవతిగా ఉన్నప్పుడే నన్ను చంపాలని చూశాడు.. హీరోపై భార్య సంచలన కామెంట్స్..

Ram Gopal Varma : కుక్క కాటు.. ప్రేమ కాటు అనుకుంటారు..సుప్రీం కోర్టు తీర్పు పై వర్మ సంచలన ట్వీట్..

SSMB29 First Look: మహేష్‌, రాజమౌళి మూవీ ఫస్ట్‌లుక్‌ కోసం అవతార్ డైరెక్టర్.. జక్కన స్కేచ్‌ మామూలుగా లేదుగా..

Big Stories

×