BigTV English

BCCI Sponsors : బీసీసీఐని ఆదుకున్న కంపెనీలకు భారీ లాస్.. ఎన్ని కోట్లు అంటే!

BCCI Sponsors : బీసీసీఐని ఆదుకున్న కంపెనీలకు భారీ లాస్.. ఎన్ని కోట్లు అంటే!

BCCI Sponsors : సాధారణంగా స్పోర్ట్స్ వరల్డ్ లో అయితే స్పాన్సర్ షిప్స్ చాలా ముఖ్యం అనే చెప్పాలి. ఇంకా క్రికెట్ లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వీటిలో ఐపీఎల్, టీమిండియా మ్యాచ్ లకు కోట్లాది రూపాయల స్పాన్సర్ షిప్స్ వస్తాయి. కొన్ని సార్లు ఒకే కంపెనీతో చాలా ఏళ్ల పాటు డీలింగ్ కుదుర్చుకుంటారు. ఒక్కోసారి ఆ ఒప్పందాలు అనివార్య కారణాల వల్ల కొద్ది రోజులకే పరిమితమవుతాయి. కొన్నింటితో కుదుర్చుకున్న ఒప్పందాలు అనివార్య కారణాల వల్ల మధ్యలోనే బ్రేక్ అవుతుంటాయి. ఇప్పుడు బీసీసీఐకి అలాంటి పరిస్థితే ఎదరైంది. ఎందుకంటే..? ఆన్ లైన్ గేమింగ్ బిల్లు. దీంతో దేశంలో ఆన్ లైన్ గేమింగ్ ప్యూచర్ ఏమవుతుందనే ఆందోళన మొదలైంది కూడా.


Also Read :  Samson brothers: తమ్ముడి కెప్టెన్సీలో ఆడుతున్న టీమిండియా ప్లేయర్

బీసీసీఐకి భారీ నష్టం.. 


కొద్ది రోజుల కిందటే ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్ లైన్ గేమింగ్ బిల్లు 2025ని లోక్ సభలో ప్రవేశపెట్టారు. వాస్తవానికి ఆన్ లైన్ గేమింగ్ రంగాన్ని కంట్రోల్ చేయడమే ఈ బిల్లు యొక్క లక్ష్యం. ఇది చట్టంగా మారితే ఆన్ లైన్ గేమింగ్ కంపెనీలు క్రికెట్ కి స్పాన్సర్లు ఉండటం కష్టం. దీంతో ఇప్పుడు బీసీసీఐ కి పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం టీమిండియా కి డ్రీమ్ 11 టైటిల్ స్పాన్సర్ గా కొనసాగుతోంది. ఈ డీల్ వాల్యూ రూ.358 కోట్లు. ఇది 2023 నుంచి 2026 వరకు ఉంటుంది. అలాగే ఐపీఎల్ కి మై11 సర్కిల్ ఫాంటసీ గేమింగ్ రైట్స్ తీసుకుంది. ఐదేళ్ల కోసం కుదిరిన ఈ డీల్ విలువ రూ.625 కోట్లు. అంటే ఈ రెండు కంపెనీల నుంచి బీసీసీఐకి ప్రతీ సంవత్సరం వందలాది కోట్ల ఆదాయం లభిస్తోందన్న మాట. ఇప్పుడు ఈ బిల్లు వల్ల ఆ డీల్స్ ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. దీంతో బీసీసీఐకి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

వారందరికీ నష్టాలే..

ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు చట్టంగా మారితే BCCI కొత్త స్పాన్సర్లను వెతుక్కోవడం పెద్ద సమస్య కాదని స్పోర్ట్స్ అనలిస్ట్‌లు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇండియాలో క్రికెట్‌కు ఉండే క్రేజ్ అలాంటిది. స్పాన్సర్లు ఎప్పుడూ రెడీగా ఉంటారు. కానీ ప్లేయర్లకు మాత్రం ఇబ్బందులు తప్పవు. చాలా మంది స్టార్ ప్లేయర్లకు ఈ కంపెనీలతో ఇండివిడ్యువల్ డీల్స్ ఉన్నాయి. ఎంఎస్‌ ధోనీ, రోహిత్ శర్మ, రిషబ్‌ పంత్ లాంటి వాళ్లు డ్రీమ్11కు.. సౌరవ్ గంగూలీ, శుభ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్ లాంటి వాళ్లు మై11సర్కిల్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. ఈ బిల్లు వల్ల ఆ పర్సనల్ డీల్స్ రద్దయ్యే అవకాశం ఉంది. దీంతో క్రికెటర్ల పర్సనల్‌ ఇన్‌కమ్‌ కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉంది. దాదాపు చాలా సంవత్సరాల నుంచి టీమిండియా కి సహారా, బైజూస్, డ్రీమ్ 11 వంటివి స్పాన్సర్లుగా ఉన్నాయి. వాటిలో సహారా ఎప్పుడో దివాలా తీసింది. అలాగే బైజూస్ భారీ నష్టాలను చవిచూసింది. ప్రస్తుతం డ్రీమ్ 11ని నిషేదించేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో టీమిండియాకి స్పాన్సర్స్ చేసిన వారెవ్వరికైనా నష్టాలు తప్పవని స్పష్టంగా తెలుస్తోంది.

Related News

Rohit Sharma Captaincy: డిప్రెష‌న్ లో రోహిత్ శ‌ర్మ‌..షాకింగ్ వీడియో వైర‌ల్‌

Manoj Tiwary: కోహ్లీ, రోహిత్ ఉంటే ప్ర‌శ్నిస్తారు..అందుకే వాళ్ల గొంతు గంభీర్ నొక్కేశాడు

AB de Villiers: కోహ్లీ, రోహిత్‌పై గ్యారెంటీ లేదు..ఇక రిటైర్మెంట్ ఇచ్చేస్తే బెట‌ర్ !

Gautam Gambhir: గంభీర్ మ‌హాముదురు.. ట్రోలింగ్ కు చెక్ పెట్టేందుకు బీరు, బిర్యానీలు పెట్టి మ‌రీ !

Inzamam-ul-Haq: రోహిత్ శ‌ర్మ ఓ ముసలోడు, పందిలాగా ఉంటాడు…అందుకే కెప్టెన్సీ పీకిపారేశారు !

Womens World Cup 2025: నేడు ఇంగ్లాండ్ తో బంగ్లా ఫైట్‌..పాయింట్ల ప‌ట్టిక ఇదే, చిట్ట‌చివ‌ర‌న పాకిస్థాన్‌

IND VS AUS: టీమిండియాతో సిరీస్.. కమిన్స్ లేకుండా ఆసీస్‌..జ‌ట్ల వివ‌రాలు ఇవే

MS Dhoni: రోహిత్‌, కోహ్లీని గెంటేశారు..కానీ ధోనిని ఎవ‌డు కూడా ట‌చ్ చేయ‌లేదు..కార‌ణం ఇదే

Big Stories

×