E-Paper
Advertisement

డిప్రెషన్ మంచిదే.. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు!

డిప్రెషన్ మంచిదే.. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు!
Advertisement

Puri Jagannath : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు వంటి స్టార్ హీరోల కెరీర్ కు గట్టి కం బ్యాక్ ఇచ్చిన ఈయన.. ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతితో కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. మరొకవైపు సోషల్ మీడియా వేదికగా పూరీ మ్యూజింగ్స్ పేరిట పలు విషయాలపై చర్చిస్తూ కొత్త అనుమానాలకు తెర లేపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పూరీ మ్యూజింగ్స్ పాడ్ కాస్ట్ లో భాగంగా డిప్రెషన్ మంచిదే అంటూ తెలిపారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

డిప్రెషన్ మంచిదే..

తాజాగా పూరీ మ్యూజింగ్స్ పాడ్ కాస్ట్ లో డిప్రెషన్ గురించి పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ..” వేగంగా సాగే జీవితంలో ఒంటరితనం మనల్ని మనం నిజాయితీగా విశ్లేషించుకోవడానికి ఉపయోగపడుతుంది . ముఖ్యంగా మన తప్పులను సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇస్తుంది. తీవ్రమైన మానసిక కుంగుబాటు హానికరమే అయినప్పటికీ దానిని ఒక ప్రయోజనకరమైన సంకేతంగా కూడా వాడుకోవచ్చు..” అంటూ తెలిపారు పూరీ. అంతేకాదు ఈ విధంగా డిప్రెషన్ నుంచి గొప్ప విజయాలు సాధించిన లేడీ గాగా, అబ్రహం లింకన్ వంటి ప్రముఖులను కూడా ఉదాహరణగా చెప్పారు . బాధ శాశ్వతం కాదు.. చీకటి తర్వాత కచ్చితంగా వెలుగు వస్తుంది అంటూ పూరీ జగన్నాథ్ తెలిపారు. ఇక ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

also read:8 మంది ముఖ్యమంత్రులతో కలసి నటించిన ఏకైక నటి.. ఎవరంటే?

వివరణ ఇచ్చిన పూరీ జగన్నాథ్..

“సాధారణంగా డిప్రెషన్ అనేది మంచిది కాదు. కానీ తప్పని పరిస్థితిలో ఏదో ఒక సమయంలో మనం కూడా ఈ డిప్రెషన్ లోకి వెళ్లిపోతూ ఉంటాం.. ఒక్కొక్కసారి ఇలాంటి డిప్రెషన్ కి గురై కూర్చోవడం వల్ల ఇండైరెక్టుగా కూడా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక ఈ డిప్రెషన్ వల్ల మనం స్లో డౌన్ అయిపోతాము. ఫాస్ట్ పేస్డ్ లైఫ్ లో ఇలాంటి పాజ్ మనకు చాలా అవసరం. డిప్రెషన్లో ఫ్రెండ్స్ ని కలవడం మానేస్తాం.. మూడ్ ఆఫ్ అయ్యి ఒంటరిగా కూర్చుంటాం.. నిరాశ గాఢమైన ఆలోచనలోకి నెట్టు వేస్తుంది. అయితే అలాంటి సమయంలో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుంటారు ..చాలా నిజాయితీగా మిమ్మల్ని మీరు విశ్లేషించుకుంటారు. మీరు ఒంటరిగా ఉండటం వల్ల మీలో అనలిటికల్ థింకింగ్ కూడా పెరుగుతుంది “‘అంటూ పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు.. ఏది ఏమైనా ఆయన చేసిన ఈ కామెంట్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

పూరీ కామెంట్స్ పై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు..

Advertisement

అయితే పూరీ కామెంట్స్ పై కొంతమంది నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. డిప్రెషన్ వల్ల లాభం పెరుగుతుందని మీరు అంటున్నారు . కానీ ఈ డిప్రెషన్ వల్ల మనుషులు ఒక్కొక్కసారి ఆత్మహత్యకి కూడా పాల్పడతారు అని హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా ఒక నాణేనికి మంచి ఎలాగో చెడు కూడా అలాగే ఉంటుందని గుర్తుంచుకోవాలి అని సలహా ఇస్తున్నారు . ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి .

Related News

మరోసారి చిక్కుల్లో పడ్డ ‘ఇరుముడి’.. రవితేజ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్!

మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి కేసులో బిగ్ ట్విస్ట్.. 24 గంటల డెడ్ లైన్ పెట్టిన మాధురి!

పవన్ కు హిట్ ఇచ్చా.. మహేష్ బాబు విషయంలో బాధపడుతున్న డైరెక్టర్?

సర్దార్ 2 కు 500 కోట్ల కలెక్షన్స్.. జోస్యం చెప్పిన మనోజ్.. అంతా కాన్ఫిడెన్స్ ఏంటీ బ్రో?

ది ప్యారడైజ్ వాయిదా వార్తలకు చెక్… విడుదలపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్!

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’లోకి ఎన్టీఆర్ ఎంట్రీ?

రణబాలి టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్…ఈ సారి రక్తపాతమే!

ఘనంగా చంద్రబోస్ కొడుకు పెళ్లి.. హాజరైన సెలబ్రిటీస్ వీరే!

Big Stories

Advertisement
×