Film industry:సాధారణంగా సినిమా రంగానికి, రాజకీయ రంగానికి మంచి అవినాభావ సంబంధం ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే సినిమాలో నటించిన వాళ్లు రాజకీయాలలో చక్రం తిప్పుతుంటే.. అటు రాజకీయాలలో సత్తాచాటిన వారు సినిమాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు . మన తెలుగు విషయానికి వస్తే.. నందమూరి తారక రామారావు నుంచి నేటి పవన్ కళ్యాణ్ వరకు ఎంతో మంది నటులు అటు సినిమాలలో.. ఇటు రాజకీయ రంగంలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు. అయితే ఇక్కడ ఒక నటి మాత్రం తనకు రాజకీయ రంగంతో సంబంధం లేకపోయినా.. రాజకీయాల్లో తిరుగులేని విజయం సాధించిన నటులతో కలిసి పనిచేసింది . ముఖ్యంగా చెప్పాలి అంటే సినిమా ఇండస్ట్రీని ఏలి.. ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి.. అక్కడ ముఖ్యమంత్రులుగా ప్రజలకు సేవలు అందించిన మొత్తం 8 మంది నటులతో ఈమె కలిసి నటించిందని మీకు తెలుసా? అసలు ఈమె ఎవరు? ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అసలు ఎవరెవరితో ఈమె నటించింది ? అనే విషయాలు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోకమానరు.
ఆమె ఎవరో కాదు ప్రముఖ నటి, సీనియర్ హీరోయిన్ మనోరమ. ఒకప్పుడు తన అందం, అభినయంతో, నటనతో ఆకట్టుకున్న మనోరమ.. ఆ తర్వాత కాలంలో ఆ క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో కూడా మెప్పించింది. వాస్తవానికి ఈమె తమిళ నటి అయినప్పటికీ తెలుగులో కూడా మంచి పేరు సొంతం చేసుకుంది . ముఖ్యంగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క లీడ్ రోల్ పోషిస్తూ వచ్చిన అరుంధతి సినిమాలో చంద్రమ్మ క్యారెక్టర్ తో అదరగొట్టేసింది. ఇక నేడు మన మధ్య లేకపోయినా ఆమె నటించిన ఎన్నో చిత్రాలు, పాత్రలు మన కళ్ళ ముందు తారసపడతాయి అనడంలో సందేహం లేదు.

ఇక అలాంటి ఈమె ఏకంగా 8 మంది ముఖ్యమంత్రులతో కలిసి నటించింది. తమిళనాడు సీఎం సి.ఎన్ అన్నాదురైతో తొలిసారి నటించింది. అన్నాదురై రాసి, నటించిన ఎన్నో స్టేజ్ నాటకాలలో మనోరమ నటించింది. ఇక తమిళనాడు సీఎం ఎం.జీ.రామచంద్రన్ తో కలసి అన్బేవా, కలంగరై విలక్కం వంటి పలు చిత్రాలలో నటించింది. ఇక కరుణానిధితో ఉదయ్ సూర్యున్ అనే నాటకంలో చేసిన ఈమె.. ఆయన రచించిన ఎన్నో సినిమాలలో నటించింది కూడా.. ఇక మన అన్నగారు అలియాస్ స్వర్గీయ నందమూరి తారక రామారావు తో కలిసి లవకుశ తో పాటు మరికొన్ని చిత్రాలలో నటించింది. ఇక అలాగే జయలలితతో సూర్యగంధి, బొమ్మళాట్టం వంటి సినిమాలలో కలసి నటించినది. అలాగే కొంతకాలం సీఎంగా పనిచేసిన జానకి రామచంద్రన్ తో కూడా మోహిని అనే సినిమాలో నటించిన ఈమె.. మాజీ సీఎం ఎం.కె స్టాలిన్ తో కూడా ఒరే రత్తం సినిమాలో నటించింది. మనోరమ ఇప్పుడు 8వ సీఎం విజయ్ దళపతితో కూడా రసిగన్ , దేవా వంటి సినిమాలలో నటించింది. అలా మొత్తానికైతే 8 మంది ముఖ్యమంత్రులతో కలిసి నటించిన ఈమె.. 1500కు పైగా చిత్రాలు.. వెయ్యికి పైగా నాటకాలలో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా స్థానం సంపాదించుకుంది. హీరోయిన్గా ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఎక్కువగా క్యారెక్టర్ రోల్స్, కామెడీ రోల్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
also read:విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.. స్పెషల్ అట్రాక్షన్ గా త్రిష!