E-Paper
Advertisement

Pushpa 2: జపాన్ లో కూడా సత్తా చాటిన పుష్పరాజ్.. క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలివే!

Pushpa 2: జపాన్ లో కూడా సత్తా చాటిన పుష్పరాజ్.. క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలివే!
Advertisement

Pushpa 2: ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)ముచ్చటగా మూడోసారి నటించిన చిత్రం పుష్ప. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ఆర్య, ఆర్య 2 సినిమాలు వచ్చి సందడి చేసిన విషయం తెలిసిందే. ఇక పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్. దాంతో ఈ సినిమా సీక్వెల్ పై అందరి అంచనాలు ఏర్పడ్డ విషయం తెలిసిందే. అందులో భాగంగానే భారీ అంచనాల మధ్య 2024 డిసెంబర్ 5వ తేదీన చాలా గ్రాండ్ గా విడుదలై సంచలనం సృష్టించింది పుష్ప 2. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న (Rashmika mandanna).హీరోయిన్గా నటించింది.

కలెక్షన్లతో బాక్సాఫీస్ శాసించిన పుష్పరాజ్..

జగపతిబాబు, అనసూయ భరద్వాజ్ , సునీల్, జగదీష్ భండారీ తదితరులు కీలకపాత్రలు పోషించారు ముఖ్యంగా పుష్ప సినిమాలో సమంత (Samantha) ఏ రేంజ్ లో అయితే స్పెషల్ సాంగ్ చేసే అలరించిందో.. అదే రేంజిలో పుష్ప 2 శ్రీ లీలా కూడా స్పెషల్ సాంగ్ చేసి మెప్పించింది. మైత్రి మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా ఏకంగా 1800 కోట్ల రూపాయలకు పైగా వసూలు సాధించి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే సంచలన విజయం సాధించింది.. ముఖ్యంగా 50 రోజులపాటు వరల్డ్ బాక్సాఫీస్ ను పుష్పరాజ్ తన కలెక్షన్లతో శాసించాడు అనడంలో సందేహం లేదు.

జపాన్ లో విడుదలైన పుష్ప 2..

Advertisement

అలాంటి ఈ సినిమాను ఈ ఏడాది జపాన్లో జనవరి 16వ తేదీన చాలా గ్రాండ్గా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే..ఇక ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో పాటు ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న కూడా వెళ్లి అక్కడ ప్రమోషన్స్ చేశారు. ముఖ్యంగా రష్మిక , అల్లు అర్జున్ ఇద్దరూ కూడా జపాన్ భాషలో మాట్లాడి అక్కడి ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నారు. ఇక వీరి ప్రమోషన్స్ కి అక్కడి అభిమానుల ఆదరణ కూడా భారీగా లభించింది.

ALSO READ:Sumathi Sathakam Amardeep: రవితేజ మాస్టారూ ప్రశంసల వరకేనా..అవకాశం ఏమైనా ఉందా?

కలెక్షన్లతో అక్కడ కూడా సత్తా..

Advertisement

అయితే ఈ సినిమా విడుదలైన రెండు మూడు రోజుల్లో మాత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఆ తర్వాత ఈ సినిమా అనూహ్యంగా పుంజుకొని భారీ వసూళ్లు సొంతం చేసుకుంది. ముఖ్యంగా జపాన్లో అల్లు అర్జున్ క్రేజ్ కి మంచి స్పందన లభించడంతో అక్కడ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కూడా భారీగా వచ్చాయి. గత 14 రోజుల్లో ఈ సినిమాను సుమారుగా 17వేల మంది జపనీయులు చూశారు .దాంతో ఈ సినిమా 105 మిలియన్ యెన్స్ వసూలు చేసింది. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్షరాల 6 కోట్లకి పైగా కలెక్షన్లు సాధించింది అని అక్కడ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×