R.Madhavan: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు మాధవన్ (Madhavan ). కోలీవుడ్ కే పరిమితం కాకుండా భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా సెలబ్రిటీ అయిపోయారు. హిందీ, తమిళ్, తెలుగు చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన తాజాగా హిందీలో నటిస్తున్న చిత్రం ‘ఆప్ జైసా కోయి’. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న మాధవన్ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే మొన్నటికి మొన్న పెళ్లయిన హీరోయిన్లు రొమాన్స్ కి పనికిరారు అని చెప్పిన ఈయన.. ఇక నిన్నటికి నిన్న తాను ఇకపై రొమాంటిక్ సన్నివేశాలు చేయలేను అని చెప్పారు.
అయితే ఇప్పుడు భాషా వివాదంలో వేలు పెట్టినట్లు తెలుస్తోంది.. అందులో భాగంగానే గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలలో భాషా పరమైన వివాదాలు చెలరేగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ భాషా వివాదం పై ఆర్. మాధవన్ స్పందించారు.
భాషా వివాదం పై ఆర్.మాధవన్ కామెంట్స్..
భాషా వివాదంపై మాధవన్ మాట్లాడుతూ.. “ఇన్నేళ్ల నా కెరియర్ లో నేనెప్పుడూ కూడా భాష కారణంగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. నేను తమిళం, హిందీ రెండూ మాట్లాడగలను. అందుకే నాకు దీనిపై ఎప్పుడు ఏ సమస్య రాలేదు అంటూ చెప్పారు. ముఖ్యంగా వివిధ ప్రాంతాలలో విభిన్న సంస్కృతులు ఉంటాయని చెప్పిన మాధవన్.. ఇండైరెక్టుగా భాష నేర్చుకొని వారిపై కామెంట్లు చేశారేమో అని కొంతమంది వార్తలు వైరల్ చేస్తున్నారు.. ఏది ఏమైనా అసలే భాష పరమైన వివాదాలు చెలరేగుతున్న సమయంలో ఆర్.మాధవన్ చేసిన కామెంట్లు ఇప్పుడు మళ్లీ విమర్శలకు దారితీస్తున్నాయి.
భాషా వివాదంపై స్పందించిన శిఖర్ పహారియా..
ఇప్పుడు ఇదే భాషా వివాదం పై నటుడు శిఖర్ ఫహరియా కూడా ఇంస్టాగ్రామ్ వేదికగా స్పందించారు. “భాషకు మంచి ప్రాధాన్యత ఉంది. మనకు ఎన్నో ఇచ్చింది. అన్నీ భాషల్లాగే మరాఠీ కి కూడా గుర్తింపు గౌరవం దక్కాలి. అయితే ఇది ఇతరుల గౌరవానికి ఇబ్బంది కలిగేలా ఉండకూడదు” అంటూ రాసుకు వచ్చారు.
మహారాష్ట్రలో ఏర్పడిన భాషా వివాదం..
ఇకపోతే మహారాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రాథమిక పాఠశాలలో మరాఠీ, ఇంగ్లీష్ తో పాటు హిందీని మూడో భాషగా తప్పనిసరి చేయడంతో వివాదం చెలరేగిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో నివసించేవారు కచ్చితంగా మరాఠీ నేర్చుకోవాలంటూ పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. మరొకవైపు జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు కేంద్ర ప్రభుత్వాల మధ్య కూడా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇలా ఈ భాషల కారణంగానే వివాదం చెలరేగుతున్న సమయంలో మాధవన్ చేసిన కామెంట్లు ఇప్పుడు పలు రకాల అనుమానాలకు దారితీస్తున్నాయి. ఏది ఏమైనా ఆర్.మాధవన్ అటు శిఖర్ ఫహారియా కూడా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ALSO READ:Riythvika:ఎంగేజ్మెంట్ చేసుకొని సడెన్ షాక్ ఇచ్చిన బిగ్ బాస్ 2 విన్నర్!