AP Politics: జగన్ యాత్ర సక్సెస్ అంటు వైసిపి, పరామర్శ పేరుతో హాడావుడి తప్ప జరిగిందేమి లేదంటు కూటమి నేతలు అంటుంటే పోలీసు ఉన్నతాధికారులు మాత్రం అసలు లోపం ఎక్కడా జరిగిందా అని అలోచనలో పడ్డారంట.. 800 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగించినా ఎందుకు వారిని సమర్థంగా వినియోగించుకోలేక పోయారు.. ఎక్కడ తప్పు జరిగింది..ప్లానింగ్ ఉందా లేదా.. అసలు క్షేత్ర స్థాయి సిబ్బందితో ఎందుకు సరిగా పనిచేయించుకోలేక పోయారు.. హాడావుడి తప్ప ప్లానింగ్ చేయలేక పోయారా.. కోవర్ట్ పోలీసుల వల్ల దెబ్బ పడిందా అంటు అరాలు తీస్తున్నారంట.. ఆ క్రమంలో జగన్ బంగారు పాళ్యం పర్యటన రోజులు గడుస్తున్నా చర్చల్లో నలుగుతూనే ఉంది.
జగన్ బంగారుపాళ్యం పర్యటనపై అధికార పక్షం విమర్శలు
చిత్తూరు జిల్లా బంగారు పాళ్యంలో మాజి సియం జగన్ రెడ్డి పర్యటనపై అధికార పక్షం విమర్శలు గుప్పిస్తుంటే… వైసీపీ నేతలు పలువురు తమ బల నిరూపణ అయిందని సంతృప్తి చెందుతున్నారు.. అయితే పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలు పరిశీలిస్తే నిఘా వైఫల్యం అడుగడుగునా కనిపిస్తోంది..హెలిపాడ్ వద్దకు కేవలం 30 మందిని మాత్రమే అనుమతిస్తామని ఎస్పీ మణికంఠచందోలు ప్రకటించారు..అయితే అక్కడికి మూడు వేల మంది వచ్చారు. ర్యాలీకి అనుమతి లేదన్నారు. కాని మాజీ సియం 10 కిలోమీటర్ల దూరం ఏకంగా రెండున్నర గంటల పాటు హెలిపాడ్ నుంచి బంగారు పాళ్యం మార్కెట్ వరకు భారీ ర్యాలీగా వచ్చారు.
రెడీగా ఉంచిన టాక్టర్లను పోలీసు అధికారులు గుర్తించలేదా?
ర్యాలీ కొససాగిన మార్గం మధ్యలో ఐదు ట్రాక్టర్ల మామిడి కాయాలను రహాదారిపై పోసి తొక్కించారు. అక్కడ సమీపంలో రెడీగా ఉండిచిన ట్రాక్టర్లను పోలీసు అధికారులు గుర్తించలేక పోయారా?..ఆవిషయం నిఘా వర్గాలు ముందుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు పోలేదా? అన్న ప్రశ్నలకు సమాధానంలేదు. మరోవైపు కేవలం 500 మందిని మాత్రమే మార్కెట్ యార్డ్ లోకి అనుమతిస్తామని చెప్పిన పోలీసు ఉన్నతాధికారులు 10 గంటల వరకు కఠినంగా వ్యవహారించి, తర్వాత చేతులెత్తేసినట్లు ఒక్కసారిగా మూడు వేలమందిని ఎందుకు మార్కెట్ యార్డులోకి అనుమతించారు?.. వచ్చిన వారిని నియంత్రించకుండా జగన్ వచ్చినప్పుడు మొత్తం కార్యకర్తలను ఎందుకు వదిలేశారు? ఇవన్ని కొందరు పోలీసు అధికారులు ముందుగానే ప్లాన్ చేసుకుని వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి
మీడియా సమావేశం స్థలం వద్ద మాత్రమే బ్యారికేడ్లు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్ పర్యటనల సందర్భంగా గతంలో కేవలం డీఎస్పీ స్థాయి అధికారి బందోబస్తు పర్యవేక్షించేవారు. టిడిపికి చెందిన వాలంటీర్లు సహాకరించేవారు. దాంతో పాటు ఎక్కడి కక్కడ బారికేడ్లు కట్టేవారు. నేతలు జనంలోకి వెళ్ళేటప్పుడు వాలంటీర్లు రోప్‌తో ఉండే వారు. బారికేడ్లను సైతం టిడిపి పార్టీ వారే ఏర్పాటు చేసేవారు. పోలీసులు ప్లానింగ్ ఇచ్చేవారు. కాని ప్రస్తుతం పోలీసులు బంగారు పాళ్యం మార్కెట్‌లో బారికేడ్లు కేవలం మీడియా సమావేశం వద్ద మాత్రమే ఏర్పాటు చేశారు. రెండు గంటలు పైగా జగన్ అలస్యంగా రావడంతో క్యాడర్ మొత్తం మీడియా ఉండాల్సిన చోటుకు వచ్చేసింది.. ఇలాంటి స్థితిలో మీడియా కూడా ఇబ్బంది పడింది.
అడుగడుగునా బయటపడినా చిత్తూరు జిల్లా ఎస్బీ అధికారుల వైఫల్యం
ఆ క్రమంలో చిత్తూరు జిల్లా ఎస్బీ అధికారులు వైఫల్యం అడుగడుగునా బయటపడింది.. గతంలో వైసీపీ ప్రభుత్వ సమయంలో పనిచేసిన అధికారులే ఇప్పుడు కొనసాగుతున్నారు. వారిపై విమర్శలు వస్తున్నప్పటికి ఏమాత్రం ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని అంటున్నారు. దానికి తోడు జిల్లాలో కీలక స్థానాలలో ఉన్న పోలీసు అధికారులపై విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా లోకేష్ పాదయాత్ర సమయంలో నగరిలో అనేక ఇబ్బందులు పెట్టిన మహిళా అధికారిని ఏరికోరి తెచ్చుకున్నారు. ఆ అధికారిని హోం మంత్రి కార్యాలయం సైతం పక్కన పెట్టాలని ఆదేశించినా జిల్లా ఉన్నతాధికారులు కొనసాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
కోటరీ చెప్పిందే వింటూ మిగిలిన వారిని ఇబ్బంది పెడుతున్న ఉన్నతాధికారి
ఉన్నతాధికారి సైతం ఓ కోటరిని ఏర్పాటు చేసుకుని వారి చెప్పిందే వింటు మిగతా అధికారులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఓ కమ్యూనిటి అధికారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాడనే ప్రచారం జరుగుతుంది. దానికి తోడు జగన్ పర్యటన సందర్భంగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం కూడా అనేక ఇబ్బందులకు కారణమైందని అంటున్నారు. మొత్తం మీదా జిల్లాలో అసలు ప్రజా ప్రతినిధుల మాటను జిల్లా ఉన్నతాధికారులు ఎవ్వరు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మామిడి ఇష్యూ పై పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగుతున్న సమయంలో టోకన్లు కూడా కొంతమంది పోలీసులు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారంట. రోజుకు 25 టోకన్లు తీసుకుని వాటిని బయట రైతులకు ఒక్కో టోకన్ 2వేలకు అమ్ముకుంటున్నారంట.. అంటే రోజుకు 50 వేల ఆదాయం సంపాదిస్తున్నారన్న మాట
జనం వస్తే చాలని భావించిన వైసీపీ నేతలు
బంగారు పాళ్యం మార్కెట్ యార్డు పరిశీలనకు జగన్ 10 వతేది వస్తున్నట్లు 10 రోజుల ముందే ప్రకటించారు. అప్పడు సంబంధింత ఇన్చార్జ్ అనుమతుల కోసం వచ్చినప్పుడు మార్కెట్ యార్డులో చేయాల్సిన ఏర్పాట్లు గురించి అధికారులు ప్రస్తావించ లేదా? ముఖ్యంగా ఓ ప్లానింగ్ కూడా లేకుండా కార్యక్రమం జరిగింది.. వైసిపి నేతలు జనం వస్తే చాలని భావించారు. కాని సంఘ విద్రోహ శక్తులు గుంపులోకి చొరబడి దాడి చేసి ఉంటే పరిస్థితి ఏంటని ఎవరూ ఆలోచించలేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీడియా తో మాట్లాడానికి వచ్చే వచ్చేటప్పుడు, మాట్లాడి తిరిగి వెళ్ళే టప్పుడు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.వెనుక ముందు అయనను కార్యకర్తలు గుంజుతూనే ఉన్నారు. ఒకానొక దశలో అయన విసుక్కున్నారు.
జగన్ పర్యటన ఏర్పాట్లకు ఏజన్సీని ఏర్పాటు చేసుకునే ప్రతిపాదన
ఏమాత్రం క్రమ శిక్షణ పాటించకుండా క్యాడర్ వ్యవహారించారని వైసిపి నేతలు తమ అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నారంట.ఇక నుంచి జగన్ యాత్రలను పటిష్టంగా నిర్వహించడానికి ఓ ఏజెన్సీ ని సైతం ఏర్పాటు చేసుకోవాలన్న ప్రతిపాదన అగ్రనేతలు తీసుకు వచ్చారంట. ముఖ్యంగా జగన్ వాహానం మీదకు క్యాడర్ వచ్చి చుట్టుముట్టడంతో జగన్ సుమారు అరగంట పాటు జనం మద్య చిక్కుకు పోయారు. చివరకు జిల్లా అగ్ర నేతలు ఎవ్వరు కనీసం జగన్ దగ్గరకు కూడా రాలేక పోయారు.
Also Read: మహిళలకు తీపి కబురు.. ఇక వారికి డబ్బే డబ్బు
క్యాడర్ మీద పడటంతో తప్పించుకుని వెళ్లిన రోజా
మాజీ మంత్రి రోజా అయితే రెండు నిమిషాల పాటు ఉండి, క్యాడర్ మీద పడ్డంతో అక్కడనుంచి తప్పించుకోని పోవాల్సి వచ్చింది. హెలిపాడ్‌కు వెళ్ళే సమయంలో చిత్తూరు ఇన్ చార్జ్ విజాయానందరెడ్డిని కొంతమంది పోలీసులను తొక్కి పడేసారు.. చివరకు పోలీసులు అయనను లేపి బయటకు పంపాల్సి వచ్చింది.. ఆ క్రమంలో ఇది రైతుల పరామర్శ కాకుండా బలప్రదర్శన లా మారి, తమకే బూమరాంగ్ అయిందని చివరకు పార్టీలోని వారే అంటున్నారంట. పోలీసు ఉన్నతాధికారులు బంగారుపాళ్యంలో తమ డిపార్ట్‌మెంట్ వైఫల్యాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
Story By KLN, Bigtv