Tata Cheapest SUV To Rival Mahindra Thar| టాటా మోటార్స్ చాలా తక్కువ ధరలోనే కొత్త 4X4 SUV అభివృద్ధి చేస్తోందని గత సంవత్సరమే వార్తలు వినిపించాయి. అయితే ఆ విషయాన్ని టాటా కంపెనీ ధృవీకరించలేదు. కానీ ఇప్పుడు, విశ్వసనీయ సమాచారం ప్రకారం టాటా మోటార్స్ నిజంగానే ఓ కొత్త బడ్జెట్ SUV తీసుకురాబోతోంది. దీని కోడ్ నేమ్ స్కార్ లెట్ (‘Scarlet’). ఈ స్కార్ లెట్ SUV, మార్కెట్‌లో మహీంద్రా థార్‌కు గట్టిపోటీ ఇవ్వబోతోంది.
స్కార్‌లెట్ SUV – ప్రత్యేకలు ఇవే?
ఈ కొత్త టాటా SUV దాదాపుగా టాటా నెక్సాన్ లాంటి పొడవు (సబ్-4 మీటర్) కలిగి ఉంటుంది. అయితే డిజైన్ మాత్రం బాక్సీ (చట్రంగా) ఉంటుంది. దీనివల్ల అంతర్గతంగా ఎక్కువ స్పేస్ లభిస్తుంది. నెక్సాన్‌తో పోలిస్తే ఇది మరింత గట్టిగా, రఫ్ అండ్ టఫ్ స్టైల్‌లో ఉంటుంది.
ఈ SUVలో రెండు రకాల ఇంజిన్ల ఆప్షన్లు ఉంటాయి – ఐసీఈ (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) ఎలక్ట్రిక్ (EV).
ICE వెర్షన్ – Curvvలో ఉన్న ATLAS ప్లాట్‌ఫామ్ మీద తయారవుతుంది.
EV వెర్షన్ Acti.ev ప్లాట్‌ఫామ్ మీద తయారవుతుంది.
ICE వెర్షన్‌లో కేవలం 2-వీల్ డ్రైవ్ మాత్రమే ఉంటుంది. కానీ EV వెర్షన్‌కి AWD (ఆల్ వీల్ డ్రైవ్) ఆప్షన్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇది హ్యారియర్ EVలో లాంటి ఫీచర్ కావచ్చు.
ఇంజిన్ డీటెయిల్స్:
ఈ కొత్త SUVకి నెక్సాన్‌లో వాడే 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, Curvvలో కనిపించే కొత్త TGDI 1.2-లీటర్ ఇంజిన్ లేదా కొత్తగా అభివృద్ధి చేస్తున్న 1.5-లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కూడా ఉండొచ్చు. డీజిల్ వెర్షన్ అయితే ఉండదు.
EV వెర్షన్ విషయానికి వస్తే, Curvv EVలో ఉన్న బ్యాటరీ మరియు మోటార్లు ఇందులో కూడా ఉపయోగించే అవకాశం ఉంది.
స్కార్ లెట్ ధర ఎంత ఉంటుంది?
ఈ SUVను టాటా మోటార్స్ రూ. 15 లక్షల వద్ద ప్రారంభ ధరతో తీసుకురావొచ్చని అంచనాలు ఉన్నాయి. ఇది నెక్సాన్ కంటే కొంచెం ఖరీదైనదిగా, కానీ Curvv కంటే చవకగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
సబ్ 4 మీటర్ (Sub-4 meter) కేటగిరీలో ఉన్న ఈ SUVపై టాటాకు ఇప్పటికే మంచి ఆధిపత్యం ఉంది (నెక్సాన్, పంచ్ వంటి మోడల్స్‌తో). అందుకే ఈ కొత్త మోడల్‌ను కూడా అట్టహాసంగా తీసుకొచ్చేలా చూస్తున్నారు.
ఫీచర్లు?
ఈ SUVలో నెక్సాన్ కంటే మరింత ప్రీమియం ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. AWDతో వచ్చే EV వెర్షన్ అయితే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది మహీంద్రా థార్, మారుతి జిమ్నీ వంటి SUVలకి గట్టిపోటీ ఇస్తుంది.
Also Read: అమెరికాలో మాంసాహారం తినే ఈగల బెడద.. చనిపోతున్న పశువులు..
లాంచ్ ఎప్పుడంటే?
ఈ కొత్త టాటా SUV 2030లోపు ఏదైనా సమయంలో మార్కెట్లోకి రావొచ్చు. టాటా మోటార్స్ ఇప్పటికే EV సెక్టార్‌లోను, SUV విభాగంలోను బలంగా ఉంది. ఇక ఈ కొత్త బడ్జెట్ మోడల్‌తో మరింత దూకుడుగా ముందుకు వెళ్లనుంది.