Ragile Ragile Song: సినీ నటుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఇటీవల కింగ్డమ్ సినిమా(Kingdom) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి (Gautham Tinnanuri)దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ , భాగ్యశ్రీ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా జూలై 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. గత కొంతకాలంగా ఎలాంటి సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న విజయ్ దేవరకొండకు ఈ సినిమా కాస్త ఉపశమనం కలిగించిందని చెప్పాలి.
మ్యూజిక్ తో మాయ చేసిన అనిరుద్..
ఇలా థియేటర్లలో ఎంతో మంచి ఆచరణ సొంతం చేసుకున్న ఈ సినిమా స్పై యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ రగిలే రగిలే(Ragile Ragile) అంటూ సాగిపోయే ఫుల్ వీడియో సాంగ్ ను యూట్యూబ్లో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్(Anirudh Ravichandran) సంగీత సారధ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రగిలే పాటను కూడా స్వయంగా అనిరుద్ పాడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పాటను విడుదల చేయడంతో ఇది చూస్తున్న అభిమానులకు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తుందని చెప్పాలి.
తదుపరి సినిమాలపై ఫోకస్ చేసిన విజయ్ దేవరకొండ..
ఇదివరకే ఈ పాటకు ఎంతో మంచి ఆదరణ లభించింది అయితే ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేయడంతో మరోసారి ట్రెండింగ్ లో ఉంది. కింగ్డమ్ సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన తదుపరి సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. విజయ్ దేవరకొండ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు రవి కిరణ్ కోలా దర్శకత్వంలో మరో సినిమా కూడా రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాకు రౌడీ జనార్దన్ అనే టైటిల్ పెట్టాలని ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన కీర్తి సురేష్ నటించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ రెండు సినిమా పనులలో విజయ్ దేవరకొండ బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్నాయి. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్నాయి. ఇక విజయ్ దేవరకొండ చివరిగా ఫ్యామిలీ స్టార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. విజయ్ దేవరకొండ సినీ కెరియర్ లో అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాయి. ఈ సినిమాల తరహాలో మరే సినిమాలు కూడా సక్సెస్ అందుకోలేక పోయాయి. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా ద్వారా హిట్ కొట్టారు.
Also Read: Mokshagna teja: హమ్మయ్య .. పట్టాలెక్కుతున్న మోక్షజ్ఞ సినిమా.. క్లారిటీ ఇచ్చిన హీరో!