Ravi Teja ART Cinemas Multiplex Grand Launching: సినీ ప్రియులకు గుడ్ న్యూస్. సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో కొత్త మల్టీప్లెక్స్ ప్రారంభం అది కాబోతున్నాయి. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ప్రీమియర్స్ తో ఈ మల్టీప్లెక్స్ లు గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నాయి. అయితే చైన్ బిజినెస్ ప్రముఖ టాలీవుడ్ హీరో భాగం అయ్యారు. కాగా మన స్టార్ హీరోలు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు బిజినెస్ రంగంలోనూ సత్తాచాటుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది మన టాలీవుడ్ హీరోలు మల్టీప్లెక్స్ బిజినెస్ లో దూసుకుపోతున్నారు. ఏఎంబీ సినిమాస్ (AMB Cinemas) పేరుతో సూపర్ స్టార్ మహేష్ బాబు మల్టీప్లెక్స్ బిజినెస్ లో అడుగుపెట్టి దూసుకుపోతున్నారు.
రవితేజ ఆర్ట్ మల్టీప్లెక్స్ (ART)
అలాగే అల్లు అర్జున్ సైతం ఏఏఏ (AAA) పేరుతో మల్టీప్లెక్స్ స్టార్ట్ చేశారు. విజయ్ దేవరకొండ వారి బాటలోనే ఏవీడీ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ వ్యాపారంలో దిగాడు. ఇప్పుడు మాస్ మహారాజా కూడా ఈ బిజినెస్ లోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రముఖ ఏషియన్ సంస్థతో కలిసి రవితేజ తన పేరుతో మల్టీప్లెక్స్ ను లాంచ్ చేయబోతున్నారు. ఇటీవల ఏషియన్ సినిమాస్ తో కలిసి తాను మల్టీప్లెక్స్ నిర్మాణాన్ని చేపట్టబోతున్నట్టు రవితేజ ఇప్పటికే ప్రకటించారు. భారీగా ఈ మల్టీప్లెక్స్ నిర్మాణాలను కూడా చేపట్టి తాజాగా వీటి గ్రాండ్ లాంచ్ కి ముహుర్తం కూడా ఫిక్స్ చేశారు. ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో అత్యాధునిక సాంకేతికత, అద్భుతమైన విజువల్స్, సౌండ్ తో భారీగా వీటిని నిర్మాణాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ శివారులోని వనస్థలిపురంగా ఆర్ట్ సినిమా మల్టీప్లెక్స్ ను నిర్మించారు.
ART సినిమాస్ ప్రత్యేకతలు ఇవే
అసమానమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించడమే ప్రధాన లక్ష్యంగా ఆర్ట్ మల్టీప్లెక్స్ లను నిర్మాణం జరిగింది. అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని కోరుకునే మూవీ లవర్స్ ని ఆకర్షించేలా అదునాత టెక్సాలజీలతో ఈ థియేటర్ల నిర్మాణం జరిగింది. ఇందులో ఆరు స్క్రీన్ లు, అత్యాధునిక ఆడియో, వీడియో సిస్టమ్ లతో అద్భుతమైన విజువల్ ఎక్స్ పీరియన్స్ అనుభవాన్ని అందిస్తాయి. 57 అడుగుల వెడల్పుతో భారీ స్క్రీన్, 4కె టెక్సాలజీలో డాల్బీ అట్మాస్ సౌండ్ తో వీటిని నిర్మించారు. రాష్ట్రంలో డాల్బీ అట్మాస్ సౌండ్, 4కె టాక్నాలజీ నిర్మించిన తొలి మల్టీప్లెక్స్ ఇదే కావడం విశేషం. ఇప్పటికే పలు టెస్టింగ్ అనంతరం ఈ మల్టీప్లెక్స్ ను జూలై 24న గ్రాండ్ లాంచ్ చేయబోతున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులతో ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవం జరగనుందని సమాచారం.
అత్యాధునిక సదుపాయాలతో..
కాగా ఏఆర్ టీ మల్టీప్లెక్స్‌ను అత్యాధునిక సాంకేతికతతో నిర్మించినట్లు సమాచారం సుమారు 57 అడుగుల వెడల్పుతో భారీ స్క్రీన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, సినిమా ప్రేమికులకు సరికొత్త అనుభూతిని అందించే విధంగా సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయయని తెలుస్తోంది. ఇప్పటికే పలు సార్లు టెస్టింగ్ ప్రక్రియ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. త్వరలో టాలీవుడ్ ప్రముఖులతో ఈ మల్టీ ప్లెక్స్ ను గ్రాండ్ గా ఓపెనింగ్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: వీరమల్లు సెన్సార్ షాక్… అయ్యో.. అర్జున్ దాస్ వాయిసే కటే చేసేరే!