Rahul Sipligunj : టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన గాయకుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఏకంగా ఈయన పాడిన పాటకు ఆస్కార్ అవార్డు(Oscar Award) కూడా దక్కింది. ఇలా సింగర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రాహుల్ ప్రస్తుతం పలు సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా రాహుల్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. నేడు స్వాతంత్ర్య దినోత్సవాన్ని (Independence Day)పురస్కరించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేతుల మీదుగా కోటి రూపాయల చెక్కు రాహుల్ అందుకున్న విషయం తెలిసిందే.
చాలా గౌరవంగా ఉంది..
ముఖ్యమంత్రి చేతుల మీదుగా కోటి రూపాయల చెక్కు అందుకున్న నేపథ్యంలో ఈయన సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. “ఒక కళాకారుడిగా ఇది నాకు ఎంతో గర్వకారణం. ప్రత్యేక స్వాతంత్ర్య దినోత్సవం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతులమీదుగా కోటి రూపాయల చెక్ అందుకోవడం నాకు చాలా గౌరవంగా ఉంది” అంటూ ఈయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో టాలెంట్ ఉన్న కళాకారుడికి దక్కిన నిజమైన గౌరవం అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.
కోటి రూపాయల చెక్ అందించిన రేవంత్ రెడ్డి…
ఇలా రాహుల్ సీఎం చేతుల మీదుగా ఇలాంటి గౌరవాన్ని అందుకున్న నేపథ్యంలో ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే రాహుల్ కు తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల చెక్కు అందచేయడానికి కారణం లేకపోలేదు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు ఇటీవల గద్ద ఫిలిం అవార్డులను(Gaddar Film Awards) ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ అవార్డు కార్యక్రమాలలో భాగంగా సింగర్ రాహుల్ కోసం ఏదైనా అవార్డు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది . ఈయన పాడిన పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన నేపథ్యంలోనే తనకు సరైన గౌరవం లభించాలని భావించారు.
A true pride moment for me as an artist! 🙏❤️ On this special Independence Day 🇮🇳, I was honoured to receive a ₹1 Crore cheque from Hon’ble CM @revanth_anumula Anna #RevanthReddy garu, with my greatest blessing my #Mom ❤️ by my side, and heartfelt thanks to Smt.@ChekkaKarnan… pic.twitter.com/9rNDNXFswk
— Rahul Sipligunj (@Rahulsipligunj) August 15, 2025
ఈ క్రమంలోనే ఆషాడం బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాహుల్ సిప్లిగంజ్ కు కోటి రూపాయల ప్రైజ్ మనీ ప్రకటించారు. ఇకపోతే నేడు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గోల్కొండలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్ అందజేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రాహుల్ తనలో దాగి ఉన్న టాలెంట్ బయట పెడుతూ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఏకంగా ఆస్కార్ అవార్డు విజేతగా నిలవడం మామూలు విషయం కాదని చెప్పాలి.
Also Read: Kriti sanon: ఖరీదైన లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన ప్రభాస్ బ్యూటీ…ధర ఎంతంటే?