Onion juice: ప్రతి స్త్రీకి పొడవైన, దృఢమైన, ఆరోగ్యకరమైన జుట్టు కావాలని ఆశ ఉంటుంది. కానీ నేటి జీవనశైలిలో జుట్టుకు రాలడం పెద్ద సమస్యగా మారింది. ఒత్తిడి, ఆహార సమస్యలు దీనికి ఒక కారణం అయితే మరో కారణం రైన్ సీజన్ కూడా. ఈ వానాకాలంలో జుట్టు రాలడం సమస్య గురించి చెప్పనక్కర్లేదు. కొన్నిసార్లు తక్కువ జుట్టు ఉన్న వారు కూడా జుట్టు సమస్యలకు బలవుతారు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు హోం రెమెడీని ఉపయోగిస్తుంటారు.
అదేంటంటే ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు అప్లై చేయడం. అలా రసాన్ని అప్లై చేయడం వలన జుట్ట ఒత్తుగా పెరుగుతుందని బలంగా నమ్ముతారు. అదైతే నిజమే కానీ, అలా ఉల్లి రసాన్ని తీసిన వెంటనే తలకు అప్లై చేయడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఉల్లి రసం తీసిన వెంటనే తలకు పట్టిస్తే తలనొప్పి, కళ్లు మండి కళ్ల నుంచి నీరు రావడం జరుగుతుంది, అంతేకాదు మొఖం పై వేడి కురుపులు కూడా వస్తాయని చెబుతున్నారు.
Also Read:Anantapur Crime: గర్భిణి ఆత్మహత్య.. వారి పేర్లు చెబుతూ వాయిస్ రికార్డు.. అడ్డంగా బుక్కైన పోలీసులు
అలా చేయడం వలన తలనొప్పి కూడా వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కురులు వత్తుగా పెరగాలంటే ఉల్లి రసం తీసిన వెంటనే అప్లై చేయకూడదని సూచిస్తున్నారు. కనీసం 24 గంటలపాటు పక్కన పెట్టాలని తెలిపారు. అంతేకాదు డైరెక్ట్ గా ఉల్లి రసాన్ని అప్లై చేయకుండా అందులో చిటెడు ఉప్పును కలపాలని అంటున్నారు. అలా ఉప్పు కలిపిన ఉల్లి రసాన్ని సుమారు 24గంటల పాటు పక్కన పెడితే అది బాగా పులుస్తుంది. ఆ పులిసిన రసాన్ని బాగా కలిపి దానిని ఒక కాటన్ (దూది) సహాయంతో తలకు నెమ్మదిగా అప్లై చేయాలి.
Also Read:Virus to Rabbits: కుందేళ్లకు కొమ్ములా.. బాబోయ్ ఇదెక్కడి విడ్డూరం?
కానీ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే తలకు కొబ్బరి నూనె రాయకూడదు. అలా రాసిన జట్టుకు ఉల్లిపాయ రసం పెట్టిన ఫలితం ఉండదు. తల జిడ్డుతనం వల్ల రసం తలకు సరిగ్గా అంటుకోదు. నీరు కారి మొఖం మీద రావడం వంటిది జరుగుతుంది. అందువల్ల తలకు నూనె లేకుండా ఉల్లి పాయ రసాన్ని అప్లై చేయడం మంచిది. కురులకు ఉల్లి రసాన్ని బాగా పట్టించి చిన్నగా మసాజ్ చేసుకోవాలి. అలా అప్లై చేసిన జుట్టును కనీసం 30 నిమిషాలు వరకు ఆరనివ్వాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. అలా వారిని ఒక్కసారైనా అప్లై చేస్తుంటే జుట్టు రాలడం తగ్గిపోతుంది. శిరోజాలు ఒత్తుగా, పొడవుగా పెరిగి దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.