Federation Boycott:గత కొన్ని రోజులుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో డాన్సర్స్ అసోసియేషన్ వర్సెస్ ఫిలిం ఫెడరేషన్ మధ్య ఉప్పు నిప్పులా ఉన్న సంగతి తెల్సిందే.అయితే తాజాగా డాన్సర్స్ అసోసియేషన్‌కు అసలు ఏమాత్రం సహకరించేదే లేదని, సహాయ నిరాకరణ చేస్తున్నామని ఫిలిం ఫెడరేషన్ కుండ బద్దలు కొట్టేసింది.అంతేకాదు, ఈ వ్యవహారంలో డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత తీరును తీవ్రంగా ఎండగడుతూ ఫెడరేషన్ ఒక ఘాటైన లేఖను కూడా విడుదల చేయడంతో టాలీవుడ్ సర్కిల్స్ లో ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇక ఈ లేఖలో ఫెడరేషన్ రాసుకొచ్చిన విషయాలని చూస్తే రెండు వర్గాల మధ్య గొడవలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థమవుతుంది.”మెగాస్టార్ చిరంజీవి గారు తీసుకున్న నిర్ణయాలను, ఫిలిం ఫెడరేషన్ మరియు ఫిలిం ఛాంబర్ నిర్ణయాలను పూర్తిగా ధిక్కరిస్తూ మీరు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు” అని ఫెడరేషన్ నేరుగా సుమలతపై ఒక రేంజ్ లో ఫైర్ అయింది.
గతంలో సస్పెండ్ అయిన సభ్యులను మళ్ళీ కలుపుకుని, అందరూ కలిసి పని చేయాలని కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించి మీకు ఒక మంచి అవకాశం ఇచ్చామని,కానీ ఫెడరేషన్ మాటలని లెక్క లెక్క చేయకుండా మీ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకున్నారని ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ క్రమంలోనే ఫెడరేషన్ చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంది. “ఈ రోజు నుంచి డాన్సర్స్ అసోసియేషన్‌కు ఫెడరేషన్ తరఫున ఎలాంటి సహాయసహకారాలు ఉండవు” అని స్పష్టం చేసింది. ఇకపై డాన్సర్స్ అసోసియేషన్ పరిధిలో ఏవైనా సమస్యలు వచ్చినా, గొడవలు జరిగినా లేదా పరిష్కరించాల్సిన వివాదాలు ఉన్నా ఫెడరేషన్ ఎలాంటి బాధ్యత తీసుకోదని తెగేసి చెప్పేసింది. అంతటితో ఆగకుండా, త్వరలోనే ఫిలిం ఛాంబర్‌తో జరగబోయే కీలకమైన వేతనాల అగ్రిమెంట్ విషయంలో కూడా డాన్సర్స్ అసోసియేషన్‌కు ఫెడరేషన్ నుంచి ఎలాంటి సపోర్ట్ లభించదని తేల్చిచెప్పడం కోలీవుడ్, టాలీవుడ్ డ్యాన్స్ యూనియన్ కి పెద్ద షాక్ అనే చెప్పాలి.
ఇక అసలైన ట్విస్ట్ ఏంటంటే… ఫిలిం ఫెడరేషన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కేవలం ఫెడరేషనే కాకుండా, సినీ పరిశ్రమలోని మిగతా 23 క్రాఫ్ట్స్ (24 ఫ్రేమ్స్ లోని మిగిలిన విభాగాలు) కూడా ఇకపై డాన్సర్స్ అసోసియేషన్‌కు పూర్తిస్థాయిలో సహాయ నిరాకరణ చేయబోతున్నాయి. అంటే కెమెరామెన్, ఎడిటర్స్, ఫైట్ మాస్టర్స్, ప్రొడక్షన్ టీమ్స్ ఇలా ఏ విభాగం కూడా డ్యాన్స్ అసోసియేషన్ నిర్ణయాలకు లేదా వాళ్ళ పనులకు సహకరించే పరిస్థితి ఉండదన్న మాట.దీనివల్ల రాబోయే రోజుల్లో పలు పెద్ద సినిమాల షూటింగ్‌లపై పడే అవకాశం గట్టిగానే ఉండేలా కనిపిస్తోంది.
ఇప్పటికే జానీ మాస్టర్ గతంలో పలు వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆయన భార్య సుమలత డాన్సర్స్ అసోసియేషన్ బాధ్యతల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ సమయంలో పెద్దల మాటలను మరియు ఛాంబర్ రూల్స్‌ను పక్కనపెట్టి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం అని తెలుస్తుంది.
also read :మిథున్ చక్రవర్తికి సర్జరీ.. అసలు ఏమైంది..?
పెద్దల మాట వినకుండా, మెగాస్టార్ చిరంజీవి లాంటి ఇండస్ట్రీ పెద్దల సూచనలను సైతం పక్కన పెట్టడం వల్లే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చిందని ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్.చూడాలి మరి..ఫెడరేషన్ చేసిన ఈ సహాయ నిరాకరణ దెబ్బకు డాన్సర్స్ అసోసియేషన్ దిగివస్తుందా, లేక ఈ వివాదం మరింత పెద్దదవుతుండా కాలమే డిసైడ్ చేయాలి !