Tollywood: ఇటీవల కాలంలో సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు వైవాహిక బంధం లోకి అడుగుపెడుతూ.. బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేస్తున్నారు. అందులో భాగంగానే కొంతమంది రహస్యంగా ప్రేమాయణం కొనసాగించి, ఇప్పుడు నిశ్చితార్థం చేసుకొని పెళ్లికి సిద్ధమవుతుంటే.. మరి కొంతమంది తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా బయటపెడుతున్నారు. ఇంకొంతమంది ఏకంగా పెళ్లి చేసుకుని సర్ప్రైజ్ ఇస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఖడ్గం సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న బ్యూటీ కిమ్ శర్మ (Kim Sharma) తో ప్రేమలో మునిగి తేలిన ఒక తెలుగు హీరో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని అనుకునే సమయంలో సడన్గా బ్రేకప్ చెప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది . పైగా ఇప్పుడు మరో హీరోయిన్ తో ఆయన చట్టపట్టలేసుకొని తిరుగుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.
ఆయన ఎవరో కాదు హర్షవర్ధన్ రాణే (Harshavardhan Rane). రాజమండ్రిలో జన్మించిన ఈయన తండ్రి మరాఠీ కి చెందిన వారు కాగా, తల్లి తెలుగువారే. తండ్రి ఉద్యోగరీత్యా వీరి కుటుంబం మొదట గ్వాలియర్ లో స్థిరపడింది. ఆ తర్వాత ముంబైకి మకాం మార్చారు. చదువు తర్వాత ‘లెఫ్ట్ రైట్ లెఫ్ట్’ అనే సీరియల్ తో హిందీ టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టారు హర్షవర్ధన్. ఆ తరువాత ‘తకిట తకిట’ అనే చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈయన.. ఆ తర్వాత నా ఇష్టం, ప్రేమ ఇష్క్ కాదల్, మాయా, అనామిక , అవును, గీతాంజలి, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, బెంగాల్ టైగర్, ఫిదా, కవచం ఇలా ఎన్నో తెలుగు చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ALSO READ:విజయ్ విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్.. వెనకడుగు వేసిన సంగీత!
తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈయన ఖడ్గం మూవీ కిమ్ శర్మతో సుదీర్ఘకాలం పాటు డేటింగ్ చేశారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్న సమయంలో బ్రేకప్ చెప్పుకున్నారు. అయితే ఈ బ్రేకప్ సమయంలో తన వ్యవహార శైలి, ఆలోచన విధానమే కిమ్ నుంచి తనను దూరం చేసిందని, తన జీవితంలో ఆమెతో గడిపిన మధుర జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయని, తన చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉంచే వ్యక్తులలో కిమ్ ముందు వరుసలో ఉంటారు అంటూ తెలిపారు. తన డీఎన్ఏలో ఏదో తప్పు ఉందని, 12 ఏళ్లపాటు తాను ఒంటరిగా ఉన్నానని కూడా ఈ బ్రేకప్ పై స్పందించారు.
విడిపోయిన తర్వాత ఒంటరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న ఈయన గత కొద్ది రోజులుగా సంజీదా షేక్ తో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో మళ్లీ ఊపందుకున్నాయి. పైగా వీరిద్దరి పోస్టులు వాటిలో షేర్ చేసే ఫోటోలు దాదాపు ఒకేలా ఉండడమే ఈ ఊహగానాలకు మరింత బలం చేకూర్చింది.. పైగా 2020లో తైష్ , కున్ ఫయా కున్ వంటి చిత్రాలలో హర్షవర్ధన్, సంజీదా కలిసి నటించారు. 2023లో గిర్ ఫారెస్ట్ ట్రిప్ కి వెళ్ళిన సమయంలో వీరిద్దరూ షేర్ చేసిన ఫోటోలతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే వార్తలకు ఆజ్యం పోసింది. మరి ఈ వార్తలపై ఈ జంట ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.