E-Paper
Advertisement

మిథున్ చక్రవర్తికి సర్జరీ.. అసలు ఏమైంది..?

మిథున్ చక్రవర్తికి సర్జరీ.. అసలు ఏమైంది..?
Advertisement

Mithun Surgery: మిథున్ చక్రవర్తి.. ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ 80s తరాన్ని “ఐ యామ్ ఎ డిస్కో డాన్సర్” అంటూ ఒక ఊపు ఊపాడు. అలాంటి లెజెండరీ స్టార్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. కారణం.. సినిమా కాదు, పాలిటిక్స్ కాదు.. ఆయన ఆరోగ్య పరిస్థితి.

మెటల్ ప్లేట్ తొలగించిన డాక్టర్లు

అవును.. గతంలో జరిగిన ఓ ప్రమాదంలో ఆయన శరీరంలో మెటల్ ప్లేట్ అమర్చారు. కొంతకాలంగా అదే ప్లేట్ వల్ల ఇబ్బంది కలుగుతుండటంతో, డాక్టర్ల సలహా మేరకు దాన్ని తొలగించే చిన్న సర్జరీ చేశారు. అదృష్టవశాత్తూ ఆ ఆపరేషన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సక్సెస్ అయింది. ప్రస్తుతం ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

 సీక్రెట్‌గా ఉంచాలని భావించిన మిథున్

Advertisement

అసలు ఈ విషయం బయటకు రావాలనే మిథున్ చక్రవర్తి అనుకోలేదట. అభిమానులు అవసరానికి మించి ఆందోళన చెందుతారని భావించి, ఈ సర్జరీ గురించి చాలా సీక్రెట్‌గా ఉంచినట్లు తెలుస్తోంది. కానీ ఆయన ఆస్పత్రిలో ఉన్న విషయం తెలిసిన తర్వాత రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు వెళ్లి పరామర్శించడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

 సువేందు అధికారి పరామర్శ

బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి స్వయంగా హాస్పిటల్‌కు వెళ్లి మిథున్‌ను కలిసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లతో కూడా మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్న ఆయన.. “మిథున్ దా బాగానే ఉన్నారు.. త్వరలోనే పూర్తిగా కోలుకుని అభిమానుల ముందుకు వస్తారు” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అభిమానుల్లో కూడా కాస్త ఊరట కనిపించింది.

 డిస్కో డాన్సర్ నుంచి కాశ్మీర్ ఫైల్స్ వరకు

Advertisement

మిథున్ చక్రవర్తి అంటే కేవలం ఒక హీరో మాత్రమే కాదు.. ఒక ఎమోషన్. 1982లో వచ్చిన డిస్కో డ్యాన్సర్ సినిమా ఆయనను ఇంటర్నేషనల్ స్టార్‌గా నిలబెట్టింది. ఆ సినిమాలోని పాటలు, డ్యాన్స్‌లు ఇప్పటికీ చాలామంది గుర్తు చేసుకుంటుంటారు. ఆ తర్వాత డాన్స్ డాన్స్, ప్యార్ ఝుక్తా నహీ, గురు, అగ్నిపథ్, ది కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాల్లో కూడా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. ఏ పాత్ర ఇచ్చినా తన స్టైల్‌తో ముద్ర వేసిన నటుడు మిథున్.

 సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ యాక్టివ్

గత కొన్నేళ్లుగా సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా యాక్టివ్‌గా ఉంటున్నారు. బీజేపీ కార్యక్రమాల్లో తరచూ కనిపిస్తూనే ఉంటారు. వయసు పెరిగినా ఆయన ఎనర్జీ మాత్రం తగ్గలేదు. అందుకే ఆయన ఆరోగ్యంపై చిన్న వార్త వచ్చినా అభిమానులు వెంటనే స్పందిస్తున్నారు.

 త్వరగా కోలుకోవాలని అభిమానుల ఆకాంక్ష

సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు “గెట్ వెల్ సూన్ మిథున్ దా” పోస్టులు వైరల్ అవుతున్నాయి. సినీ అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. డాక్టర్లు కూడా ఎలాంటి ప్రమాదం లేదని, కొన్ని రోజుల విశ్రాంతి తీసుకుంటే మామూలు జీవితానికి తిరిగి వస్తారని చెబుతున్నారు.

also read :రణ్‌వీర్ సినిమా దెబ్బకు నెట్‌ఫ్లిక్స్ రికార్డులన్నీ షేక్!

 ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారోనని ఎదురుచూపులు

ప్రస్తుతం అందరి చూపు ఒక్కటే… మిథున్ దా ఎప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారు? మళ్లీ ఎప్పుడు కెమెరా ముందు కనిపిస్తారు? అనే దానిపైనే ఉంది. ఆయన ఆరోగ్యం బాగానే ఉండటంతో అభిమానులు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. మరోసారి అదే చిరునవ్వుతో, అదే స్టైల్‌తో మిథున్ చక్రవర్తి ప్రేక్షకుల ముందుకు రావాలని సినీ అభిమానులంతా కోరుకుంటున్నారు.!

Tags

Related News

ఆ సినిమా చేసి తప్పు చేసాను.. సదా అవకాశాలు కోల్పోవడానికి అదే కారణమా?

ప్యారడైజ్‌లో కేసీఆర్‌.. చూసి షాకవుతున్న ఆడియన్స్!

ఐదేళ్ల తరువాత కూడా నిలబడే ఉన్నాను..చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్న మెగా హీరో!

సందీప్ మాటలను నిజం చేయాలనిపిస్తోంది – ఫరియా అబ్దుల్లా

‘ప్యారడైజ్’ ఎక్కడ తేడా కొట్టిందో తెలుసా?

నూతన బాధ్యతలు చేపట్టిన మెగా కోడలు ఉపాసన!

విభిన్న గెటప్స్ లో శర్వానంద్.. ‘జార్జ్ క్రిష్’ నుండి ఫస్ట్ బూస్టర్ రిలీజ్!

ది ప్యారడైజ్ దెబ్బ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ లో ఇప్పుడైనా మార్పు వస్తుందా?

Big Stories

Advertisement
×