Irumudi: మాస్ మహారాజా రవితేజ (Raviteja ) గత కొంతకాలంగా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. అందులో భాగంగానే ఆయన కూడా జానర్ మార్చి ‘ఇరుముడి’ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రియా భవాని శంకర్(Priya Bhavani Shankar) కథానాయికగా శివ నిర్వాణ (Siva Nirvana) దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రమే ఇరుముడి. ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర అప్డేట్ అధికారికంగా ప్రకటించారు.
ఇరుముడి ట్రైలర్ ను విడుదల చేయడానికి డేట్ లాక్ చేశారు మేకర్స్. ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు కూడా.. పైగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్గా నిర్వహించేందుకు చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
భీమవరంలోని ఎస్ ఆర్ కే ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో సాయంత్రం 5:00 గంటల నుండి ఇరుముడి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఇరుముడి ట్రైలర్ ను విడుదల చేస్తున్నామని ప్రకటించడం కోసం విడుదల చేసిన పోస్టర్ లో రవితేజ రెండు విభిన్నమైన లుక్స్ లో కనిపిస్తున్నారు. ఒకవైపు చేతిలో ఆయుధంతో పవర్ఫుల్ లుక్ లో కనిపించగా.. మరొక పోస్టర్ లో అయ్యప్ప మాల ధరించి కనిపిస్తున్నారు. మొత్తానికి అయితే తాజాగా విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్ ట్రైలర్ పై అంచనాలు పెంచుతోంది. జీ.వి.ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. ఆగస్టు 21న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది..
ఇదిలా ఉండగా ప్రస్తుతం అందరి కన్ను భీమవరం పైనే ఉండడం గమనార్హం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది హీరోలు తమ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లను ఎక్కువగా భీమవరం వేదికగా జరుపుతూ ఉండడం గమనార్హం. ఇటీవల వరుణ్ తేజ్ కూడా తన సినిమా కొరియన్ కనకరాజు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వేదికగా నిర్వహించిన విషయం తెలిసిందే. అంతే కాదు ఆయన తొలి ప్రేమ సినిమా కూడా ఇదే భీమవరంలో నిర్వహించడం గమనార్హం. పైగా ఈ సినిమా తొలి షో తోనే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇరుముడి సినిమా కూడా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను ఇక్కడే నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఇక హీరోలకు భీమవరం లక్కీ ప్లేస్ గా మారనుంది అని చెప్పవచ్చు.
also read:ఖడ్గం మూవీ బ్యూటీతో బ్రేకప్.. మరో హీరోయిన్ తో టాలీవుడ్ హీరో డేటింగ్!
రవితేజ విషయానికి వస్తే.. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత సెకండ్ హీరోగా తన ఉనికిని చాటుకుంటూ హీరోగా అవతరించారు. ఇప్పుడు మాస్ మహారాజుగా చలామణి అవుతున్నారు రవితేజ. ఈ మధ్యకాలంలో ఆయన నటించిన చిత్రాలు ఏవి సక్సెస్ అందుకోకపోవడంతో ప్రస్తుతం ఇరుముడి పైనే రవితేజ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఆయనకు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
When family means everything, a man will do anything for them ❤️🔥#IrumudiTrailer out on 12th August with a grand launch event at SRKR Engineering College, Bhimavaram ❤🔥
In cinemas from 𝗔𝘂𝗴𝘂𝘀𝘁 𝟮𝟭𝘀𝘁, 𝟮𝟬𝟮𝟲.#IRUMUDI / #IRUMUDIKATTU
Starring MASS MAHARAJA… pic.twitter.com/r1oLquBu4U
— Mythri Movie Makers (@MythriOfficial) August 8, 2026