E-Paper
Advertisement

రామాయణ మూవీను ఫస్ట్ చూసేది ఎవరో తెలుసా?

రామాయణ మూవీను ఫస్ట్ చూసేది ఎవరో తెలుసా?
Advertisement

Ramayana: ఇండియన్ మూవీ హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న పౌరాణిక చిత్రం రామాయణం. ‘దంగల్’ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు సాధించి , ఆ మార్క్ ను మరెవరూ చెరపలేని విధంగా సెట్ చేసిన డైరెక్టర్ నితీష్ తివారీ (Nithesh tiwari) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ (Ranbir Kapoor) శ్రీరాముడిగా, సౌత్ లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) సీతాదేవిగా, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Yash) రావణాసురుడిగా నటిస్తున్నారు. వీరితోపాటు కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ లాంటి భారీ తారాగణం కూడా ఈ సినిమాలో భాగమయ్యింది. భారీ బడ్జెట్ తో అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా మొదటి భాగం విడుదల చేయడానికి నిర్మాతలు గట్టిగానే సిద్ధమవుతున్నారు.

భారీ ప్రాజెక్టు రామాయణం చుట్టూ ముదురుతున్న అనుమానాలు..

దీనికి తగ్గట్టుగా సినిమా నుండి విడుదలైన గ్లింప్స్ , ట్రైలర్ కి విపరీతమైన స్పందన వచ్చినప్పటికీ.. ప్రాచీన ఇతిహాసం కావడంతో ఈ సినిమా చుట్టూ రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటికే రామాయణ కథాంశంతో వచ్చిన కొన్ని సినిమాలు వివాదాలలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాలలోని కొన్ని ఘట్టాలు భక్తుల ఆధ్యాత్మిక భావాలను గాయపరిచాయనే ఆరోపణలు వచ్చాయి. ఆ చెడు జ్ఞాపకాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎటువంటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక పొరపాట్లకు తావు లేకుండా రామాయణం చిత్ర బృందం అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా అధికారిక సెన్సార్ ప్రక్రియ పూర్తికాకముందే.. ఏదైనా లీగల్ నోటీసులు లేదా ధార్మిక సంఘాల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందనే భయంతో మేకర్స్ ముందస్తు వ్యూహాన్ని రచిస్తున్నట్లు బాలీవుడ్ మీడియా వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.

Advertisement

also read:‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. ప్రత్యేకించి అక్కడే!

రామాయణం చూసే మొదటి ఛాన్స్ ఆయనకే

బాలీవుడ్ మీడియా నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా ఈ సినిమా పట్ల ఎటువంటి వ్యతిరేకత కలగకుండా ముందుగానే దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించాలని నిర్మాతలు భావిస్తున్నారట. ప్రధాని స్వయంగా ఈ చిత్రాన్ని వీక్షించి ఆమోదముద్ర వేస్తే.. సినిమాపై ఉన్న విమర్శలకు అడ్డుకట్ట పడడంతో పాటు విశేషమైన విశ్వసనీయత లభిస్తుందని, అలాగే సనాతన ధర్మ పరిరక్షణకు , సాంప్రదాయ విలువలకు పెద్దపీట వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు రాష్ట్ర కూటమి ప్రభుత్వ పెద్దలకు కూడా ఈ ప్రత్యేక షో ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు. వార్తలు వినిపిస్తున్నాయి.

అసలు కారణం ఏమిటంటే?

Advertisement

ఇకపోతే నిర్మాతలు ఈ ముందస్తు జాగ్రత్త తీసుకోవడం వెనుక కూడా మరో కారణం ఉంది. ఢిల్లీకి చెందిన ప్రముఖ ధార్మిక సంస్థ శ్రీ రామ్ లీలా మహాసంఘ్ అధ్యక్షుడు అర్జున్ కుమార్ దర్శకుడు నితీష్ తివారీతో పాటు నిర్మాణ సంస్థకు అధికారిక లేఖ రాశారు. విజువల్ ఎఫెక్ట్స్ , గ్రాఫిక్స్ తో అత్యున్నత ప్రమాణాలతో సినిమా తెరకేక్కించినప్పటికీ సనాతన ధర్మానికి భంగం కలిగించే సన్నివేశాలు లేదా సంభాషణలు ఏవైనా ఉన్నాయేమో అని అనుమానం మాకుంది. అందువల్ల థియేటర్లలో విడుదలయ్యే ముందే తమ ప్రతినిధులకు, వేద పండితులకు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. మరి అందుకే చిత్ర బృందం ఈ విధంగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

Related News

ఈ ఐదుగురిలో టాలీవుడ్ నంబర్ వన్ ఎవరు?

‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. ప్రత్యేకించి అక్కడే!

ఖడ్గం మూవీ బ్యూటీతో బ్రేకప్.. మరో హీరోయిన్ తో టాలీవుడ్ హీరో డేటింగ్!

‘కొరియన్ కనకరాజు ‘ బాక్సాఫీస్ ఊచకోత.. అక్కడ అదరగొట్టేస్తున్నాడుగా..!

రణ్‌బీర్‌కు ముందు రాముడిగా ఫిక్స్ అయిన హీరోలు ఎవరంటే..!

రీజన్ లేకుండా ముద్దు పెట్టను.. అనన్య శర్మ బోల్డ్ స్టేట్‌మెంట్!

డ్యాన్సర్స్ అసోసియేషన్‌పై వేటు.. జానీ మాస్టర్ భార్య సుమలతపై ఫిల్మ్ ఫెడరేషన్ తీవ్ర ఆగ్రహం!

Big Stories

Advertisement
×