Rajinikanth Coolie:ఈ మధ్యకాలంలో చిత్ర యూనిట్స్ తమ సినిమాను ఆడియన్స్ లోకి తీసుకెళ్లడానికి నానా తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా ఒక సినిమాకి ఎంత ప్రమోషన్ జరిగితే అంత హైప్ వస్తుందని , అటు ఆడియన్స్ కూడా థియేటర్లకు వస్తారు అని అందరికీ తెలిసిందే. అందుకే కేవలం ఈ ప్రమోషన్స్ కోసం కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్న దర్శక నిర్మాతలు కూడా లేకపోలేదు. అయితే ప్రమోషన్స్ లో ఎన్ని వినూత్న ప్రయోగాలు చేసినా.. ఆడియన్స్ మాత్రం కంటెంట్ లేకపోతే సినిమా చూడరు అన్న విషయం మరిచిపోతున్నారని ఒక వర్గం సినీ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.
వినూత్న ప్రమోషన్స్ చేపట్టిన కూలీ చిత్ర బృందం..
అయినా సరే ప్రమోషన్స్ ను వినూత్నంగా చేస్తూ.. తమ సినిమాపై హైప్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి చిత్ర బృందాలు. ఈ క్రమంలోనే తాజాగా రజనీకాంత్ (Rajinikanth) నటించిన ‘కూలీ’ సినిమా చిత్ర బృందం కూడా వినూత్నంగా ప్రమోషన్స్ చేపట్టి, అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా.. డైరెక్టర్ లోకేష్ కనగరాజు (Lokesh Kanagaraj) తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘కూలీ’. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు ఇందులో నాగార్జున వంటి సీనియర్ తెలుగు స్టార్ హీరోలు నటిస్తుండడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుండి ఆగస్టు 2వ తేదీన ట్రైలర్ రిలీజ్ చేస్తామని అటు మేకర్స్ కూడా అనౌన్స్ చేశారు.
అమెజాన్ డెలివరీ డబ్బాలపై కూలీ ప్రమోషన్స్..
ఇదిలా ఉండదా.. విడుదల తేదీకి కేవలం 14 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో దూకుడు పెంచింది చిత్ర బృందం. అందులో భాగంగానే వినూత్న ప్రమోషనల్ ఐడియా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. అమెజాన్ డెలివరీ బాక్స్ లపై కూలీ పోస్టర్స్ కనిపించడమే ఇందుకు నిదర్శనం. డెలివరీ డబ్బాలపై సినిమా పోస్టర్లు ఉండడం చూసి అటు నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ఇది దూకుడు ప్రమోషన్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. పైగా ఈ క్రియేటివ్ యాక్టివిటీ పై మేకర్స్ ఒక ప్రత్యేక వీడియోని కూడా విడుదల చేయడం తో.. ఈ యాక్టివిటీ సినిమాపై క్యూరియాసిటీని పెంచేసిందని చెప్పవచ్చు. మొత్తానికి అయితే వినూత్నమైన ప్రమోషన్స్ తో సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తుంది చిత్ర బృందం. ఇక ఇది చూసిన నెటిజెన్స్ మాత్రం ప్రమోషన్స్ లో ఇదొక కొత్త స్ట్రాటజీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఆగస్టు 14వ తేదీన తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్గా విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
మొదటి భారతీయ చిత్రంగా కూలీకి గుర్తింపు..
ఇకపోతే అమెజాన్ వంటి ఈ – కామర్స్ సంస్థలను ఉపయోగించుకొని.. ఇలా ప్రమోషన్ చేసిన మొదటి ఇండియన్ చిత్రంగా ‘కూలీ’ రికార్డు సృష్టించింది. ఇకపోతే బెంగళూరు (కర్ణాటక), హైదరాబాద్ (తెలంగాణ), పూణే, ముంబై (మహారాష్ట్ర), ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ, నోయిడా వంటి నగరాల్లో అమెజాన్ డెలివరీ బాక్స్‌లలో ఈ కూలీ ప్రమోషన్‌లను కలిగి ఉంటుంది.
ALSO READ: Film industry: కన్నులవిందుగా ఒకేచోట చేరిన సీనియర్ తారలు.. ఇప్పటికీ చెరగని అందం ఆమె సొంతం!
రజనీకాంత్ సినిమాలు..
రజనీకాంత్ విషయానికి వస్తే.. ఏడుపదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు లోకేష్ కనగరాజు తో సినిమా చేస్తున్న ఈయన.. ఈ సినిమా తర్వాత జైలర్ 2 సినిమా కూడా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే మరొకవైపు ఈ జైలర్ 2 సినిమా షూటింగ్లో బిజీగా పాల్గొంటున్న విషయం తెలిసిందే.
The first time ever for an Indian movie!🔥#Coolie Promotions in full swing across India ! 💥#Coolie releasing worldwide August 14th @rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv… pic.twitter.com/v9i1gtTRvV
— Sun Pictures (@sunpictures) July 30, 2025