BigTV English

Virat Kohli: ఇంగ్లాండ్ అభిమానుల మీద ఉమ్మేసిన విరాట్ కోహ్లీ.. ఇదిరా బ్రాండ్ అంటే

Virat Kohli: ఇంగ్లాండ్ అభిమానుల మీద ఉమ్మేసిన విరాట్ కోహ్లీ.. ఇదిరా బ్రాండ్ అంటే

Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కి ముందు విరాట్ కోహ్లీ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఇక కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టెస్ట్ క్రికెట్ కి వీడ్కోలు పలికాడు. అతడి స్థానంలో కొత్త టెస్ట్ కెప్టెన్ గా గిల్ ఎంపికయ్యాడు. ఈ క్రమంలో దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండానే భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళింది.


Also Read: Rohit Sharma – London: కోహ్లీ బాటలో రోహిత్ శర్మ దంపతులు.. ఇండియాకు గుడ్ బై?

రవీంద్ర జడేజా, కే.ఎల్ రాహుల్, బుమ్రా మినహా పెద్దగా అనుభవం ఉన్న ఆటగాళ్లు ప్రస్తుతం భారత టెస్ట్ జట్టులో లేరు. దీంతో గిల్ యొక్క నాయకత్వంలో భారత జట్టు ఎలా రాణిస్తుందోనని అందరూ ఆత్రుతగా ఎదురు చూశారు. అందరూ అనుకున్నట్లుగానే ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్ లలో.. భారత జట్టు కేవలం ఒక మ్యాచ్ లో మాత్రమే గెలుపొందింది.


మైదానంలో విరాట్ కోహ్లీ:

అయితే విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రత్యర్థి ఆటగాడు ఏమన్నా సరే వెంటనే తన మాటలతో సమాధానం చెబుతాడు విరాట్ కోహ్లీ. ఆ తర్వాత తన బ్యాట్ తో కూడా బదులిస్తాడు. అలాంటి సీనియర్ ఆటగాడు లేని లోటు ప్రస్తుతం భారత జట్టులో స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు గల కారణాలను కూడా లేవనెత్తుతున్నారు పలువురు నెటిజెన్లు. భారత జట్టు చివరిసారిగా ఇంగ్లాండ్ లో పర్యటించినప్పుడు.. ఓ సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ఇంగ్లాండ్ అభిమానుల మీద ఉమ్మేసిన కోహ్లీ?

ఈ వీడియోలో భారత జట్టు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బంతి ఫోర్ గేట్ వైపు దూసుకు వచ్చింది. డై చేసి ఆ బంతిని ఆపుతాడు విరాట్ కోహ్లీ. ఆ సమయంలో ఫోర్ గెట్ వద్ద మ్యాచ్ ని వీక్షిస్తున్న ఇంగ్లాండ్ అభిమానులు.. ఆ బంతి ఫోర్ వెళ్లిపోయిందని చెబుతూ విరాట్ కోహ్లీని అసభ్యకర కామెంట్స్ చేసినట్టు కనిపిస్తోంది. దీంతో ఒక్కసారిగా అగ్రేషన్ మూడ్ లోకి వెళ్లిపోయిన విరాట్ కోహ్లీ.. తన నోట్లో ఉన్న ట్వీంగమ్ ని వారి వైపుకు ఉమ్మేసి వెళ్ళిపోతాడు. దీంతో ఆ ఇంగ్లాండ్ అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతారు. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లో కోహ్లీ లాగా అగ్రేషన్ చూపించేవారు ఎవరూ లేరని అంటున్నారు నెటిజన్లు. ఇంగ్లాండ్ కి మనవాళ్లు గట్టి కౌంటర్ ఇవ్వలేకపోతున్నారని, కోహ్లీ మైదానంలో ఉంటే ఆ ఉత్సాహమే వేరని చెబుతున్నారు.

Also Read: Sara – Gill: సీక్రెట్ గా గిల్ డ్రెస్సింగ్ రూమ్ లోకి సారా… క్రికెట్ కిట్ తో ఫోటో దిగి మరీ!

ప్రత్యర్థులను బండ బూతులు తిట్టడం, స్లెడ్జింగ్ చేసి వారి వికెట్లు పడేలా చేయడంలో కోహ్లీ దిట్ట అని చెప్పుకొస్తున్నారు. వాస్తవానికి ఈ సిరీస్ కోసం కోహ్లీ తనను తాను ముందే రెడీ చేసుకున్నాడట. ఇంగ్లాండ్ ఆటగాళ్లను చిత్తు చేయాలని ప్లాన్స్ కూడా వేసుకున్నాడట. అంతేకాదు ఈ పర్యటనలో మూడు నుంచి నాలుగు సెంచరీలు సాధించాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నాడని ఢిల్లీ రంజీ క్రికెట్ జట్టు కోచ్ శరణ్ దీప్ సింగ్ తెలిపారు. కానీ సడన్ గా ఈ సిరీస్ కి ముందే రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఫామ్ తగ్గడం, కుటుంబంతో సమయం కేటాయించడం వంటి కారణాలు అతడు రిటైర్మెంట్ కి దారితీసి ఉండవచ్చని చాలామంది భావిస్తున్నారు.

Sara – Gill: సీక్రెట్ గా గిల్ డ్రెస్సింగ్ రూమ్ లోకి సారా… క్రికెట్ కిట్ తో ఫోటో దిగి మరీ!

Related News

Asia Cup 2025 : సూర్య కుమార్ యాదవ్ లేకుండానే టీమిండియా జట్టు…?

IPL 2026 : CSK సంచలన నిర్ణయం..10 స్టార్ ప్లేయర్లను వదిలేయాలని ధోని ఆదేశాలు ?

Rishabh Pant : గిల్ ప్రైవేట్ పార్ట్స్ ను టచ్ చేసిన రిషబ్ పంత్.. వీడియో వైరల్

Cricketers: ఇదెక్కడి స్టేడియం రా… మెట్లపైనే స్కోర్ బోర్డు వివరాలు.. ఎక్కడంటే

Arjun Tendulkar Engagement: అర్జున్ టెండూల్కర్ కు 500 కోట్ల కట్నం..?

Sara – Arjun: సారా, అర్జున్ వివాహం ఒకే రోజు జరగనుందా… సచిన్ ప్లాన్ అదుర్స్ ?

Big Stories

×