E-Paper
Advertisement

ఆటా సందీప్ దూకుడు.. జానీ, శేఖర్ మాస్టర్లకి ఇక కష్టమేనా ?

ఆటా సందీప్ దూకుడు.. జానీ, శేఖర్ మాస్టర్లకి ఇక కష్టమేనా ?
Advertisement

Tollywood:అయితే జానీ మాస్టర్ ..లేదంటే శేఖర్ మాస్టర్ …గత కొన్నేళ్లుగా ఏ పెద్ద హీరోకైనా ఈ ఇద్దరే కోరియోగ్రఫీ చేసేవాళ్ళు.వాళ్ళు వేయించే సిగ్నీచర్ స్టెప్పులు కూడా అలానే ఉండేవి.మధ్య మధ్యలో భాను మాస్టర్ వంటివారు దూసుకొచ్చినా వీళ్ళ స్థానాన్ని కబ్జా చేయలేకపోయారు.దీంతో డాన్స్ అంటే వీరిద్దరే అన్నట్టుగా మారిపోయింది.కానీ తాజాగా ఆటా సందీప్ ఎంట్రీతో ఇపుడు ఇండస్టీలో మరో కొత్త పవర్ గేమ్ మొదలైందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

గిర గిర గింగిరానివే అనే పాట సూపర డూపర్ హిట్

Advertisement

ఆట సందీప్ ఎన్నో ఏళ్లుగా తనవైన డాన్స్ షోలతో అలరిస్తున్నవాడే.ఇక ఆ తర్వాత పవనిజం వంటి చిన్న చిన్న సినిమాలు చేసినా గుర్తింపు రాలేదు.కాని గతేడాది వచ్చిన చాంపియన్ సినిమాలో చేసిన గిర గిర గింగిరానివే అనే పాట సూపర డూపర్ హిట్ అయిపోవడంతో సందీప్ ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది.ఇక ఈ ఏడు చిరు తో చేసిన హుక్కు స్టెప్పు హుక్కు స్టెప్ సాంగ్ తెగ వైరల్ అయిపోవడంతో సందీప్ పేరు మారుమోగిపోయింది.

టాలీవుడ్ లో అసలైన డాన్స్ గేమ్ స్టార్ట్

Advertisement

ఇక ఇదిలా ఉంటె తాజాగా డాన్స్ యూనియన్ లో ప్రెసిడెంట్ సుమలత సెంటర్ గా రచ్చ జరగడం,నిర్మాతల మండలి ఇన్వాల్వ్ అయినా సమస్య అలాగే ఉండటం, దీంతో ఏకంగా చిరు, బాలయ్య వంటి వారే రంగంలో దిగి సమస్యని పరిష్కరించడం తెలిసిందే.అయితే ఇంత రచ్చ జరగడంతో ఏకంగా ప్యారడైజ్ సినిమాలో కీర్తి సురేష్ తో చేయబోయే స్పెషల్ సాంగ్ ని జానీ నుండి సందీప్ మాస్టర్ చేతిలో పెట్టారని సోషల్ మీడియాలో వార్తలు గట్టిగానే వినిపించాయి.

ఇక ఈ వార్తలు అలా బయటికి వచ్చాయో లేదో టాలీవుడ్ లో ఆటా సందీప్ టైమ్ మొదలైపోయిందని ,ఇక టాలీవుడ్ లో అసలైన డాన్స్ గేమ్ స్టార్ట్ అయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.ఏది ఏమైనా జానీ లాంటి స్టార్ కొరియోగ్రాఫర్ ని కాదని, పది రోజులుగా డాన్స్ కొరియోగ్రఫీ ని ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ అతన్ని పక్కన పెట్టి మరీ సందీప్ ని తీసుకోవడం అంత ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

మరో వైపు శేఖర్ మాస్టర్ కూడా ఇపుడు టాలీవుడ్ లో మోస్ట్ బిజియెస్ట్ కొరియోగ్రాఫర్.ఒక వైపు సినిమాలు,మరో వైపు టీవీ షోలు ఇలా కొంచెం కూడా గ్యాప్ లేకుండా దూసుకుపోతున్నాడు.అయితే అదే డాన్స్ యూనియన్ లో జరిగిన రచ్చలో శేఖర్ మాస్టర్ పేరు కూడా మీడియాలో తెగ హైలెట్ అయిన సంగతి తెలిసిందే.

సందీప్ ఎలాంటి పాటలతో ఇండస్ట్రీలో పాగా వేస్తాడో !

దీంతో వాళ్ళు వీళ్ళు ఎందుకంటూ ఇలా పక్క దిక్కులు చూస్తున్నారట ప్రొడ్యూసర్స్.ఇలాగే ఆటా సందీప్ కనుక ఇలాగే మరో రెండు మూడు బ్లాక్ బస్టర్ సాంగ్స్ చేస్తే మాత్రం టాలీవుడ్ లో మరో ప్రామిసింగ్ కొరియోగ్రాఫర్ దొరికినట్టే.నిజానికి ఉన్నపళంగా సందీప్ వాళ్ళని పక్కకి నెట్టేసి టాప్ పొజిషన్ లో కూర్చోకపోయినప్పటికీ వాళ్ళ డామినేషన్ కి మాత్రం గండి పడటం ఖాయం.

also read మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

అయితే సోషల్ మీడియాలో దీనిపై రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి.సందీప్ బుల్లి తెర నుండి వచ్చాడు..ఇక్కడ సినిమాల్లో ఎక్కువ కాలం ఉండలేడు.అని కొందరు అంటుంటే టాలెంట్ ఉండాలే కాని సినిమా ఏంటి టీవి ఏంటి అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.చూడాలి మరి వచ్చే రోజుల్లో ఆటా సందీప్ ఎలాంటి పాటలతో ఇండస్ట్రీలో పాగా వేస్తాడో !

Tags

Related News

ఎన్టీఆర్ లేకుండానే ‘డ్రాగన్’ షూటింగ్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్!

శూర్పణఖ పాత్రపై రకుల్ షాకింగ్ కామెంట్స్!

జయం రవి విడాకుల కేస్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఆర్తి తల్లి!

త్రిషపై ఉదయనిధి అసభ్యకర వ్యాఖ్యలు.. కుష్బూ సంచలన ట్వీట్!

సర్జరీ తర్వాత తొలిసారి దర్శనమిచ్చిన రామ్ చరణ్.. డ్యాషింగ్ లుక్ తో!

ఆ సెలబ్రిటీల బాటలో శృతిహాసన్.. మరీ ఇంత దారుణంగా తయారయ్యారా?

ముంబై కోర్టును ఆశ్రయించిన శృతి హాసన్.. ఆ ఒక్కటి చేస్తే జైలుకే..!

Big Stories

Advertisement
×