E-Paper
Advertisement

స్టూడెంట్ నెంబర్.1 @ 25 ఏళ్లు.. ‘సత్య’ పై రాజీవ్ కనకాల స్పెషల్ వీడియో!

స్టూడెంట్ నెంబర్.1 @ 25 ఏళ్లు.. ‘సత్య’ పై రాజీవ్ కనకాల స్పెషల్ వీడియో!
Advertisement

Rajeev Kanakala:రాజీవ్ కనకాల (Rajeev kanakala) .. తెలుగు సినిమా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. దివంగత సుప్రసిద్ధ దర్శకులు, నటులు అయిన దేవదాసు కనకాల తనయుడు. సినిమాలలో నటించడానికి ముందు టీవీ సీరియల్స్ లో నటిస్తూ.. తన కెరీర్ ను ఆరంభించిన రాజీవ్ కనకాల.. 1991లో వచ్చిన బాయ్ ఫ్రెండ్ అనే చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక 1995లో రాంబంటు చిత్రంతో పరవాలేదు అనిపించుకున్న ఈయన.. ఆ తర్వాత కన్యాదానం, ఆహా, ప్రేమ కోసం, ఆటో డ్రైవర్, పెద్దన్నయ్య ఇలా ఎన్నో చిత్రాలు చేశారు.

‘సత్య’తో ఊహించని గుర్తింపు.. రాజీవ్ కనకాల పోస్ట్ వైరల్..

కానీ 2001లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో సత్య పాత్ర ఈయనకు మంచి గుర్తింపును అందించింది. ఇకపోతే స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా విడుదలయి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా.. రాజీవ్ కనకాల ఒక స్పెషల్ వీడియోని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..” 25 ఏళ్ల క్రితం వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా.. అదొక సినిమా మాత్రమే కాదు నా జీవితంలో ఒక ప్రత్యేకమైన అధ్యాయం.

Advertisement

ఈ సినిమా తర్వాతే నేను పూర్తిగా సినిమాల్లోకి వచ్చాను. సత్య అనే పాత్రతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాను. ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా ఆ పాత్ర గురించి గుర్తుచేసుకొని మాట్లాడే వాళ్ళు ఉన్నారు అంటే.. ఇక అది నాకు ఎప్పటికీ ప్రత్యేకమైన ఆనందమే. ఈ ప్రయాణంలో నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన ఎస్.ఎస్ రాజమౌళి గారు, కే రాఘవేంద్రరావు గారు, ఎన్టీఆర్, ఎమ్. ఎమ్ కీరవాణి గారు, వినోద్ గారు అలాగే సినిమా తారాగణంలో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సినిమా నాకు ఇచ్చిన గొప్ప బహుమతి స్నేహం ..

also read:మిథిలేష్ పరువు తీయాలనుకున్న బిగ్ బాస్.. కట్ చేస్తే?

మరువలేని స్నేహాలు.. మరెన్నో జ్ఞాపకాలు..

Advertisement

స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి ఏర్పడిన బంధాలు, ఆ తర్వాత కలిసి చేసిన సినిమాలు, పంచుకున్న అనుభవాలు ఇవన్నీ ఈ 25 ఏళ్ల ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చాయి. ఒకప్పుడు ఫ్లాప్ అన్నారు.. కానీ అదే సినిమా 100 రోజులు 42 కేంద్రాలలో ఆడింది. స్టూడెంట్ నెంబర్ వన్ ఇది ఒక సినిమా మాత్రమే కాదు జీవితాంతం గుర్తుండిపోయే సినిమా.. ఎన్నో జ్ఞాపకాలను, స్నేహాలను , మరువలేని జ్ఞాపకాలను మిగిల్చిన సినిమా ” అంటూ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ఇండస్ట్రీలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు రాజీవ్ కనకాల. ఈ మేరకు పంచుకున్న పోస్టు, ఆయన స్వయంగా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

అప్పట్లోనే 12 కోట్లు రాబట్టిన స్టూడెంట్ నెంబర్ వన్..

స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా విషయానికొస్తే.. జూనియర్ ఎన్టీఆర్, గజాల జంటగా. రాజీవ్ కనకాల, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తూ 2001లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్. 148 నిమిషాల నిడివితో కేవలం 1.85 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ రన్ ముగిసేసరికి ఏకంగా 12 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించగా.. ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందించారు.

 

Related News

చిన్న సినిమాలను తొక్కిపెడితే ఊరుకోం: హీరో షిరాజ్ మెహదీ ఆగ్రహం..

గంగా హాస్పిటల్ డాక్టర్స్ కు రామ్ చరణ్ కృతజ్ఞతలు..!

150 ఏళ్ల నాటి నిజ జీవిత కథ..రణబాలి ఫస్ట్ సిరీస్ డాక్యుమెంటరీ రిలీజ్!

వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు..బలవంతపు ప్రేమ అక్కర్లేదు.. రాశి ఖన్నా

పెళ్లి పై ఓపెన్ అయిన అంజలి..అంత ఆత్రుత ఎందుకో అంటూ?

కంప్లైంట్ చేసింది భక్తిపై కాదు.. అల్లు శిరీష్ పోస్ట్ వైరల్!

అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి.. అడుక్కోవడానికి కాదు..మదర్ సెంటిమెంట్ తో ‘స్లమ్ డాగ్ ‘ గ్లింప్స్!

Big Stories

Advertisement
×