Bigg Boss 10 Mithilesh Reddy: మిథిలేష్ రెడ్డి.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ కుర్రాడి పేరే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. కామనర్.. పైగా వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగు పెట్టాడు. వచ్చీ రాగానే తన స్ట్రాటజీ ఏంటో చూపించి రెండు రోజుల్లోనే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ఇచ్చిన బ్రీఫ్ కేస్ పట్టుకొని బయటకొచ్చేశారు. అసలైన విన్నర్ అని అనిపించుకున్నాడు ఏకంగా రెండు రోజుల్లోనే 15 లక్షలు సొంతం చేసుకొని బిగ్ బాస్ నే ఆశ్చర్యపరిచాడు ఈ కుర్రాడు.
ఇప్పటివరకు బిగ్ బాస్ కి ఎంతోమంది వచ్చారు.. కొంతమంది తమకున్న ఇమేజ్ చెడగొట్టుకుంటే.. మరి కొంతమంది మంచి పేరు తెచ్చుకొని బయటకొచ్చారు. కానీ ఎవరిని అడిగినా కప్పు కొట్టడమే ముఖ్యం అంటారు. డబ్బులదేముంది ఎలా అయినా సంపాదించుకోవచ్చు.. పేరు ముఖ్యం లాంటి ఎన్నో కామెంట్లు చేస్తారు. కానీ వీళ్ళలో చాలామందికి తెలుసు నిజంగా వాళ్ళు కప్పు కొట్టగలరా ?లేదా? అని.. అంతెందుకు సీజన్ చివరి రోజున కప్పు కావాలా? డబ్బు కావాలా ?అని హోస్ట్ నాగార్జున అడిగితే.. ఎవరో ఒకరు అక్కడ ఇచ్చే డబ్బుకు టెంప్ట్ అయ్యి.. డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడం మనం చూస్తూనే ఉన్నాం..నిజానికి కచ్చితంగా కప్పు రాదని, అందుకే ఇచ్చిన సూట్ కేసును తీసుకొని లక్షాధికారులు అయిపోవడం బెటర్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు.
అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. అలా డబ్బు తీసుకొని వెళ్ళిపోయిన వాళ్లంతా హౌస్ లో చాలా రోజులు ఉన్నారు కానీ ఈ సీజన్లో మిథిలేష్ టాప్ 5 వరకు వెళ్లకుండానే.. అన్ని రోజులు కంటెస్టెంట్స్ తో గొడవ పడకుండానే.. కప్పు కంటే తనకు డబ్బులే ముఖ్యమని వచ్చిన రెండో రోజే హోస్ట్ నాగార్జునకి ఓపెన్ గా చెప్పి బయటకు వచ్చేసాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 లక్షలు పట్టుకొని బయటకెళ్ళిపోయాడు. ఈ ట్విస్ట్ అటు నాగార్జున కూడా ఊహించి ఉండడు. నిజానికి షోకి వచ్చే వాళ్లలో అందరూ చివరి రోజున వచ్చే డబ్బుల కోసమే వస్తారనేది అందరికీ తెలిసిన నిజమే.. కానీ ఎవరూ పైకి చెప్పరు. ఇదో బహిరంగ రహస్యం కూడా.. అయితే డబ్బుల సూట్ కేసును తీసుకొని స్వయంగా బయటకి వచ్చిన విషయంలో గతంలో ఇప్పుడు మిథిలేష్ జనానికి బాగా గుర్తుండిపోతారని చెప్పవచ్చు.
also read: ఈ రొమాన్స్ ఏంటి బిగ్ బాస్?
హౌస్ లో చివరికి వరకూ ఉన్నా సరే మిథిలేష్ కి ఇంత గుర్తింపు వచ్చి ఉండేది కాదేమో.. కేవలం రెండు రోజుల్లోనే ఉండి ఎంచక్కా డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు. డబ్బుతో పాటు ఫేమ్ కూడా వచ్చింది. అందుకే సోషల్ మీడియాలో మిథిలేష్ చేసింది సరైన పనే అని అందరూ మెచ్చుకుంటున్నారు. నిజానికి మిథిలేష్ చేసింది చాలా పెద్ద తప్పు అన్నట్లు ప్రొజెక్ట్ చేయడానికి బిగ్ బాస్ ఆర్గనైజర్స్ ఎన్నో కష్టాలు పడ్డారు. అటు శివాజీతో చేసిన బజ్ ఇంటర్వ్యూలో కూడా ఎందుకు వచ్చావు బిగ్ బాస్ కి? అని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగినా.. మిథిలేష్ మాత్రం చాలా కూల్ గా, మెచ్యూర్ గా వచ్చిన పని అయిపోయిందన్నట్లుగానే సమాధానం ఇచ్చాడు. అంతేకాదు 9 సీజన్లు జరిగితే.. అందులో వైల్డ్ కార్డ్ గా వచ్చిన ఎంతమంది టాప్ 5కి వెళ్లారు? మీరే చెప్పండి అంటూ తిరిగి శివాజీనే ఎదురు ప్రశ్నించాడు. టాప్ ఫైవ్లో ప్రతి సీజన్లో ఒక ఫిమేల్ , ఒక ఎంటర్టైనర్, మంచి మ్యానుపులేట్ చేసే వ్యక్తి కచ్చితంగా ఉంటారు. అంటూ అందరికీ చెప్పకనే చెప్పేశారు. దీన్ని బట్టి చూస్తే మిథిలేష్ ఇలా చేస్తాడని ఊహించని బిగ్ బాస్ డబ్బుతో పాటు పరువు కూడా పోగొట్టుకున్నట్టే అనే కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.