Dhoni Fan Died: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ గురించి, అతని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్ లోనే కాదు.. ఏ రంగంలోనైనా ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదని చెప్పవచ్చు. మహేంద్ర సింగ్ ధోనిని అభిమానించే వారి సంఖ్య లక్షల్లో కాదు.. కోట్లలో ఉంటుంది. అతడు రిటైర్మెంట్ ప్రకటించి సంవత్సరాలు గడుస్తున్నా అతనిపై అభిమానం చెక్కుచెదరలేదు. వయసుతో నిమిత్తం కూడా లేదు. ప్రాంతాలతో అస్సలు సంబంధం లేదు. ఏ ప్రాంతమైనా, ఏ మైదానమైనా, ఏ నగరమైనా.. ధోని వస్తున్నాడు అంటే చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు వస్తుంటారు.
Also Read: Tim David – Brevis: ఇద్దరు విషయంలో అంబానీ తప్పుడు నిర్ణయం.. అతలాకుతలంలో ముంబై ఇండియన్స్
మహేంద్ర సింగ్ ధోని మైదానంలోకి రాకపోయినా.. కనీసం గ్యాలరీ నుండి కనిపిస్తే చాలు.. మైదానంలో వినిపించే సౌండ్ మామూలుగా ఉండదు. మైదానంలో మైకుల కంటే అత్యధికంగా అతడి ఫ్యాన్స్ నినాదాలు వినిపిస్తాయి. మైదానంలో ధోని ప్లాకార్డులు కనిపించినట్లుగా మరే ఆటగాడి ఫ్లకార్డులు కనిపించవు. సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు ధోనిని అభిమానించని వారు ఉండరు. కేవలం అతడి క్యారెక్టర్ చూసి కోట్లాదిమంది అభిమానులు అతడి సొంతమయ్యారంటే అతిశయోక్తి కాదనిపిస్తుంది. ప్రస్తుతం ధోని ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి మాత్రమే ఆడుతున్నాడు.
ఇక వికెట్ కీపర్ గా ధోని కదలికలను చూస్తే.. ఈ వయసులో కూడా అంత స్పీడ్ ను చూసి, వికెట్లను బంతితో తీసే వేగాన్ని చూసి అందరూ ఆశ్చర్య పోవాల్సిందే. అలాంటి మహేంద్ర సింగ్ ధోని అభిమానులకు ఇది ఓ చేదువార్త అనే చెప్పాలి. తాజాగా ధోని వీరాభిమాని ఒకరు దుర్మరణం చెందారు. ధోనీని దేవుడిలా ఆరాధించే జయ్ జానీ అనే 27 ఏళ్ల యువకుడు గుజరాత్ రాష్ట్రం భావ్ నగర్ జిల్లాలో మరణించాడు. తన స్వగ్రామం రబరికాలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో జయ్ జానీ ప్రాణాలు కోల్పోయాడు. ఈనెల 12వ తేదీన జయ్ తన వ్యవసాయ భూమికి వెళుతుండగా.. ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది.
Also Read: Ramiz Raja: బాల్ లో చిప్ పెట్టారు.. వెస్టిండీస్ పై పాకిస్తాన్ సంచలన ఆరోపణలు.. అంతా తొండాట అంటూ !
ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లగా రెండు రోజులు మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచాడు. ఇతడు ఐపీఎల్ 2024 సమయంలో నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో భద్రతా సిబ్బందిని దాటి మహేంద్రసింగ్ ధోనీ పాదాలను తాకిన ఘటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఇప్పుడు జయ్ ఆకస్మిక మరణం మహేంద్రసింగ్ ధోని అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అతడి మరణ వార్త విన్న ధోని అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇతడు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటాడు. జయ్ కి ఇన్స్టాగ్రామ్ లో దాదాపు 18 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ధోని వల్లే జయ్ కి ఇంత ఫాలోయింగ్ లభించింది.