E-Paper
Advertisement

తెలుగులోకి ‘హనుమాన్ అంశ్’.. త్రివిక్రమ్ క్రేజీ ప్లాన్ అదుర్స్!

తెలుగులోకి ‘హనుమాన్ అంశ్’.. త్రివిక్రమ్ క్రేజీ ప్లాన్ అదుర్స్!
Advertisement

Hanuman Ansh: ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా మూవీస్ వస్తున్న నేపథ్యంలో ఒక భాషలో తెరకెక్కిన చిత్రాన్ని మిగతా భాషలలో డబ్బింగ్ వెర్షన్లలో రిలీజ్ చేస్తూ ఆడియన్స్ కు దగ్గరవుతున్నారు మేకర్స్. అయితే మరి కొంతమంది ప్రాంతీయంగా సినిమాలను విడుదల చేశాక.. ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం అందుకుంటే, ఆ తర్వాత ఆడియన్స్ ఆసక్తి మేరకు మిగతా భాషలలో ఆ చిత్రాన్ని డబ్బింగ్ వెర్షన్ లో రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా తెరకెక్కి, సంచలనం సృష్టిస్తూ బాలీవుడ్లో కలెక్షన్లతో దూసుకుపోతున్న ఒక చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేస్తూ విడుదల చేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తెలుగులోకి హనుమాన్ అంశ్.. ఎప్పుడంటే?

ఆ చిత్రం ఏదో కాదు హనుమాన్ అంశ్.. బాలీవుడ్ లో ఇటీవల విడుదలై కలెక్షన్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇంతటి ఘనవిజయం అందుకున్న ఈ చిత్రాన్ని తెలుగులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. హిందీ వెర్షన్ లో ఘనవిజయం సాధించి, మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటూ వరుస కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు గురూజీ అలియాస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram srinivas) తెలుగులో విడుదల చేసే బాధ్యతలు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

అధికారిక ప్రకటన ఇచ్చిన ప్రొడ్యూసర్..

Advertisement

ఈ మేరకు హనుమాన్ అంశ్ చిత్ర నిర్మాత నమ్రతా సింగ్ స్వయంగా వెల్లడించారు. భక్తి , దైవిక అంశాలతో రూపొందిన ఈ బయోపిక్ డ్రామాను తెలుగులో కూడా అదే స్థాయిలో విజయవంతం చేసేందుకు త్రివిక్రమ్ చొరవ తీసుకోనున్నారు అంటూ ప్రకటించారు. ఇక తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ భక్తి చిత్రాలను విశేషంగా ఆదరిస్తుంటారు. కాబట్టే ఇప్పుడు ఈ చిత్రం తెలుగు వెర్షన్ పై అటు ఆధ్యాత్మిక వర్గాలలో, సినీ పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక విడుదల తేదీని వెల్లడించనున్నారు. ఏది ఏమైనా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేయడానికి త్రివిక్రమ్ బాధ్యతలు తీసుకోవడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి.

హనుమాన్ అంశ్ సినిమా విశేషాలు..

డాక్టర్ విశాల్ చతుర్వేది తన స్వయంభు మీడియా నెట్వర్క్ బ్యానర్ పై రచించి, దర్శకత్వం వహించి, నిర్మించిన చిత్రం ఇది. భారతీయ హిందీ భాష జీవిత చరిత్ర, భక్తి నాటక చిత్రంగా వచ్చిన ఈ చిత్రంలో పూర్ణిమ తివారి, చందన్ కే ఆనంద్, రాజు మిశ్రా, రిషికేష్ ధూబే , ఋషి పతాక్ వంటి భారీతారాగణం కీలక పాత్రలు పోషించారు.

Advertisement

also read:బిగ్ బాస్ 10 నుండి తొలి లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్.. మొదటి వారంలోనే ఇద్దరా?

కలెక్షన్లతో దూసుకుపోతున్న హనుమాన్ అంశ్..

రూ.2 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 7 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటిరోజు కేవలం రూ.10 లక్షలు మాత్రమే వసూలు చేసిన ఈ సినిమా మొదటి వారంలో రూ.48 లక్షల వరకు వసూలు చేసింది. కానీ ఈ చిత్రానికి బలమైన మౌఖిక ప్రచారం, క్షేత్రస్థాయి ప్రోత్సాహంతో మూడు, నాలుగు వారాల నుండి అసాధారణమైన అభివృద్ధి సాధించి .. ఐదవ వారాంతం ముగిసే సరికి ఇండియాలో ఏకంగా రూ.100 కోట్ల మైలురాయని అందుకుంది. దేశవ్యాప్తంగా 150 కోట్లకు పైగా నికర వసూళ్లు రాబట్టగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.193 కోట్లకు పైగా వసూలు సాధించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

Related News

వెన్నులో వణుకు పుట్టిస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’ మూవీ ట్రైలర్

ఆ క్షణం జీవితాన్ని కోల్పోయినట్టు అనిపించింది: సమంత

లోకేష్  ‘డీసీ’ హిట్..ఆ ముగ్గురికి బీఎండబ్ల్యూ కార్లను గిఫ్ట్ గా ఇచ్చిన ప్రొడ్యూసర్!

శ్రీలీలకు బిగ్ ఛాన్స్.. మోక్షజ్ఞతో జోడీ కడుతుందా?

స్వయంభు’ వెనుక సంయుక్త కష్టం.. వీడియో వైరల్!

మరో బిజినెస్‌లోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ.. కొత్త స్కిన్‌కేర్ బ్రాండ్ ఇదే!

నడవలేని స్థితిలో టాలీవుడ్ లేడీ కమెడియన్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×