Ranabali Story:పెళ్లి చూపులు సినిమాతో మొదటి విజయాన్ని చూసి, అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు విజయ్ దేవరకొండ.అయితే టాక్సీవాలా తర్వాత ఇప్పటికీ సరైన హిట్ ని పట్టుకోలేకపోతున్నాడు.డియర్ కామ్రేడ్ ,వరల్డ్ ఫేమస్ లవర్ ,లైగర్ ఖుషి, ఫ్యామిలీ స్టార్ , కింగ్‌డమ్ – సూరి ఇలా ఏ సినిమా చేసినా యావరేజ్, బిలో యావరేజ్ తప్ప బ్లాక్ బస్టర్ హిట్ ని చూసింది లేదు.
దీంతో మళ్ళీ టాక్సీవాలా వంటి సాలిడ్ హిట్ ఇచ్చిన రాహుల్ సాంకృత్యాన్ తో ఈసారి రణబాలి అంటూ పీరియాడికల్ బ్యాక్డ్రాప్ సినిమాని పట్టాలెక్కించాడు.ఇక ఈ సినిమా వచ్చే నెల అక్టోబర్16న ఆడియన్స్ ముందుకు తెస్తున్నామంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు కూడా.ఈ సందర్భంగా సినిమా కథ ఇదేనా అంటూ ఒక క్రేజీ స్టోరీ నెట్టింట వైరల్ అవుతుంది. మరింతకీ ఆ స్టోరీ ఏంటో మనమూ చూసేద్దాం.
కథ విషయానికి వస్తే
సినిమా కథ విషయానికి వస్తే ఇది 1870ల కాలంలో జరగనున్నట్టు తెలుస్తుంది.ముఖ్యంగా 1876-78 మధ్య రాయలసీమ ప్రాంతాన్ని పట్టి పీడించిన కరువు అనే మహమ్మారి ఆధారంగా సాగుతుంది.వర్షాలు లేక వర్షాలు లేక, పంటలు పండక, తిండి దొరకక వేలాది మంది ప్రజలు ఆకలితో చనిపోతారట.
అయితే అంత కరువు ఉన్నప్పటికీ ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న బ్రిటీష్ పాలకులు వారిని చిత్ర హింసలకి గురి చేసి ,అక్కడ పండే కొద్దిపాటి ధాన్యాన్ని కూడా వారికి దక్కకుండా పరాయి దేశాలకి ఎగుమతి చేస్తుంటారు.అలా అక్కడి ప్రజలకి,బిట్రీష్ వారికి మధ్య జరిగే యుద్ధం నుండే ఈ కథ పుడుతుంది.
ఇక ఈ బ్రిటీష్ దురాగతాలని ఎదిరించేందుకు పుట్టుకొచ్చిన తిరుగుబాటుదారుడే ‘రణబాలి’. ఒక సాధారణ ఊరి యువకుడిగా విజయ్ దేవరకొండ ఈ సినిమాలో మొదట కనిపిస్తాడు. తన కళ్లముందే ప్రజలు ఆకలితో చనిపోవడం, బ్రిటిష్ వారి అన్యాయాలు చూడలేక వారిని ఎదురించేందుకు ఆయుధం పడతాడు.
ఆక్రమంలోనే వారిని ఎదురించేందుకు బ్రిటిష్ వారిపై దాడి చేయడంతో రణబాలిని బ్రిటీష్ వారు దొంగగా తమ రికార్డుల్లోకి ఎక్కిస్తారు.కాని తమని కాపాడుతున్న అతడిని ఆ ఊరి వాళ్ళు ఒక వీరుడిగా కొలుస్తారు.
పోరాటానికి తోడుగా జయమ్మ
ఇక రణబాలిని ఏరి కోరి చేసుకున్న జయమ్మ అతడి పోరాటానికి కూడా తోడుగా నిలబడుతుంది..అయితే రణబాలి బ్రిటీషర్స్ తో తలపడుతుంటే,మరోవైపు భయంతో, ఆందోళనతో గడిపే అతడి కుటుంబం అనుభవించే బాధను జయమ్మ పాత్ర ద్వారా చూపించబోతున్నట్టు తెలుస్తుంది.
ఇక రణబాలిని అడ్డుకోవడానికి హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ‘సర్ థియోడర్ హెక్టర్’ అనే బ్రిటిష్ అధికారిగా కనిపిస్తారు.అక్కడి ప్రజలని పీక్కుతినే రాబందుగా ఆర్నాల్డ్ వోస్లూ విలనిజం నెక్స్ట్ లెవల్ అని ఇన్ సైడ్ టాక్.
ఎలాంటి కథతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తాడో !
ప్రజలను అణచివేయడం, రణబాలిని పట్టుకోవడానికి కుట్రలు చేయడంలో ఈ పాత్ర కీ రోల్ పోషిస్తుంది.మొత్తంగా పేద ప్రజల కడుపు నింపేందుకు రణ బాలి బ్రిటీషర్స్ తో చేసే పోరాటమే ఈ సినిమా అని తెలుస్తుంది. చూడాలి మరి అక్టోబర్ 16న రానున్న ఈ సినిమాలో రౌడీ ఎలాంటి కథతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తాడో !