E-Paper
Advertisement

ట్రైలర్ లేకుండానే థియేటర్లోకి నాని ‘ప్యారడైజ్’ మూవీ..క్లారిటీ ఇచ్చిన హీరో!

ట్రైలర్ లేకుండానే థియేటర్లోకి నాని ‘ప్యారడైజ్’ మూవీ..క్లారిటీ ఇచ్చిన హీరో!
Advertisement

The Paradise Trailer: నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల(Sreekanth Odela) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ది ప్యారడైజ్(The Paradise). ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం మొదటిసారి ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సినిమా విడుదల గురించి అలాగే ట్రైలర్ గురించి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలన్నింటికీ చెక్ పెడుతూ చిత్ర బృందం నేడు ప్రెస్ మీట్ కార్యక్రమం ద్వారా అన్ని సందేహాలకు క్లారిటీ ఇచ్చారు.

తప్పనిసరి పరిస్థితులలో..

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయడం లేదు అంటూ వస్తున్నటువంటి వార్తల పట్ల నాని  స్పందిస్తూ.. అందరూ అనుకుంటున్న విధంగానే ఈ సినిమాకు ఏ విధమైనటువంటి ట్రైలర్ రిలీజ్ చేయడం లేదని తెలిపారు. ఇలా ట్రైలర్ విడుదల చేయకుండా ఉండడానికి గల కారణాన్ని కూడా నాని తెలిపారు. బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం కోసమే ట్రైలర్ రిలీజ్ చేయలేదని తెలిపారు. ఈ విషయంలో ప్రేక్షకులను గ్రాంటెడ్ గా తీసుకోవడం లేదు. మీకు ఇస్తే అది అదిరిపోయే ట్రైలర్ అయి ఉండాలి. అలా ఉండాలి అంటే ఈ ట్రైలర్ వీడియో కోసం తాము ఒక నాలుగు ఐదు రోజుల పాటు పనిచేయాల్సి ఉంటుందని నాని తెలిపారు. అందుకే తప్పనిసరి పరిస్థితులలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు.

బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసమే..

Advertisement

ఇలా సమయాభావం లేకపోవడం అలాగే బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని నాని చెప్పడంతో అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ట్రైలర్ లేకుండా సినిమా ఎలా ఉండబోతోందనే విషయాల పట్ల చర్చలు జరుపుతున్నారు. ఇక నాని ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఆయా షేర్, యేషనాగుల కట్ట పాటల గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ముఖ్యంగా ఈ పాటలకు డాన్స్ చేస్తున్న సమయంలో జడలు కారణంగా చాలా ఇబ్బందులు పడ్డామని, రోప్ సహాయంతో డాన్స్ చేస్తున్న సమయంలో నేనొక వైపు తిరిగితే ఆ రోప్స్ కారణంగా జడలు ఒక వైపుకు లాగేవని తద్వారా చాలా కష్టాలు పడ్డామని తెలిపారు.

రెస్పాన్స్ చూస్తుంటే సంతోషంగా ఉంది..

ఇలా ఈ పాటల కోసం మొదట్లో కష్టం అనిపించినప్పటికీ ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మాత్రం చాలా సంతోషంగా ఉందని నాని తెలిపారు. శ్రీకాంత్ ఓదెల నాని కాంబినేషన్లో దసరా సినిమా తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ఎస్ఎల్వి సినీ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించగా, మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు, వంటి తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు .నాని జోడిగా కయాదులోహర్ నటించగా కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్ లో సందడి చేస్తున్నారు.

Advertisement

Also Read: నటరాజ్ మాస్టర్ ను వెన్నుపోటు పొడిచిన లేడీ ఆర్టిస్ట్..శారీ వేసుకొని మోసం చేస్తుందంటూ!

Related News

రేణు దేశాయ్ రీఎంట్రీ.. కాశీ మజిలీ ట్రైలర్ అదిరిపోయిందిగా!

ఆకలి నుంచి పుట్టిన తిరుగుబాటు.. ‘రణబాలి’ అసలు స్టోరీ ఇదేనా?

వెన్నులో వణుకు పుట్టిస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’ మూవీ ట్రైలర్

తెలుగులోకి ‘హనుమాన్ అంశ్’.. త్రివిక్రమ్ క్రేజీ ప్లాన్ అదుర్స్!

ఆ క్షణం జీవితాన్ని కోల్పోయినట్టు అనిపించింది: సమంత

లోకేష్  ‘డీసీ’ హిట్..ఆ ముగ్గురికి బీఎండబ్ల్యూ కార్లను గిఫ్ట్ గా ఇచ్చిన ప్రొడ్యూసర్!

శ్రీలీలకు బిగ్ ఛాన్స్.. మోక్షజ్ఞతో జోడీ కడుతుందా?

Big Stories

Advertisement
×