Coolie: కొంతమంది హీరోలకి ఉన్న ఫ్యాన్ బేస్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే సరైన కాంబినేషన్ పడక ఆ సినిమాలకు బజ్ తగ్గుతుంది. కానీ సరైన దర్శకుడు దొరికితే ఆ సినిమాకి బుకింగ్స్ ఎలా ఉంటాయో అని చెప్పడానికి రీసెంట్ టైమ్స్ లో చాలా సినిమాలు మంచి ఉదాహరణ.
ఉదాహరణకు పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అంటే టిక్కెట్ దొరకడమే గగనం అయిపోయేది. ఇప్పుడు మొదటి షో పడగానే సినిమా టాక్ బట్టి పవన్ కళ్యాణ్ సినిమా కూడా టికెట్లు దొరుకుతున్నాయి. ఒక సినిమా రిలీజ్ కి రెడీగా ఉన్నా కూడా ఆ సినిమా కాకుండా ఇంకో సినిమా గురించి మాట్లాడుతున్నారో ఆడియన్స్. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సిద్ధంగా ఉన్న తరుణంలో అందరూ ఓ జి ఓ జి అంటూ అరిచారు. ఇప్పటికీ ఓజీ సినిమా మీద విపరీతమైన హై ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో రజనీ ర్యాంపేజ్
తెలుగు రాష్ట్రాల్లో రజనీకాంత్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే సరైన దర్శకుడు తో సినిమా చేస్తే ఆ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. ప్రస్తుతం కూలీ సినిమా బుకింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది.
తెలంగాణలో మొదట 80 షోస్ ఓపెన్ చేశారు. 72% ఆక్యుపెన్సితో కోటి రూపాయల గ్రాస్ కంప్లీట్ చేసుకుంది సినిమా. అంతేకాకుండా మిగతా థియేటర్స్ లో కూడా ఈ సినిమా టికెట్లు విపరీతంగా బుక్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా వార్ 2 సినిమాను క్లియర్ గా డామినేట్ చేస్తుంది కూలీ. మొత్తానికి ఆగస్టు 14న థియేటర్లు మళ్ళీ కళకళలాడనున్నాయి.
పూర్వ వైభవం
ఇప్పుడు ఆడియన్స్ థియేటర్ కు వచ్చి సినిమా చూడాలి అంటే, ఆ సినిమా దర్శకుడు మీద నటించే హీరో మీద విపరీతమైన అభిమానం ఉండాలి. లేదంటే విపరీతమైన నమ్మకం ఉండాలి. ఈ రెండూ లేకుంటే నెల రోజులు ఓపిక ఉంటే చాలు అనుకోవడం మొదలుపెట్టారు ఆడియన్స్. ఎందుకంటే సినిమా ఆటోమెటిక్ గా ఓటీటీ లోకి వచ్చేస్తుంది. అయితే ఆగస్టు 14న రెండు భారీ సినిమాలు విడుదలవుతున్న సందర్భంగా బుక్ మై షో లో టిక్కెట్లు విపరీతంగా అమ్ముడు అవుతున్నాయి. టికెట్స్ బుకింగ్స్ చూస్తుంటే మళ్ళీ థియేటర్లకి పూర్వ వైభవం వచ్చింది అని అర్థమవుతుంది. ఇక సినిమా ఫలితం కూడా పాజిటివ్ గా వస్తే సినిమా పరిశ్రమ ఒక అడుగు ముందుకేసినట్లే అని చెప్పాలి.
Also Read: Coolie: ప్రసాద్ ఐమాక్స్ లో పిల్లలపై ఆంక్షలు… షాకింగ్ నిర్ణయం తీసుకున్న మేనేజ్మెంట్