BigTV English

Coolie PowerHouse : ఒక సాంగ్ చూడటానికి టికెట్ 1200..? సరిపోతాయా అన్నా ఆస్తి పేపర్లు కూడా ఇచ్చేయాలా.?

Coolie PowerHouse : ఒక సాంగ్ చూడటానికి టికెట్ 1200..? సరిపోతాయా అన్నా ఆస్తి పేపర్లు కూడా ఇచ్చేయాలా.?

Coolie PowerHouse : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రాబోతున్న మంచి అంచనాలు ఉన్న సినిమాలలో కూలి సినిమా ఒకటి. వాస్తవానికి ఇది తెలుగు సినిమా కాకపోయినా కూడా ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఓన్ చేసుకున్నారు. ఇదివరకే లోకేష్ కనగరాజ్ సాధించుకున్న పేరు, అలానే ఈ సినిమాలో ఉన్న పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ ఇవన్నీ కూడా కారణాలు కావచ్చు. యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు.


కేవలం నాగర్జున మాత్రమే కాకుండా, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. తరుణంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ విపరీతంగా చేస్తున్నారు. ఇదివరకే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదలయ్యాయి.

సాంగ్ లాంచ్ ఈవెంట్ హెవీ కాస్ట్ 


ఈ సినిమా నుంచి ఇప్పటికి రెండు పాటలు విడుదలైన సంగతి తెలిసిందే. రెండు పాటలు కూడా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మౌనిక సాంగ్ ఇప్పటికీ వైరల్ గా మారిపోయింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతుంది చిత్ర యూనిట్. ఈ థర్డ్ సింగిల్ హైదరాబాద్ లో రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ సాంగ్ ని నార్మల్ గా కాకుండా ఒక కన్సర్ట్ లాగా రిలీజ్ చేయనున్నారు. ఈ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కి సంబంధించిన ఒక టికెట్ కాస్ట్ దాదాపు 1200 ఉంది. కేవలం ఒక్క పాట కోసమే అంత ఖర్చు పెట్టుకుని ఎవరు వెళ్తారు అని కొంతమంది అభిప్రాయం. కొంతమంది మాత్రం ఇవే డబ్బులు ఉంటే చెన్నై వెళ్లి సినిమా చూసి రావచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఆస్తి పేపర్లు ఇచ్చేయమంటారా అంటున్నారు.

భారీగా ప్లాన్ చేశారు 

ఇక ఈ సినిమా రైట్స్ ను చాలామంది నిర్మాతలు కొనడానికి పోటీపడ్డారు. మొత్తానికి ముగ్గురు బడా నిర్మాతలు కలిసి ఈ సినిమాను కొనుక్కున్నారు. అయితే ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉండడానికి కారణం ఒకటి కాంబినేషన్. రెండు ఈ సినిమాలో ఉన్న స్టార్ కాస్ట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా నుంచి పవర్ హౌస్ అనే పాట జులై 22న విడుదల కానుంది. ఇప్పటికే రెండు పాటలు ఆకట్టుకున్నాయి. ఇక ఈ పాటలో పవర్ హౌస్ అనే పేరు ఉండటం వలన ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. మరి పాట ఏ స్థాయిలో ఉంటుందో వేచి చూడాలి. ముఖ్యంగా రజనీకాంత్ అంటేనే అనిరుద్ కి మంచి పూనకాలు వస్తాయి.

Also Read : Pawan kalyan : వీరమల్లుకు పోటీకి వచ్చే మూవీ ట్రైలర్… పవన్ కి అల్లు వారు గట్టి దెబ్బ కొట్టేలా ఉన్నారు

Related News

Ghaati: ఘాటీ సినిమాపై ఈగల్ టీమ్ అభ్యంతరం

2026 summer movies: 2026 సమ్మర్ అంతా భలే సెట్ చేసారు, బట్ చెప్పిన డేట్ కి వస్తారా

Anushka-Allu Arjun: అల్లు అర్జున్ – అనుష్క కాంబోలో మూవీ… రెండు పార్ట్స్, ఇద్దరు డైరెక్టర్స్..!

Balakrishna: అఖండ 2 రిలీజ్ పై బాలయ్య క్లారిటీ.. సోషల్ మీడియాపై మండిపాటు!

OG Movie : రిలీజ్‌కి ముందే ఓజీ విధ్వంసం… పుష్ప 2, కల్కి రికార్డులు బద్దలు

Lavanya – Raj Tarun: శేఖర్ భాషను కలుద్దామని కోరిన లావణ్య.. కట్ చేస్తే.. మరీ ఇంత దారుణమా?

Big Stories

×