OTT Movie : సీరియల్ కిల్లర్ సినిమాలు, సిరీస్ లు గూస్ బంప్స్ తెప్పిస్తుంటాయి. ఇందులో సైకోలు చేసే అరాచకాలు మామూలుగా ఉండవు. ఒక్కో క్షణం గుండె ఆగినట్లు అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ ఢిల్లీలో 1998-2007 మధ్య 18 మందిని హత్య చేసి, వారి శరీరాలను ముక్కలు చేసిన సీరియల్ కిల్లర్ చంద్రకాంత్ ఝా చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ ఝా చేసిన దుర్మార్గపు నేరాలు, ఢిల్లీ పోలీసులు అతన్ని పట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలపై దృష్టి సారిస్తుంది. అంతే కాకుండా న్యాయవ్యవస్థలోని లోపాలను కూడా హైలైట్ చేస్తుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
‘ఇండియన్ ప్రిడేటర్: ది బుచర్ ఆఫ్ ఢిల్లీ’ (Indian Predator: The Butcher of Delhi) అనేది Netflix లో 2022 జూలై 20న విడుదలైన మూడు ఎపిసోడ్‌ల హిందీ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్. దీనికి అయేషా సూద్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం
భాషలలొ ఈ సిరీస్ అందుబాటులో ఉంది. IMDb లో దీనికి 6.1/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ సిరీస్ 20 అక్టోబర్ 2006న ఢిల్లీలోని తీహార్ జైలు గేటు ముందు, ఒక తల వేలాడదీసిన సీన్ తో మొదలవుతుంది. దమ్ముంటే నన్ను పట్టుకోండి అని ఎగతాళి చేసేలా ఉంటుంది క్రిమినల్ చర్య. ఈ ఘటన ఢిల్లీ పోలీసులు సీరియస్ గా తీసుకుంటారు. ఆ సీరియల్ కిల్లర్ ని పట్టుకోవడానికి వేట మొదలుపెడతారు. ఇది చేసింది చంద్రకాంత్ ఝా అని తేలుతుంది. అతను బీహార్ నుండి వలస వచ్చిన ఒక హాకర్. ఝా 1998-2007 మధ్య కనీసం 18 మంది వలస కార్మికులను, ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన వారిని, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి గొంతు పిసికి హత్య చేసి, వారి శరీరాలను ముక్కలు చేసేవాడు. అతను తన నేరాలను బహిరంగంగా ప్రదర్శించడానికి తీహార్ జైలు బయట శవాలను వదిలివేసేవాడు. పోలీసులను ఎగతాళి చేసే విధంగా అతని చర్యలు ఉండేవి.
ఎపిసోడ్ 1: 2006లో తీహార్ జైలు వెలుపల ఒక తల కోసిన శవం కననబడటంతో ఈ కేసు దర్యాప్తు ప్రారంభమవుతుంది. ఆఫీసర్ సుందర్ సింగ్ నేతృత్వంలో ఢిల్లీ పోలీసులు ఝా నేరాలను ఛేదించడం మొదలుపెడతారు. ఈ ఎపిసోడ్ ఝా చేసిన మొదటి మూడు హత్యలను (2003లో శేఖర్ ఉమేష్, 2005లో గుడ్డు) వివరిస్తుంది.
ఎపిసోడ్ 2: ఝా 2006-2007 మధ్యలో చేసిన హత్యలు (అమిత్, ఉపేందర్, దలీప్) అతని అరెస్టు (20 మే 2007)పై దృష్టి సారిస్తుంది. ఝా గత చరిత్రను పోలీసులు వెలికితీస్తారు. అతను అనేక మందిని హత్య చేసినట్లు ఒప్పుకుంటాడు. కానీ ఖచ్చితమైన ఆధారాలు సేకరించడం దర్యాప్తుకు సవాలుగా మారుతుంది. ఈ ఎపిసోడ్ ఝా మానసిక స్థితిని, పోలీసులపై అతనికి ఉన్న కోపాన్ని చూపిస్తుంది.
ఎపిసోడ్ 3: బీహార్‌లోని ఘోసై గ్రామస్తులు ఝా బాల్యం, అతని జీవితం గురించి వివరాలను అందిస్తారు. నిపుణులు (క్లినికల్ ఫోరెన్సిక్ సైంటిస్ట్ ఎస్.ఎల్. వాయ, డెవలప్‌మెంట్ ఎకనమిస్ట్) ఝా నేరాలకు గల మానసిక కారణాలను విశ్లేషిస్తారు. ఈ ఎపిసోడ్ ఝా జీవితంలోని చీకటి అంశాలను, అతని నేరాలకు దారితీసిన పరిస్థితులను చూపిస్తుంది.
Read Also : కాబోయే భర్తను వదిలేసి, 50 ఏళ్ల ముసలాడితో ఆ పని… ఊహించని ట్విస్టులున్న మలయాళ థ్రిల్లర్