E-Paper
Advertisement

IBomma : ఐ బొమ్మ క్లోజ్ అవ్వడం వల్లే కలెక్షన్లు పెరుగుతున్నాయా? నిర్మాతలలో మార్పు వస్తుందా?

IBomma : ఐ బొమ్మ క్లోజ్ అవ్వడం వల్లే కలెక్షన్లు పెరుగుతున్నాయా? నిర్మాతలలో మార్పు వస్తుందా?
Advertisement

IBomma : ఒకప్పుడు సినిమా రిలీజ్ అయితే చాలామంది థియేటర్ కు వెళ్లి సినిమా చూడడానికే ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఐ బొమ్మ సైట్ వచ్చిందో కొంతమేరకు థియేటర్కు వచ్చే ఆడియన్స్ తగ్గిపోయారు. ఇంట్లో ఫ్రీగా సినిమా చూడడానికి అవకాశం ఉన్నప్పుడు థియేటర్కు వచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎవరు చూస్తారు. చాలామంది ఇదే ఉద్దేశంతో ఉంటారు. కొంతమంది మాత్రమే ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలి. థియేటర్లోనే చూస్తే కిక్ వస్తుంది అనుకునే వాళ్ళు డబ్బులు పెట్టుకుని థియేటర్ కి వస్తారు.

ఇంకొంతమంది రిలీజ్ అయిపోయిన సినిమాకి కూడా వెళ్లి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. ఇలా చూసిన వాళ్ళు కూడా ఎక్కువ శాతం మంది ఉన్నారు. అందుకే ఎక్కువగా రీ రిలీజ్ సినిమాలకు కూడా మంచి కలెక్షన్లు వస్తున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ఐ బొమ్మ రవి మీద వరుసగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అతని గురించి రోజుకో కొత్త వార్త బయటకు వస్తుంది. అలానే అతని తండ్రి చేస్తున్న కామెంట్స్ కూడా రోజు వైరల్ అవుతున్నాయి.

కలెక్షన్లు పెరుగుతున్నాయి

Advertisement

మరోవైపు కొన్ని సినిమాలకు పూర్వ వైభవం వస్తుంది అని చెప్పొచ్చు. సాయిలు కంపాటి దర్శకత్వంలో వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమాలోని నటీనటులు పెద్దగా ఎవరికి తెలియకపోయినా కూడా ఈ సినిమాకి సంబంధించిన వీడియో కంటెంట్ విపరీతంగా వైరల్ అవడం వలన మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

మంచి ఓపెనింగ్స్ వచ్చిన తర్వాత సినిమా బాగుండడంతో మంచి టాక్ వచ్చింది. అలా టాక్ రావడం వలన చాలామంది థియేటర్ కు వెళ్లి సినిమా చూసే ప్రయత్నాలు చేస్తున్నారు. మామూలుగా అయితే ఒక సినిమా బాగుంది అంటే ఐ బొమ్మ లో వచ్చిందా అని కొంతమంది బయట అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఐబొమ్మ క్లోజ్ అయింది కాబట్టి సినిమాకి మంచి పేరు వస్తే థియేటర్ కి వెళ్లి చూస్తున్నారు.

Advertisement

ఆమేరకు కూడా రాజు వెడ్స్ రాంబాయి సినిమాకి కొంత మేరకు కలెక్షన్లు పెరిగాయి అని చెప్పొచ్చు. అలానే సినిమా టిక్కెట్ ధర కూడా తక్కువగా ఉండటం ఈ సినిమాకి ప్లస్ అయింది.

నిర్మాతలు మారుతారా?

రాజు వెడ్స్ రాంబాయి సినిమాకి సంబంధించి సరిగ్గా రెండు విషయాలు జరిగాయి ఒకటి ఐ బొమ్మ క్లోజ్ అవ్వడం. రెండు టికెట్ రేట్లు తగ్గడం. ఈ రెండింటికి తోడైన ముఖ్యమైన విషయం సినిమాకి మంచి టాక్ రావడం. ఇది బాగా కలిసి వచ్చింది. అయితే ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్స్ చూసి తెలుగు సినిమా నిర్మాతలు తమ ఆలోచన ఏమైనా మార్చుకుంటారా అని సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతుంది.

మొదట టిక్కెట్ రేట్లు వీళ్లు తగ్గించినప్పుడు చాలామంది ఇండస్ట్రీ వల్లే వీళ్లకు వ్యతిరేకంగా మాట్లాడారు. అయితే ఇప్పుడు వీళ్లు చేసిందే కరెక్ట్ అని కొంతమంది వాదిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మాతలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Also Read: Akhanda 2 : వారణాసిలో అఖండ 2 ఈవెంట్? ఇదెక్కడి మాస్ బోయా

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×