E-Paper
Advertisement

నవ్వులు పూయిస్తున్న గోల్డెన్ భాగ్యం గ్లింప్స్!

నవ్వులు పూయిస్తున్న గోల్డెన్ భాగ్యం గ్లింప్స్!
Advertisement

Golden Bhagyam glimpse: సాధారణంగా బహుభాషా నటీనటులు ఒకే చిత్రంలో కలసి కనిపిస్తేనే అభిమానుల ఆనందానికి అవధులు ఉండదు. అలాంటిది బహు భాషా కమెడియన్స్ ఒకే సినిమాలో కనిపిస్తే.. ఆ సినిమా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే టాలీవుడ్ కమెడియన్ సత్య (Sathya ), కోలీవుడ్ కమెడియన్ యోగి బాబు ప్రధాన పాత్రల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కొత్త సినిమా గోల్డెన్ భాగ్యం. రంగబలి సినిమా దర్శకుడు పవన్ బాసం శెట్టి (Pawan Basam Shetty) ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా.. నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.

ఆకట్టుకుంటున్న గోల్డెన్ భాగ్యం గ్లింప్స్..

డ్రీమ్ మూవీ మేకర్స్, నయా వాయు చిత్రాల బ్యానర్లపై నాగార్జున రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బాపిరెడ్డి, పవన్ బాసం శెట్టి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ను మేకర్స్ విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ ఆద్యంతం కామెడీతో ఆకట్టుకుంటూ.. సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. యోగి బాబు, సత్య మధ్య వచ్చే సన్నివేశాలు , డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తున్నాయి. ఆద్యంతం కామెడీతో ఆకట్టుకుంటున్న ఈ గ్లింప్స్ ఇప్పుడు సినిమాపై అంచనాలు పెంచేసింది.

ఇది తెలుమిళ్ సినిమా..

Advertisement

ఇది తెలుగు చిత్రమో.. తమిళ చిత్రమో కాకుండా రెండు భాషల కు చెందినట్లు, రెండు భాషల సంస్కృతులను మేళవిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇది తెలుగు, తమిళ్ సినిమా కాదు.. “తెలుమిళ్ సినిమా” అన్నట్టు చూపించారు. ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తోంది. ఇకపోతే పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంలో కామెడీతో పాటు లవ్, క్రైమ్, యాక్షన్ వంటి అంశాలు కూడా ఉండనున్నట్లు డైరెక్టర్ పవన్ హింట్ ఇచ్చారు.

ఈ ఏడాది రిలీజ్..

వెన్నెల కిషోర్, సుదర్శన్, కిషోర్ తిరుమల , రోహిణి , తనికెళ్ల భరణి , సునీల్ రెడ్డి తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఇదే ఏడాది రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరి తెలుగు, తమిళ్ స్టార్ కమెడియన్స్ కాంబినేషన్లో రాబోతున్న ఈ గోల్డెన్ భాగ్యం ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుంది.. ఎలాంటి వినోదాన్ని పంచనుంది అనే విషయం తెలియాలి అంటే రిలీజ్ వరకు ఎదురు చూడాల్సిందే. ఏది ఏమైనా తాజాగా విడుదల చేసిన ఈ గ్లింప్స్ మాత్రం సినిమాపై అంచనాలు పెంచేసింది.

Advertisement

also read: బిగ్ బాస్ తరహాలో మరో రియాలిటీ షో.. తెలుగులో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కమెడియన్ సత్య కెరియర్..

కమెడియన్ సత్య విషయానికొస్తే.. ఇటీవలే వరుణ్ తేజ్ హీరోగా నటించిన కొరియన్ కనకరాజు సినిమాలో తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నారు. కొన్ని సన్నివేశాలలో హీరోతో సమానంగా నటించి అబ్బురపరిచారు. అలాంటి కమెడియన్ సత్య , కోలీవుడ్లో స్టార్ కమెడియన్ గా పేరు సొంతం చేసుకున్న యోగి బాబుతో కలిసి నటించబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Related News

సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న ది ప్యారడైజ్ టీమ్..నాని ప్రత్యేక పూజలు!

రాకేశ్ మాస్టర్ ఒక్కో పాటకి ఎంత తీసుకునేవారో తెలుసా?

డీజే సౌండ్స్ పై శిరీష్ ఫిర్యాదు… అల్లు అర్జున్ పై భారీ ట్రోల్స్!

రజనీకాంత్ ‘ధర్మాన్’లో టాలీవుడ్ హీరో…ఒక్క ఫోటోతో క్లారిటీ ఇచ్చిన రాశి కన్నా!

స్టూడెంట్ నెంబర్.1 @ 25 ఏళ్లు.. ‘సత్య’ పై రాజీవ్ కనకాల స్పెషల్ వీడియో!

చిన్న సినిమాలను తొక్కిపెడితే ఊరుకోం: హీరో షిరాజ్ మెహదీ ఆగ్రహం..

గంగా హాస్పిటల్ డాక్టర్స్ కు రామ్ చరణ్ కృతజ్ఞతలు..!

Big Stories

Advertisement
×