E-Paper
Advertisement

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఆడియోను.. ఫోన్ రింగ్‌టోన్‌గా సెట్ చేయండిలా!

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఆడియోను.. ఫోన్ రింగ్‌టోన్‌గా సెట్ చేయండిలా!
Advertisement

Instagram Reels Audio to Ringtone: ఇన్‌స్టా రీల్స్ చూస్తున్నప్పుడు..కొన్నిసార్లు మనకు నచ్చిన సాంగ్స్ లేదా మ్యూజిక్ ట్యూన్స్ చాలా క్యాచీగా అనిపిస్తాయి. ఆ ఆడియోను మన ఫోన్ మోగిన ప్రతీ సారీ రింగ్‌టోన్‌గా వింటే బాగుంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ.. అది ఎలా చేయాలనే సరైన ట్రిక్ తెలియక ఇబ్బంది పడుతుంటారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న రీల్స్ ఆడియోను ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో రింగ్‌టోన్‌గా మార్చుకోవడం చాలా ఈజీ. ఆ ఈజీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం!

స్టెప్ 1: ఇన్‌స్టా రీల్స్ ఆడియోను డౌన్‌లోడ్ :

మీరు రింగ్‌టోన్‌గా మార్చాలనుకుంటున్న రీల్స్‌ను ఓపెన్ చేయండి.తర్వాత రీల్ కింద కనిపించే ఆడియో ఐకాన్ పై క్లిక్ చేయండి. లేదా కుడివైపు కింద మూలలో ఉన్న ఆడియో సాంగ్ నేమ్ మీద ట్యాప్ చేయండి. ఆ ఆడియో పేజీ ఓపెన్ అయిన తర్వాత ‘Save Audio’ ఆప్షన్ ఉపయోగించి దాన్ని మీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో సేవ్ చేసుకోవచ్చు. అయితే.. ఫోన్ రింగ్‌టోన్‌గా మార్చడానికి ఆ వీడియో లేదా ఆడియో లింక్‌ను కాపీ చేయండి. రీల్ కింద ఉన్న షేర్ బటన్ నొక్కి ‘Copy Link’ ఆప్షన్ ఎంచుకోండి.

స్టెప్ 2:  ఆడియోను MP3 గా మార్చడం:

Advertisement

ఇన్‌స్టా వీడియో నేరుగా రింగ్‌టోన్‌గా పని చేయదు. కాబట్టి దాన్ని ఆడియో ఫైల్‌గా మార్చాలి. మీ ఫోన్ లేదా లాప్‌టాప్‌లో ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి,’Instagram to MP3 Converter’ లేదా ‘Reels Audio Downloader’ అని సెర్చ్ చేయండి (ఉదాహరణకు SaveFrom, SnapInsta లాంటి ఫ్రీ వెబ్‌సైట్లు). మీరు కాపీ చేసిన రీల్స్ లింక్‌ను ఆ వెబ్‌సైట్‌లో పేస్ట్ చేసి డౌన్ లోడ్ బటన్ నొక్కండి. ఆ వీడియోలోని మ్యూజిక్ లేదా ఆడియో మీ ఫోన్ గ్యాలరీ లేదా ఫైల్ మేనేజర్‌లోకి MP3 ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ అవుతుంది.

స్టెప్ 3:  రింగ్‌టోన్ సెట్ చేయడం ఎలా?

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు ఈ ప్రక్రియ చాలా ఈజీ. మీరు డౌన్‌లోడ్ చేసుకున్న MP3 ఆడియో ఫైల్‌ను మీ ఫోన్ File Manager / Downloads ఫోల్డర్‌లో చెక్ చేయండి. అవసరమైతే.. ఆడియోను మీకు నచ్చిన చిన్న కట్ (15 నుంచి 30 సెకన్లు) సైజులోకి రింగ్‌టోన్ మేకర్ యాప్‌తో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ ఫోన్ Settings ఓపెన్ చేయండి. అందులో Sound & Vibration ఆప్షన్‌కు వెళ్లండి. తర్వాత Phone Ringtone మీద క్లిక్ చేసి, ‘Add Ringtone’ లేదా ‘+’ సింబల్ ఎంచుకోండి. మీ డౌన్‌లోడ్స్ ఫోల్డర్ నుంచి ఆ MP3 ఆడియోను సెలెక్ట్ చేసి సేవ్ చేయండి. అంతే.. మీ రీల్స్ ఆడియో రింగ్‌టోన్‌గా సెట్ అయిపోతుంది.

Advertisement

Also Read: మ్యూజిక్ లవర్స్‌ని ఫిదా చేసేలా..నథింగ్ కొత్త గాడ్జెట్, మీరూ ఓ లుక్కేయండి

స్టెప్ 4: ఐఫోన్ లో రింగ్‌టోన్ 

ఐఫోన్ యూజర్లు కొంచెం భిన్నమైన పద్ధతిని ఫాలో కావాలి. ముందుగా యాప్ స్టోర్ నుండి ‘GarageBand’ అనే ఉచిత యాప్‌ను మీ ఐఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు డౌన్‌లోడ్ చేసిన.. రీల్స్ ఆడియోను ఐఫోన్ ‘Files’ యాప్‌లో సేవ్ చేసి ఉంచండి. గ్యారేజ్‌బ్యాండ్ యాప్ ఓపెన్ చేసి ఏదైనా ఒక ఇన్‌స్ట్రుమెంట్ (ఉదాహరణకు Keyboard) సెలెక్ట్ చేయండి. పైన ఉన్న లూప్ ఐకాన్ పై క్లిక్ చేసి,’Files’ నుంచి ఆడియో ఫైల్‌ను ఇంపోర్ట్ చేయండి. ఆడియోను ఎడిట్ చేసి లూప్ నిడివిని 30 సెకన్లకు సెట్ చేయండి. ప్రాజెక్ట్‌ను సేవ్ చేసి, దాని మీద లాంగ్ ప్రెస్ చేసి Share ఆప్షన్ ద్వారా రింగ్ టోన్‌గా ఎక్స్పోర్ట్ చేయండి. ఆ తర్వాత ఐఫోన్ Settings -> Sounds & Haptics -> Ringtone లోకి వెళ్లి ఆ ట్యూన్‌ను రింగ్‌టోన్‌గా సెలెక్ట్ చేసుకోవచ్చు.ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే మీ ఫేవరెట్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఆడియో క్షణాల్లో మీ ఫోన్ రింగ్‌టోన్‌గా మారి పోతుంది!

Related News

బట్టలు ఉతకడమే కాదు.. 49% వేగంగా ఆరబెడుతుంది కూడా.. షియోమీ కొత్త వాషింగ్ మ్యాజిక్ ఇదే!

పార్శిల్ బాక్సులు చెత్తలో పడేస్తున్నారా?దొంగ చేతికి తాళాలిస్తున్నట్లే జాగ్రత్త!

రీఛార్జ్ ధరల విషయంలో TRAI కీలక నిర్ణయం.. డేటా వద్దంటే ఇక ఈ ప్లాన్స్‌ను ఎంచుకోవచ్చు!

Jio, Airtel, Vi యూజర్లకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. 5 కీలక విషయాలివే!

సైబర్ మోసగాళ్ల ఆటకట్టు.. Truecaller Scam Checkerతో మోసాలపై ముందే అలర్ట్!

ఇదే సరైన టైమ్.. iPhone 17పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్, ఆఫర్ వివరాలివే!

పాత ఐఫోన్ స్లో అయిందా? ఈ 5 సెట్టింగ్స్ మార్చితే కొత్తదానిలా దూసుకెళ్తుంది!

Big Stories

Advertisement
×