Upasana Konidela: ఉపాసన కొణిదెల గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ ఉపాసన మధ్య బాండింగ్ ఎలా ఉంటుందో చాలాసార్లు కనిపిస్తూనే ఉంటుంది. ఉపాసన అతిపెద్ద ఫ్యామిలీలో పుట్టిన కూడా చాలా సింప్లిసిటీ ను మైంటైన్ చేస్తారు. అలానే సమాజంలో కొన్ని అంశాల పట్ల అవగాహన కల్పిస్తారు.
మెగా ఫ్యామిలీలో ఉపాసన చాలా నీట్ గా కలిసిపోయారు. ఉపాసన ఇంస్టాగ్రామ్ కొన్నిసార్లు చూస్తుంటే ఫ్యామిలీ మెంబర్స్ తో ఎంతలా కలిసిపోతారో అర్థమవుతుంది. ఉపాసన వంటివి మంచి భార్య దొరకడం ఒకరకంగా చరణ్ చేసుకున్న అదృష్టం కూడా.
గ్రాండ్ గా ఉపాసన పుట్టిన రోజు
నేడు ఉపాసన పుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్ ఇంస్టాగ్రామ్ వేదికగా ఫోటోను షేర్ చేసి విషెస్ తెలియజేశాడు. హ్యాపీ బర్త్డే టు ది మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ అని ఉపాసనను ట్యాగ్ చేశారు. అలానే గాడ్ బ్లెస్ యు అంటూ దీవించారు. రామ్ చరణ్ షేర్ చేసిన ఫోటోlo ఉపాసన రాంచరణ్ తో పాటు క్లింకారా పాప కూడా ఉంది. ఇప్పటివరకు క్లింకారా ఎలా ఉంటుందో ఫేస్ ఎవరికీ అంతగా అవగాహన రాలేదు. అయితే ఈ ఫోటోలో మాత్రం క్లింకారా పాప చాలా నీట్ గా కనిపిస్తుంది. ముఖం పూర్తిగా కనిపించకపోయినా కూడా ఒక ప్రొఫైల్ లో మాత్రం ఫేస్ కనిపిస్తుంది. ఏదేమైనా రూమ్ అంతటిని అందమైన బెలూన్స్ తో డెకరేట్ చేసి ఉపాసన పుట్టినరోజును చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశాడు రామ్ చరణ్ తేజ్.
పెద్దితో ప్రేక్షకులు ముందుకు
ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఉత్తరాంధ్ర యాసను రామ్ చరణ్ మాట్లాడుతున్నారు. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ షాట్ విపరీతమైన అంచనాలను పెంచింది. రామ్ చరణ్ కు ఈ సినిమా ఒక స్ట్రాంగ్ కం బ్యాక్ అవ్వబోతుంది అని అర్థమవుతుంది. ఆర్ ఆర్ సినిమా తర్వాత చరణ్ చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సరైన సక్సెస్ అందుకోలేకపోయాయి. అందరి అంచనాలు కూడా ప్రస్తుతం పెద్ది సినిమా మీద ఉన్నాయి. బుచ్చిబాబు ఈ నమ్మకాన్ని ఏ స్థాయిలో నిలబెడతాడు వేచి చూడాలి.
Also Read: AkiraNandan : ఫ్యూచర్ పవర్ స్టార్ కు భారీ కటౌట్, వాళ్ళ అభిమానం మామూలుగా లేదు