General Ticket Rules: భారతీయ రైల్వే ద్వారా నిత్యం కోట్లాది మంది ప్రయాణీకులు జర్నీ చేస్తున్నారు. చాలా మంది సుదూర ప్రయాణాలకు రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. తక్కువ ధరలో ఆహ్లాదకర ప్రయాణం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కువ మంది రైళ్లలో ప్రయాణిస్తారు. ప్రతి తరగతి ప్రజలు వారి సౌకర్యాన్ని బట్టి రైలులో ప్రయాణించవచ్చు. ఇక రైల్వే టికెట్ల విషయానికి వస్తే, పలు క్లాసులుగా ఉన్నాయి. ఆయా క్లాస్ లను బట్టి ధరలు ఉంటాయి. అత్యంత చౌకగా రైలు ప్రయాణం చేయాలనుకునే ప్రయాణీకులు జనరల్ టికెట్లు కొనుగోలు చేస్తారు. ఈ టికెట్ కొనుగోలు చేసిన వారికి కన్ఫర్మ్ సీటు లేదంటే కోచ్ లభించదు. ముందుగా జనరల్ కోచ్ చేరుకుంటే, ఖాళీ ఉన్న ఏ సీటులోనైనా కూర్చోవచ్చు. అయితే, మీరు ఈ టికెట్ తో ప్రయాణిస్తుంటే కొన్ని రూల్స్ గురించి తెలుసుకోవాలి. లేదంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది.
ఈ రైళ్లలో జనరల్ టిక్కెట్లు చెల్లవు
జనరల్ టికెట్లు ఇండియన్ రైల్వేలోని పలు రైళ్లలు చెల్లవు. లగ్జరీ రైళ్లు అయిన వందే భారత్, మహారాజా ఎక్స్ ప్రెస్, గోల్డెన్ చారియట్, రాజధాని ఎక్స్ ప్రెస్ లాంటి రైళ్లలో జనరల్ టికెట్లతో ప్రయాణించే అవకాశం లేదు. ఒకవేళ జనరల్ టికెట్ తో ఈ రైళ్లలోకి ఎక్కితే జరిమానా కట్టాల్సి ఉంటుంది.
జనరల్ టికెట్ కు టైమ్ పరిమితి
దేశంలో జనరల్ రైలు టికెట్లకు టైమ్ పరిమితి ఉంటుంది. టికెట్ కొనుగోలు చేసిన సమయం నుంచి మూడు గంటలు చెల్లుతాయి. అంటే, మీరు ఈ టికెట్ కొనుగోలు చేసిన మూడు గంటలలోపు ప్రయాణాన్ని ప్రారంభించాలి. ఒకవేళ మూడు గంటల తర్వాత కూడా ప్రయాణాన్ని మొదలు పెట్టకపోతే మరో టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చెల్లుబాటు కాని టికెట్ తో రైల్లోకి వెళ్తే జరిమానా కట్టాల్సి ఉంటుంది.
రిజర్వు చేసిన కోచ్ లో సీటు పొందే అవకాశం
ఎక్కువ రద్దీ ఉన్న సమయంలో ఒకేవేళ రిజర్వు చేసిన కోచ్ లో ప్రయాణించాల్సి వస్తే, టీటీఈ దగ్గరికి వెళ్లి, ఖాళీ సీట్ల గురించి తెలుసుకోవాలి. అవసరమైన అదనపు ఛార్జీ చెల్లించి రిజర్వు చేసిన కోచ్ లో ప్రయాణించే అవకాశాన్ని పొందవచ్చు.
జరిమానా ఎప్పుడు విధించబడుతుంది?
టికెట్ లేకుండా రిజర్వు చేసిన కోచ్ లో ప్రయాణిస్తే టీటీఈ జరిమానా విధించే అవకాశం ఉంటుంది. సాధారణంగా కనీసం రూ. 250 జరిమానా విధించబడుతుంది. ఒకవేళ మీరు జనరల్ టికెట్ తో రిజర్వు చేసిన కోచ్ లో ప్రయాణిస్తుంటే, రైల్వే సిబ్బంది మిమ్మల్ని జనరల్ కోచ్ కు వెళ్లమని సూచిస్తారు. లేదంటే తదుపరి స్టేషన్‌లో మిమ్మల్ని రైలు నుంచి దింపే అవకాశం ఉంటుంది. అందుకే, జనరల్ టికెట్ తో ప్రయాణం చేయాలనకుంటే, ముందుగానే టికెట్ కొనుగోలు చేసి, జనరల్ కోచ్ లో ఖాళీగా ఉన్న సీటులో కూర్చోవడం ఉత్తమం.
Read Also: హై-స్పీడ్ రైళ్లలో నూడుల్స్ లొల్లి.. అధికారులు ఏం చెప్పారంటే?