Ramcharan: సినీ నటుడు రామ్ చరణ్ (Ram Charan) గాయాల పాలైనట్టు తెలుస్తుంది. తాజాగా ఈయన చేతికి కట్టుతో కనిపించడంతో ఒక్క సారిగా అభిమానులందరూ షాక్ అవుతున్నారు. అసలు రాంచరణ్ చేతికి ఏమైంది ఎందుకు అంత పెద్ద బ్యాండేజ్ వేశారు అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. చరణ్ తాజాగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన యాంటీ డ్రగ్స్ (Anti Drugs) కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు సినిమా సెలబ్రిటీలో కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండతో పాటు రామ్ చరణ్ కూడా సందడి చేశారు.
యాంటీ డ్రగ్స్…
ఇక ఈ కార్యక్రమం అయిన తర్వాత డ్రగ్స్ ఉపయోగించమని, డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేస్తున్న సమయంలో అందరూ తమ కుడి చేతిని ముందుకు చాచి ప్రతిజ్ఞ చేస్తున్నారు. అయితే ఆ సమయంలో రామ్ చరణ్ తన చేతికి గాయమైనట్టు స్పష్టంగా కనిపించింది. ఇలా చేతికి పెద్ద బ్యాండేజ్ చుట్టి ఉండడంతో అసలు రామ్ చరణ్ చేతికి ఏమైంది అంటే అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బహుశా రాంచరణ్ సినిమా షూటింగ్లో గాయపడినట్టు తెలుస్తోంది. అయితే ఈ గాయం గురించి చిత్ర బృందం కానీ రామ్ చరణ్ కానీ ఎక్కడ అధికారకంగా తెలియచేయలేదు. ఇటీవల పెద్ది సినిమా(Peddi Movie) షూటింగ్లో భాగంగా ఒక యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు అంటూ వార్తలు వచ్చాయి.
పెద్ది షూటింగ్లో ప్రమాదం..
బహుశా ఈ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించే సమయంలోనే రామ్ చరణ్ గాయపడి ఉంటారని అందరూ భావిస్తున్నారు. అయితే ఈ గాయం పెద్దగా ప్రమాదకరమేమి కాదని చరణ్ ని చూస్తుంటేనే స్పష్టమవుతుంది. ఏది ఏమైనా తమ అభిమాన హీరో ఇలా గాయాలు పాలయ్యారనే విషయం తెలియడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా ఈ గాయం నుంచి కోలుకోవాలి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు(Bucchi Babu) సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
గ్లోబర్ స్టార్ రామ్‌చరణ్ కుడి చేతికి గాయం
గ్లోబర్ స్టార్ రామ్‌చరణ్ కుడి చేతికి గాయం అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన యాంటీ డ్రగ్స్ కార్యక్రమంలో చరణ్ పాల్గొన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేస్తున్న సమయంలో రామ్‌చరణ్ తన కుడి చేయిని ముందుకు చాచేందుకు… https://t.co/PresSESjLq pic.twitter.com/QRtvFADX56
— ChotaNews App (@ChotaNewsApp) June 26, 2025
ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇక ఇందులో రామ్ చరణ్ చాలా మాస్ లుక్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన చరణ్ ఫస్ట్ లుక్, గ్లింప్ వీడియో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేశాయి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor)సందడి చేయబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రాబోతుంది. ఉప్పెన లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమా రాబోతున్న నేపథ్యంలో సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇక చరణ్ కూడా ఈ సినిమా సక్సెస్ కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు. RRR సినిమా తర్వాత చరణ్ నటించిన గేమ్ చేంజర్ ఫ్లాప్ అవడంతో అభిమానులు కూడా పెద్ది సినిమా పైన బోలెడు ఆశలు పెట్టుకున్నారు.
Also Read: S.S.Thaman: నీ అడ్రస్ పంపు బే.. నెటిజన్ పై ఫుల్ ఫైర్ అయిన తమన్.. ఏమైందంటే?