OTT Movie : ఓటీటీలోకి ఓ యాంథాలజీ కన్నడ క్రైమ్ డ్రామా మూవీ రీసెంట్ గా స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ సినిమా మూడు స్టోరీల చుట్టూ బెంగళూరు మహా నగరంలో తిరుగుతుంది. ప్రతీ స్టోరీ ఒక దొంగతనంతో మొదలవుతుంది. ఈ సినిమా చివరి వరకు ఆసక్తికరంగా సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే
యన్ ఎక్స్ టి (Sun NXT) లో
ఈ కన్నడ క్రైమ్ డ్రామా మూవీ పేరు ‘Nimma Vasthugalige Neeve Javaabdaararu’. 2025 లో వచ్చిన ఈ సినిమాకి కేశవ్ మూర్తి దర్శకత్వం వహించారు. ఇందులో దిలీప్ రాజ్, శిల్పా మంజునాథ్, అపూర్వ భరద్వాజ్, ప్రసన్న శెట్టి, గోవింద్ మధుసూదన్, హరి సమస్తి ప్రధాన పాత్రలలో నటించారు. 2025 జనవరి 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, జూన్ 26 నుంచి సన్ యన్ ఎక్స్ టి (Sun NXT) లో స్ట్రీమింగ్ అవుతోంది. 2 గంటల 12 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినమాకి IMDB లో 7/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ మూవీలో మూడు స్టోరీలు ఉంటాయి. ఇవన్నీ బెంగళూరు నగరంలో ఒక దొంగతనం చుట్టూ తిరుగుతాయి. ఈ మూడు కథలు ఒకదానితో ఒకటి సంబంధం లేకపోయినా, దొంగతనాల ద్వారా ఈ స్టోరీని కొత్త తరహాలో చూపించారు.
మొదటి కథ: ఈ కథ ఇనాయత్ చుట్టూ తిరుగుతుంది. అతను ఒక వాటర్ ఫిల్టర్ సేల్స్‌మన్, భార్య ఇద్దరు పిల్లలతో కలసి జీవిస్తుంటాడు. ఇనాయత్ అప్పుల భారంతో సతమతమవుతూ, బ్రాండ్ బైక్‌లను దొంగిలిస్తూ ఉంటాడు. ఇతనికి OCD ప్రభావం కూడా ఉంటుంది. అతను తన 125cc బైక్‌ను తన అదృష్ట బైక్ గా భావిస్తాడు. దానిని ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. కానీ అది ఒక రోజు దొంగతనానికి గురవడంతో, అతని జీవితం తలకిందులవుతుంది. ఈ కథ మధ్యతరగతి జీవితం,ఆర్థిక ఒత్తిడి, మానసిక సమస్యలను చూపిస్తుంది.
రెండవ కథ: ఈ కథ రోహిత్, రత్న అనే ఇద్దరు క్లెప్టోమేనియాక్‌ల చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు సరదా కోసం దొంగతనాలు చేస్తుంటారు. రోహిత్ ఒక సంపన్న కుటుంబం నుండి వచ్చిన యువకుడు. దొంగిలించడం ద్వారా అడ్రినలిన్ రష్‌ను అనుభవిస్తాడు. నిజానికి అతనికి డబ్బు అవసరం ఉండదు. రత్న కూడా అదే విధమైన దొంగతనం అలవాటును కలిగి ఉంటుంది. ఇక వీళ్లిద్దరి ఆసక్తి వాళ్ళని ఒక లవ్ ట్రాక్ లోకి తీసుకెళ్తుంది.
మూడవ కథ: ఈ కథ అల్బర్ట్ పెరీరా చుట్టూ తిరుగుతుంది. అతను ఒక రియల్టర్ గా ఉంటూ హనీ-ట్రాప్ ఆపరేషన్‌ను నడుపుతాడు. అవినీతిపరులైన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటాడు. అతను జెన్నిఫర్ అనే అమ్మాయి, అతని గ్యాంగ్‌తో కలిసి బ్లాక్ మనీ కలిగిన వ్యక్తులను టార్గెట్ చేస్తాడు. ఈ కథ సినిమా సెకండ్ హాఫ్ లో ఎక్కువ భాగం ఉంటుంది. ఈ భాగం ఒక గ్రిప్పింగ్ క్లైమాక్స్‌తో ముగుస్తుంది.
ఈ మూవీ కన్నడ సినిమాల్లో ఒక కొత్త రకం యాంథాలజీగా పరిగణించబడింది. ఇది మాస్ యాక్షన్ ఫార్ములా కథలపై ఆధారపడకుండా, మనిషి మానసిక స్వభావం ఫార్మాట్ లో రూపుదిద్దుకొంది. ఈ సినిమా Kishkindha Kandam, Andhadhun వంటి మలయాళం సినిమాల ఆఫ్‌బీట్ క్రైమ్ డ్రామాలతో పోలికలను కలిగి ఉంటుంది.
Read Also : అమావాస్య రోజు పుట్టే ఆరుగురు అమ్మాయిలు… కమ్యూనిటీనే లేపేసే ప్లాన్… ఒక్కో సీన్ కు వణుకే