Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)ప్రస్తుతం బుచ్చిబాబు(Bucchi Babu) దర్శకత్వంలో పెద్ది (Prddi)అనే సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఒక గ్లింపు వీడియో సినిమాపై బీభత్సమైన అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా తదుపరి అప్డేట్ కోసం అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక రామ్ చరణ్ కెరియర్ లో ఈ సినిమాని ఒక ఛాలెంజ్ గా తీసుకొని మరి నటిస్తున్నారు. ఇటీవల ఎన్నో అంచనాల నడుమ చరణ్ గేమ్ చేంజర్ (Game Changer)సినిమా విడుదల అయినప్పటికీ ప్రేక్షకులను పూర్తిస్థాయిలో నిరాశపరిచింది.
పెద్ది అద్భుతంగా ఉండబోతోంది…
ఈ క్రమంలోనే పెద్ది సినిమా చరణ్ కెరీర్ కు ఎంతో కీలకంగా మారిందని చెప్పాలి. ఈ సినిమాలో రామ్ చరణ్ పూర్తి మాస్ లుక్ లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా చరణ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు సినిమా పట్ల మరిన్ని అంచనాలను పెంచేసాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈయన అక్కడ ఉన్నటువంటి వారిని ఉద్దేశించి పెద్ద గ్లింప్ చూశారా? ఎలా ఉంది? నచ్చిందా? అంటూ ప్రశ్నలు వేశారు. ఇక అభిమానుల నుంచి.. నచ్చిందా ఏంటన్నా.. మతి పోయింది అంటూ ఊహించని సమాధానాలు వచ్చాయి.
రాసి పెట్టుకోండి…
నాకు తెలిసి నా కెరియర్ లో ఇది చాలా యూనిక్ స్క్రిప్ట్ అంటూ రాంచరణ్ తెలిపారు. బహుశా ఈ సినిమా రంగస్థలం(Rangasthalam), RRR సినిమాల(RRR Movie) కంటే కూడా ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉండబోతుందని చరణ్ తెలిపారు. సాధారణంగా నేను ఇలాంటి విషయాలు అన్ని సినిమాలకు చెప్పును, కచ్చితంగా ఈ విషయాన్ని మీరు రాసి పెట్టుకోండి అంటూ చరణ్ పెద్ది సినిమా గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సినిమా పట్ల మరింత అంచనాలను పెంచేశాయి. ఇక ఈ వ్యాఖ్యలపై యాంటీ ఫ్యాన్స్ విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. చరణ్ కెరియర్లో రంగస్థలం సినిమా, RRR సినిమాలు మైల్ స్టోన్ లాంటివి కానీ ఈ రెండు సినిమాలకు మించి పెద్ది ఉండబోతుందని చెప్పడంతో కచ్చితంగా ఇది సుకుమార్, రాజమౌళికి అవమానమే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
పెద్ది పైనే ఆశలు..
ఇక పెద్ది సినిమా విషయానికి వస్తే.. ఉప్పెన (Uppena)సినిమా తర్వాత బుచ్చిబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని రాంచరణ్ తో చేయబోతున్నారు. ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor)హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు కీలక షెడ్యూల్ చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుందని తెలుస్తుంది. ఈ సినిమా అటు బుచ్చి బాబుకు, ఇటు రాంచరణ్ కు ఎంతో కీలకంగా మారిందని చెప్పాలి. ఇక మెగా అభిమానులకు కూడా ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలలో విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తుంది.
Also Read: ఇద్దరు చిన్నారులకు జీవితాన్నిచ్చిన రాకింగ్ రాకేష్.. మంచి మనస్సంటూ!