Pride of Hyderabad Awards : ప్రతి ఏడాది హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రముఖుల ప్రత్యేకమైన అవార్డులను అందిస్తుంటారు. ఈ అవార్డులను వీవ్ మీడియా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ గత మూడు సంవత్సరాలుగా “ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్” పేరిట ప్రతిష్టాత్మక అవార్డులు అందిస్తూ వస్తోంది. ఈ అవార్డులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ, టూరిజం, కల్చరల్ డిపార్ట్మెంట్స్ మద్దతు అందజేస్తున్నాయి.. అయితే ఇప్పటివరకు 225 మంది అవార్డులు పొందగా, ఈ కార్యక్రమాల ద్వారా సమకూరిన నిధులతో 75 మంది దివ్యాంగులకు స్కిల్స్ ట్రైనింగ్, ఉపాధి మరియు వ్యాపార అవకాశాలు కల్పించబడ్డాయి. ఈ సంవత్సరం ఆగష్టు 21న ‘వరల్డ్ ఎంట్రప్రెన్యూర్ డే’ సందర్భంగా, స్టార్టప్స్, ఇండస్ట్రియలిస్ట్స్, కాలేజీ యాజమాన్యాలు, ఇంకుబేటర్లు, బ్యాంకర్లు మరియు కార్పొరేట్ సంస్థలకు అవార్డులు అందించనున్నారు..
వీ హబ్ (WE-HUB), టాస్క్ (TASK), డీట్ (DEET) సంస్థలతో కలిసి యువతకు వ్యాపార అవకాశాలను కల్పించేందుకు Hydeathon స్టార్టప్ కాంపిటీషన్ నిర్వహించనున్నారు. ఈ అవార్డుల వేడుకను నిర్వహిస్తున్న సందర్భంగా వీవ్ మీడియా సీఈఓ మరియు గుర్తింపు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీమతి వసుంధర కొప్పుల మాట్లాడుతూ.. “ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డ్స్ అనేవి నిజంగా ప్రభావం చూపుతున్న సామాన్యులను వెలుగులోకి తీసుకువచ్చే వేదిక. ఇది ప్రభుత్వ గుర్తింపు, కంపెనీకి క్రెడిబిలిటీ, విసిబిలిటీ కలిగించే వేదిక. ఈ ఏడాది నుంచి మేము ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ మ్యాగజైన్ మరియు డిజిటల్ ఛానెల్ ప్రారంభిస్తున్నాము. అవార్డు పొందే వారందరికీ ఉచిత బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ సేవలు అందిస్తాం. అదేవిధంగా స్టూడెంట్స్, స్టార్టప్స్ కోసం స్కిల్స్, ఇంకుబేషన్, ప్రభుత్వ పథకాలు మరియు ఇంటర్నేషనల్ ఫండింగ్ సపోర్ట్ అందిస్తాం.. నామినేషన్లు మరియు స్టార్టప్ కాంపిటీషన్ రిజిస్ట్రేషన్ కోసం..
🌐 www.prideofhyderabad.org
🌐 www.deet.telangana.gov.in
ఈ వెబ్ సైట్లను సంప్రదించాలని తెలిపారు.
అనంతరం డీట్ డైరెక్టర్ శ్రీ జే. రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. DEET ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. ఈ స్టార్టప్ వేదిక ద్వారా యువతకు వ్యాపార అవకాశాలు కూడా అందించేందుకు హైడియాథన్ నిర్వహిస్తున్నాం. 18-30 ఏళ్ల వయస్సు గల యువత ఈ పోటీలో పాల్గొనవచ్చు.
TASK సీఈఓ శ్రీకాంత్ సింహా మాట్లాడుతూ.. “టాస్క్ ద్వారా ఇప్పటివరకు 15,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించాము. హైడియాథన్ ద్వారా మరింత మందిని వాణిజ్య రంగంలోకి తీసుకురావడమే లక్ష్యం అని అన్నారు.
ఈ ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డులకు భాగస్వాములు..
అసోసియేషన్ పార్టనర్స్: ఐటీ, టూరిజం, కల్చరల్ డిపార్ట్మెంట్స్
ఎకోసిస్టమ్ పార్టనర్స్: TASK, DEET, WE HUB
సపోర్టివ్ పార్టనర్స్..
Simis World, Pranisha Digital, Yellow Spoon, Arezou, Ahimsa Alliance
రెడియో పార్టనర్ – రెడ్ ఎఫ్ఎమ్
మీడియా పార్టనర్ – బిగ్ టీవీ