Vallabhaneni Vamsi: ఎట్టకేలకు.. విజయవాడ జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదలయ్యారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి నూజీవీడు కోర్టు బెయిలిచ్చింది. బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలిచ్చారంటూ నమోదైన కేసులో.. వంశీని ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత.. ఆయనపై వరుసగా మరిన్ని కేసులు నమోదయ్యాయి. వంశీపై మొత్తంగా 11 అక్రమ కేసులు నమోదు చేశారని వైసీపీ నేతలు చెబుతున్నారు. 4 నెలలకు పైగా వంశీ జైలులో ఉన్నారు. ఇప్పటికే.. కొన్ని కేసుల్లో వంశీకి బెయిల్ వచ్చింది.
నాలుగున్నర నెలల పాటు జైల్లో ఉన్న వంశీ.. బెయిల్ కోసం కోర్టుని ఆశ్రయించారు. మొత్తానికి.. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ మంజూరు చేసింది. గత నెలలోనే మరో రెండు కేసుల్లో వంశీకి బెయిల్ వచ్చింది. దాంతో వంశీపై పెట్టిన అన్ని కేసుల్లోనూ వంశీకి బెయిల్ లభించడంతో జైలు నుంచి విడుదలయ్యారు. వల్లభనేని వంశీకి స్వాగతం పలికేందుకు.. జైలు దగ్గరికి ఆయన సతీమణి పంకజ శ్రీతో పాటు వైసీపీ నేత పేర్ని నాని, ఎమ్మెల్సీ రఘురాం, మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేశ్, కైలే అనిల్ సహా వైసీపీ నేతలు, కార్యకర్తలు వెళ్లారు.
మరోవైపు.. వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులోనూ ఊరట లభించింది. మైనింగ్ కేసులో వంశీకి హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని.. ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై.. వాదనలు విన్న తర్వాత.. బెయిల్ రద్దుపై విచారణకు ఈ నెల 16కు వాయిదా వేసింది. మైనింగ్ వాల్యూయేషన్‌పై రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే.. బెయిల్ రద్దు అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. తమ వాదనలు వినకుండానే.. వంశీకి బెయిల్ ఇచ్చారని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు.
అక్రమ మైనింగ్ ద్వారా వంశీ 196 కోట్లు సంపాదించారనడానికి ఆధారాలున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనికి సంబంధించి జరుగుతున్న దర్యాప్తు రిపోర్ట్.. 700 పేజీలు ఉందన్నారు. అందువల్ల.. హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరారు. అయితే.. సీల్డ్ కవర్‌లో రిపోర్ట్ దాఖలు చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణకు ఈ నెల 16కు వాయిదా వేసింది.
Also Read: కాకాణికి మొహం చాటేసిన జగన్.. నెల్లూరు పర్యటన రద్దు.. ఎందుకంటే?
వల్లభనేని వంశీపై అక్రమ కేసులు పెట్టించి కూటమి ప్రభుత్వం ఏం సాధించిందని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఎన్ని కేసులు పెట్టినా, కుట్రలు పన్నినా గన్నవరం నుంచి వంశీని పక్కకు తప్పించలేరని తెలిపారాయన. అంతేకాదు.. నియోజకవర్గంలో ఏడాది తిరగకుండానే వంశీకి సానుభూతి వచ్చేలా ప్రభుత్వం చేసిందని సెటైర్లు వేశారు పేర్ని నాని.
విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీ..
హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటికొచ్చిన వంశీ
దాదాపు నాలుగు నెలలుగా జైలులోనే ఉన్న వంశీ
ఈ ఏడాది ఫిబ్రవరి 12న వంశీ అరెస్ట్
అప్పటి నుంచి వంశీపై అనేక కేసులు నమోదు
అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో ఎట్టకేలకు విడుదలైన వంశీ pic.twitter.com/y0NMhEgKO5
— BIG TV Breaking News (@bigtvtelugu) July 2, 2025