Rakul Preet Singh:బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడిగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న జాకీ భగ్నానీ (Jackky Bhagnani) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) తో ఏడు అడుగులు వేసిన తర్వాత ఇప్పుడు సౌత్ లో కూడా ఈయన బాగా పరిచయస్తుడిగా మారిపోయారు. ఇక అందుకే ఈయనకు సంబంధించిన ప్రతి విషయం కూడా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో వైరల్ అవుతుంది అనడంలో సందేహం లేదు. అందులో భాగంగానే గత కొన్ని రోజుల క్రితం జాకీ భగ్నానీ దీనస్థితికి చేరుకున్నారు అని , దివాలా తీశారు అని, ఇక ఆయన పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఆ వార్తలపై స్పందించారు జాకీ భగ్నానీ.
దివాలా తీసిన రకుల్ భర్త.. ఎట్టకేలకు క్లారిటీ..
ఇకపోతే బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గా, నటి రకుల్ ప్రీత్ సింగ్ భర్తగా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న జాకీ భగ్నానీ తన ఆర్థిక పరిస్థితిపై వస్తున్న రూమర్లకు స్పందించారు. ఆయన మాట్లాడుతూ..” ‘బడే మియా చోటే మియా’ సినిమా భారీ నష్టాలను మిగిల్చడంతో నేను దివాలా తీసానని, తిండికి కూడా డబ్బులు లేవు అని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రూమర్ల వెనుక ఎవరు ఉన్నారో నాకు తెలియదు. కానీ ఎవరిని నేను నిందించాలని అనుకోవట్లేదు. ఆ సినిమా వల్ల నష్టం వచ్చింది కానీ మళ్ళీ నేను దివాలా తీసే అంత నష్టపోలేదు” అంటూ క్లారిటీ ఇచ్చారు జాకీ భగ్నానీ. మొత్తానికి అయితే జాకీ ఇచ్చిన క్లారిటీతో రూమర్స్ కి భారీగా చెక్ పడిందని చెప్పవచ్చు.
ఒక్క సినిమాతో రూ.250 కోట్లకు పైగా నష్టం..
అక్షయ్ కుమార్ (Akshay Kumar), టైగర్ ష్రాఫ్ (Tiger Shroff ) ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘బడేమియా చోటేమియా’. భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా భారీగా నష్టాలను చవిచూసింది. ఏప్రిల్ 10 2024న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరమైన పరాభవాన్ని చవి చూసింది. ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించగా.. మానుషి చిల్లర్, ఇమ్రాన్ హష్మీ, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా కోసం జాకీ భగ్నానీ పూజ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూ.350 కోట్లు బడ్జెట్ పెట్టి నిర్మించారు. అయితే వారికి కేవలం రూ.110 కోట్లు మాత్రమే వచ్చింది. దీంతో ఈ నిర్మాణ సంస్థకి కోలుకోలేని దెబ్బ పడింది.
జాకీ భగ్నానీకి అండగా అక్షయ్ కుమార్..
నటీనటులకు పూర్తిగా పారితోషకం చెల్లించలేని పరిస్థితికి చేరుకుందని, ఆ సమయంలో అక్షయ్ కుమార్ పెద్ద మనసు చేసుకొని, తమకు అండగా నిలిచారని జాకీ భగ్నానీ తెలిపారు. ఆ సినిమాలో పనిచేసిన అందరికీ ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చిన తర్వాతే తనకు ఇవ్వమని అక్షయ కోరారు అని అందరికంటే ఎక్కువ మొత్తం కూడా అక్షయ్ కుమార్ కి ఇవ్వాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే జాకీపై ఇలాంటి రూమర్లు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు.
ALSO READ:Kamal Haasan: హీరో కమల్ హాసన్ కు కోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు.. రూల్స్ బ్రేక్ చేయకూడదంటూ!