BigTV English

Ram Pothineni : రామ్ ఇన్‌స్టా పోస్ట్‌కు లక్షల్లో లైక్స్… అంతా ఆవిడా పుణ్యమేనా ?

Ram Pothineni : రామ్ ఇన్‌స్టా పోస్ట్‌కు లక్షల్లో లైక్స్… అంతా ఆవిడా పుణ్యమేనా ?

Ram Pothineni : ఎనర్జిటిక్ రామ్ పోతినేని చేస్తున్న తాజా చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేం మహేష్ బాబు డైరెక్షన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఈ మూవీ రూపొందుతుంది. దీంట్లో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి టీజర్, ఒక లవ్ సాంగ్ రిలీజ్ చేశారు. నవంబర్ 28న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.


అయితే, హీరో రామ్ చాలా ప్రైవేట్ పర్సన్. సోషల్ మీడియాలో ఆయన పెద్దగా యాక్టివ్‌గా ఉండడు. సినిమా రిలీజ్ టైంలో ప్రమోషన్స్‌కు సంబంధించిన పోస్టర్లు మాత్రమే ఆయన సోషల్ మీడియాలో మనం చూడొచ్చు. అయితే తాజాగా రామ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ఇటు ఇండస్ట్రీలో.. అటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వైరల్ అవ్వడమే కాదు… ఏకంగా 7.7 మిలియన్స్ లైక్స్ వచ్చాయి. లైక్సే ఇన్ని ఉంటే ఇక వ్యూస్ ఎన్ని ఉంటాయో మీరే అర్థం చేసుకోవాలి.

మరి అంతలా వైరల్ అయ్యే పోస్ట్ ఏంటంటే… జస్ట్ ఆయన సాధా సీదాగా ఉన్న సింగిల్ పిక్ మాత్రమే. సింగిల్ ఫోటోకి… అన్ని లక్షల లైక్స్ ఎందుకు వచ్చాయని చూస్తున్నారా… ఆ ఫోటోకు ఓ సాంగ్ యాడ్ చేశాడు. ఆ సాంగ్ ఏంటంటే… ఈ మధ్య ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి రిలీజ్ అయిన లవ్ సాంగ్ “నువ్వు ఉంటె చాలే” ని బ్యాగ్రౌండ్‌లో ప్లే చేశాడు.


దీంతో ఆ పోస్ట్ రీచ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అందువల్లే ఆయనకు 7.7 మిలియన్ల లైక్స్ వచ్చాయని చెప్పొచ్చు. నిజానికి ఆయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఫాలోవర్స్ సంఖ్య కేవలం 4.4 మిలియన్స్ మాత్రమే అయినా… ఆ ఫోటోకు వచ్చిన లైక్స్ ఇంత పెద్ద నెంబర్‌కు టచ్ చేయడానికి కారణం… అనిరుధ్ ఆ సాంగ్‌ను పాడటం, రామ్ అందించిన లిరిక్సే అని చెప్పుకోవచ్చు.

రామ్ తీసిన చివరి రెండు సినిమాలు, డబుల్ ఇస్మార్ట్, స్కంద బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచాయి, అయిన తన ఒక్క పోస్ట్ కి ఇలాంటి స్పందన రావడం అంటే కేవలం అనిరుధ్ వొకల్స్ అనే చెప్పొచ్చు. కాగా, అనిరుధ్ తెలుగులో పాడటలు పాడటం చాలా అరుదు.

హీరోయిన్‌తో లవ్ కూడా ఓ కారణం ?

ఇదిలా ఉండగా, రామ్ పోతినేని ఇటీవల ఓ యంగ్ హీరోయిన్‌‌తో ప్రేమలో ఉన్నాడని, ప్రస్తుతం వాళ్లు చట్టాపట్టాలేసుకుని తిరుగున్నారని ఇండస్ట్రీలో కోడై కూస్తుంది. ఆ.. హీరోయిన్ ఎవరో కాదు… ఆంధ్ర కింగ్ తాలూకా మూవీలో రామ్ పక్కన నటిస్తున్న భాగ్య శ్రీ బోర్సేనే. ఇటీవలే ఈ ప్రేమ జంట ట్రిప్ కి కూడా వెళ్లారని, వాళ్ల ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లను కంపేర్ చేస్తూ, ప్రేమలో ఉన్నటు దొరికిపోయారు అని మీమ్స్, కామెంట్స్ వైరల్ అయ్యాయి.

రామ్ ఆ పోస్ట్ ఈ హీరోయిన్ కోసమే పెట్టాడని… కూడా ప్రచారం జరిగింది. అందుకే ఆ పోస్టుకి ఇంత రీచ్ వచ్చి ఉండొచ్చు అని ఇండస్ట్రీలో మాటలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా.. రామ్ పోతినేని పెట్టిన ఆ పోస్ట్, దానికి వచ్చని రీచ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

Related News

Gild Producers: రేపు మరోసారి భేటి కానున్న గిల్డ్ ప్రొడ్యూసర్స్.. మేనేజర్స్… సమ్మెపై మళ్ళీ చర్చలు!

Telugu Film Chamber: దయచేసి టికెట్ల రేట్లు పెంచొద్దు…  వేడుకున్న థియేటర్ యాజమానుల సంఘం!

Vishal Dhansika: విశాల్, ధన్షిక.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..అంత తేడా ఉందా?

Supritha: ఆ హీరోతో బ్యాడ్లీ క్రష్ అంటున్న సుప్రీత.. ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ అదే అంటూ!

Chiranjeevi: మెగాస్టార్ గొప్ప మనసు.. మహిళా అభిమానికి అందమైన బహుమతి..

Big Stories

×