E-Paper
Advertisement

సోషల్ మీడియాకు ఆధార్ లింక్.. చుట్టమల్లే వివాదంపై రామ్ రియాక్షన్!

సోషల్ మీడియాకు ఆధార్ లింక్.. చుట్టమల్లే వివాదంపై రామ్ రియాక్షన్!
Advertisement

Ram pothineni:సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత టెక్నాలజీని ఉపయోగించుకొని డీప్ ఫేక్ వీడియోలను సృష్టిస్తూ హీరోయిన్స్ ని అసభ్యకరంగా క్రియేట్ చేస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వాలు ఎన్నో కఠిన ఆంక్షలు విధిస్తున్నా.. ఇప్పటికీ మార్పు రాకపోవడం బాధాకరం అనే చెప్పాలి. ఇదిలా ఉండగా ఇటీవల దేవర సినిమాలోని “చుట్టమల్లే” సాంగులో హీరోయిన్ జాన్వీ కపూర్ ను డీప్ ఫేక్ కి గురి చేస్తూ అసభ్యకరంగా మార్ఫింగ్ చేసిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మార్ఫింగ్ ఫోటోలు క్రియేట్ చేసిన బ్యాచ్ ని అసలు ఊరుకోను. దీనిని ప్రసారం చేసిన వారిపై కూడా చర్యలు తీసుకోబడతాయి అంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డ విషయం తెలిసిందే.

సోషల్ మీడియా అకౌంట్ కి ఆధార్ లింక్ చేయాలి – రామ్ పోతినేని

అయితే ఈ విషయంపై రామ్ పోతినేని స్పందిస్తూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. డీప్ ఫేక్ వీడియోల నేపథ్యంలో ఏఐ ను దుర్వినియోగం చేయకుండా కఠిన నిబంధనలు తీసుకురావాలి అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయగా దీనిపై హీరో రామ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ..” ఆన్లైన్ లో క్లియర్ ఐడెంటిటీ ఉండదు కాబట్టే వారికి భయం లేదు. అందుకే ప్రతి సోషల్ మీడియా అకౌంట్ కి వారి ఆధార్ లింక్ చేయాలి. అప్పుడే యూజర్లు బాధ్యతగా వ్యవహరిస్తారు. దీని వల్ల ఆన్లైన్ అబ్యూజ్ కూడా అరికట్టవచ్చు ” అంటూ రామ్ పోతినేని ట్వీట్ చేశారు.

Advertisement

అసలేం జరిగింది?

ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం దేవర. ఈ సినిమాలోని ప్రతిపాట ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా చుట్టమల్లె సాంగ్ ని ఇప్పుడు కొంతమంది ఆకతాయిలు డీప్ ఫేక్ వీడియోగా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనితోనే అటు ఎన్టీఆర్ ఇటు జాన్వీ కపూర్ మండిపడ్డారు. ఈ మేరకు ఈ మార్ఫింగ్ వీడియోలను క్రియేట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సోషల్ మీడియా ఖాతాల ద్వారా పోస్ట్ చేశారు.

స్పందించిన చిరంజీవి:

Advertisement

దీనిపై చిరంజీవి సుదీర్ఘ పోస్టు పంచుకున్నారు. ఈరోజు మరొకరికి జరిగింది.. రేపు మీకు, నాకు లేదా మనకు తెలిసిన ఎవరికైనా జరగవచ్చు. వ్యక్తిగతంగా జరగలేదు కదా అని మౌనంగా ఉండలేం.. ఈ దుర్వినియోగానికి వ్యతిరేకంగా నిలబడడం మనందరి బాధ్యత అంటూ ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఒక సుదీర్ఘ పోస్టు పంచుకున్నారు.

also read:లగ్జరీ విల్లా కొనుగోలు చేసిన విరోష్ జంట.. ధర ఎంతంటే?

విజయ్ దేవరకొండ ఏమన్నారంటే?

అటు విజయ్ దేవరకొండ కూడా దీనిపై స్పందించారు. మనం ఇంత దిగజారిపోయామా? ఒకరిపై ఒకరం ఇంత సున్నితత్వం కోల్పోయామా ?అంటూ ప్రశ్నించారు. ఇలాంటి కంటెంట్ ను చూసి ఆనందించే స్థాయికి సమాజం ఎలా చేరిందో అర్థం కావడం లేదు.. ఇలాంటి పిల్లలను ఎలా పెంచుతున్నారు? మనం ఎలాంటి సమాజంలో జీవిస్తున్నాం.. అంటూ తల్లిదండ్రుల పెంపకంపై కూడా విజయ్ ప్రశ్నలు సంధించారు . ఒకరిని కించపరచడంలో ఆనందం పొందే పరిస్థితి రావడం బాధాకరం అంటూ కామెంట్లు చేశారు.

Related News

ఇండస్ట్రీలోకి రాకముందు సింగీతం శ్రీనివాస్ రావు ఏం పని చేశారో తెలుసా?

రాకా కోసం అల్లు అర్జున్ తీసుకుంటుంది ఎంతో తెలుసా?

ఉదయపూర్ లో రష్మికతో పెళ్లి..10 రోజులు పాటు ఏడ్చిన విజయ్ తల్లి..ఎందుకంటే?

రాకా తరువాత అట్లీ సంచలన నిర్ణయం.. ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వబోతున్నారా?

ఇరుముడి డైరెక్టర్‌తో ఈసారి జత కట్టేదెవరో?

సింగీతం శ్రీనివాసరావు చివరి కోరిక అదేనా?నెరవేరకుండానే కన్నుమూశారా?

లైగర్ డిజాస్టర్ పై ఫస్ట్ టైం రియాక్ట్ అయిన విజయ్..చాలా కష్టపడ్డాను కానీ?

Big Stories

Advertisement
×