Rashmika – Vijay: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో క్యూట్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) రష్మిక మందన్న (Rashmika mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో సంచలనం సృష్టిస్తూ.. స్టార్ హీరోయిన్గా క్రేజ్ దక్కించుకుంది రష్మిక. మరొకవైపు విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు విజయ్ దేవరకొండ. వీళ్లిద్దరూ తొలిసారి ‘గీతాగోవిందం’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకొని..ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. ఇదే సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి డియర్ కామ్రేడ్ తర్వాత ఆ ప్రేమ మరింత బలపడింది. చట్టా పట్టాలేసుకొని తిరిగిన ఈ జంట దాదాపు 8 ఏళ్ల తర్వాత తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.
పెళ్లి తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తూ.. ఒకవైపు కెరియర్లో దూసుకుపోతుంటే , మరొకవైపు ఆస్తులు పెంచుకుంటున్నారనే కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నిజానికి పెళ్లి చేసుకోక ముందు రష్మిక, విజయ్ సెపరేట్గా ఆస్తులు కూడబెట్టినా.. పెళ్లి తర్వాత ఇద్దరు కలిసి ఒక ఖరీదైన విల్లా కొనుగోలు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..హైదరాబాదులోని అల్మాస్ గూడ – తుక్కుగూడ ప్రాంతంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఒక లగ్జరీ విల్లాను కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఈ జంట ఆ విల్లా కొనుగోలు చేసినట్లు వార్తలు వైరల్ కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే విరోష్ జంట ప్రత్యేకంగా తమ కోసం ఈ విల్లాను డిజైన్ చేయించుకోబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ విల్లా సుమారుగా రూ.12 నుండి రూ.21 కోట్ల వరకు వెచ్చించి సొంతం చేసుకున్నట్లు సమాచారం. తమ అభిరుచికి తగ్గట్టుగా అత్యాధునిక హంగులతో దీనిని డిజైన్ చేపించుకోబుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ జంటకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయంపై ఈ సెలబ్రిటీలు స్పందిస్తే తప్ప అసలు నిజం తెలియదనే చెప్పాలి.
ALSO READ: అరాచకం సృష్టిస్తున్న శర్వానంద్.. ‘భోగి’ టీజర్ ఎలా ఉందంటే?
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం తర్వాత నటిస్తున్న తొలి చిత్రం రణబాలి . పైగా వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై.. భూషణ్ కుమార్, గుల్షన్ కుమార్ సమర్పణలో టి సిరీస్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మరొకవైపు విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన అనే సినిమాలో నటిస్తుండగా .. రష్మిక మైసా అనే లేడీ ఓరియంటెడ్ మూవీలో నటిస్తోంది.