Russia vs Ukraine: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఉక్రెయిన్‌కు ధీటుగా బదులు ఇవ్వాలని రష్యా డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలపై డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ క్రమంలో భారతీయ ఫార్మా కంపెనీపై భీకర దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. కంపెనీకి రూ. 400 కోట్లు నష్టం వాటిల్లినట్టు అంచనా.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత ముదిరింది. ఈ రెండు దేశాలు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తాజాగా రష్యా ప్రయోగించిన డ్రోన్లు ఉక్రెయిన్‌లోని సుమీ నగరంపై వీర విహారం చేశాయి. ఫలితంగా భారత్‌కు చెందిన కుసుమ్ గ్రూప్ ఫార్మా ప్లాంట్‌పై దాడి చేశాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. అయితే మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా చెబుతోంది.
రష్యా డ్రోన్ల దాడిలో ఫార్మా ప్లాంట్‌లోని ప్రధాన నిర్మాణం పూర్తిగా ధ్వంసమైంది. దాడి చేసిన ప్రాంతం నుంచి దట్టమైన పొగ కమ్ముకున్న దృశ్యాలు ఎక్స్‌లో వైరల్ అయ్యాయి. దాడి వల్ల దాదాపు రూ.400 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సదరు ఫార్మా కంపెనీ ప్రాథమికంగా అంచనా వేసింది. రెండేళ్లుగా యుద్ధం జరుగుతున్నప్పటికీ ఈ ప్లాంట్ నిరంతరాయంగా ఉత్పత్తిని కొనసాగిస్తూనే ఉంది. ఇప్పుడు రష్యా దాడితో ఉత్పత్తి కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి.
భారతీయుడు రాజీవ్ గుప్తా నేతృత్వంలో కుసుమ్ గ్రూప్ అక్కడ వ్యవహారాలను సాగిస్తోంది. 1994లో భారత్ నుంచి ఔషధాలను ఉక్రెయిన్‌కు ఎగుమతి చేయడం ద్వారా తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఆ తర్వాత సొంత బ్రాండ్లను మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టింది. 2002 ఏడాది నుంచి ఈ కంపెనీ స్వతంత్రంగా జెనరిక్ మందులను తయారు చేయడంపై తన దృష్టి సారించింది. 2007లో కుసుమ్ గ్రూప్ భారత్‌లో ఒక తయారీ ప్లాంట్‌ను స్థాపించింది.
ALSO READ: తీగలాగితే డొంక కదిలింది.. ప్లైదుబాయ్ కో-పైలట్ గురించి షాకింగ్ విషయాలు, ఇకపై ఇజ్రాయెల్
ఆ తర్వాత 2009లో ఉక్రెయిన్‌లోని సుమీ ప్రాంతంలో మరొక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఈ సంస్థ భారత్‌లో మరో రెండు తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కుసుమ్ గ్రూప్ 50కి పైగా ఔషధ ఉత్పత్తులను తయారు చేస్తుంది. వాటిలో చాలావరకు జెనరిక్ మందులే ఉన్నాయి. దీని ఉత్పత్తులు తొమ్మిదికి పైగా దేశాలలో అమ్ముడవుతున్నాయి, వాటిలో ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో కీలక మార్కెట్లలో ఉన్నాయి. రష్యా జరిపిన తాజా దాడుల్లో కనీసం ఆరుగురు మరణించారు. కీవ్‌లోని ద్నీప్రో నదిపై ఉన్న ఉత్తర వంతెన దెబ్బతింది. దీని కారణంగా రాజధానిలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించింది. ఇక్కడి నివాసితులు ఇటీవలకాలంలో పలుమార్లు సమ్మెలను ఎదుర్కొంటున్నారు.
This morning, the Russians once again struck the Pivnichnyi Bridge in Kyiv with a drone. They attacked an ordinary pharmaceutical warehouse in Sumy with drones. Tragically, one person was killed. My condolences to the family and loved ones. In Dnipro, they struck a communications… pic.twitter.com/kHy9seFOP1
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) October 4, 2026