Ram Pothineni : టాలీవుడ్ స్టార్ హీరో, ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈయన ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఈమధ్య గత కొంతకాలంగా సరైన హిట్ సినిమా ఈయన అకౌంట్ లో పడలేదు. గతేడాది డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఆ సినిమా అభిమానులను నిరాశపరిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ హీరో ఖాతాలో ఈమధ్య ఒక్కటంటే ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు. ప్రస్తుతం ఈయన ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఎలాగైనా ఈ సినిమాతో మళ్లీ కమ్ బ్యాక్ కావాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు ఈ మూవీ తాజాగా రిలీజ్ డేట్‌ని లాక్ చేసుకుంది. ఈ ఏడాది నవంబర్ 28 న రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉండగా ఈ హీరో బాహుబలి నిర్మాతలను కలిసినట్లు ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది..
అందరు అనుకున్నట్లుగానే వచ్చే ఏడాది బాహుబలి నిర్మాతలు అర్కా మీడియా వర్క్స్ అధినేతలు రామ్ తో ఓ సినిమాను నిర్మించబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాతో కిశోర్ గోపూ డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడట. కథ, హీరోయిన్, టెక్నీషియన్స్ వంటి ఇతర వివరాలు త్వరలో వెల్లడి అవుతాయి. ఏది ఏమైనా కూడా బాహుబలి లాంటి భారీ సినిమాలో నిర్మించిన నిర్మాణ సంస్థలో రామ్ కొత్త సినిమా రావడం పై ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీతో కచ్చితంగా రామ్ భారీ విషయాన్ని సొంతం చేసుకుంటారని ఇప్పటినుంచి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అతి త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read : ఖరీదైన కారును కొన్న ‘పుష్ప’ విలన్..రెండు సినిమాలు తియ్యొచ్చు..
గత రెండు, మూడేళ్లుగా హీరో రామ్ కు గడ్డుకాలం నడుస్తుంది. ఎలాంటి స్టోరీతో వచ్చిన కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేస్తున్నాయి. ఈసారి సరికొత్త కథతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వంటి హిట్ తీసిన మహేష్ బాబు పి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది.. ఆంధ్రాలో సినీ స్టార్స్ కోసం తెగ క్రేజ్ చూపించే ఫ్యాన్ కల్చర్‌ను ఈ మూవీలో స్టైలిష్‌గా చూపించబోతున్నారు. ఇకపోతే మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ నిర్మాణంలో ఈ సినిమా వస్తోంది. రామ్ ఈ చిత్రంలో సాగర్‌గా, తన హీరో కోసం ఏమైనా చేసే వ్యక్తిగా నటిస్తున్నాడు.. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్ని ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఈ మూవీ హిట్ అయితే రామ్ ట్రాక్ రికార్డ్ బాగుంటుందని ఆయన అభిమానులు అభిప్రాయ పడుతున్నారు..