OTT Movie : ఓటీటీలోకి సరికొత్త స్టోరీలు స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. అయితే వీటిలో సీరియల్ కిల్లర్ సినిమాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఈ సైకో కిల్లర్ లు రకరకాల రీజన్స్ తో మనుషులను చంపుతుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో వాలంటైన్స్ డే రోజు మాత్రమే కిల్లర్ ప్రేమికులను చంపుతుంటాడు. ఫ్యూజులు అవుటయ్యే క్లైమాక్స్ ట్విస్ట్ తో ఈ సినిమా ఆడియన్స్ కి ఒక చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
‘Heart Eyes’ 2025లో విడుదలైన అమెరికన్ రొమాంటిక్ కామెడీ స్లాషర్ చిత్రం. జోష్ రూబెన్ దర్శకత్వంలో ఒలివియా హోల్ట్ (అల్లీ మెక్‌కేబ్), మాసన్ గూడింగ్ (జే సిమ్మన్స్), జోర్డానా బ్రూస్టర్, డెవాన్ సావా, గిగి జుంబాడో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 ఫిబ్రవరి 7న సోనీ పిక్చర్స్ ద్వారా విడుదలైంది. 2025 మార్చి 31 నుండి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీలో ఇంగ్లీష్ ఆడియోతో, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. 1 గంట 37 నిమిషాల రన్‌టైమ్ తో ఈ సినిమా IMDbలో 6.1/10 రేటింగ్ ను పొందింది.
అల్లీ మెక్‌కేబ్ ఒక జ్యువెలరీ కంపెనీలో పిచ్ డిజైనర్‌గా పనిచేస్తుంటుంది. ఆమె తన బాయ్‌ఫ్రెండ్ కోలిన్‌తో బ్రేకప్ అయిన తర్వాత ప్రేమపై నమ్మకం కోల్పోతుంది. ఆమె రాసిన ‘డూమ్డ్ లవర్స్’ అనే పుస్తకం వాలెంటైన్స్ డే సమయంలో జరుగుతున్న “హార్ట్ ఐస్ కిల్లర్” హత్యల కారణంగా వివాదాస్పదమవుతుంది. ఈ కిల్లర్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న ప్రేమలో ఉన్న జంటలను లక్ష్యంగా చేసుకుని చంపుతుంటాడు. ఒక రోజు అల్లీ బాస్ క్రిస్టల్ ఆమెను జే సిమ్మన్స్ అనే ఒక చార్మింగ్ మార్కెటింగ్ కన్సల్టెంట్‌తో కలిసి పనిచేయమని ఆదేశిస్తుంది. జే, అల్లీపై ఎప్పటినుంచో క్రష్ ఉన్నవాడు. ఆమెను డిన్నర్‌కి ఆహ్వానిస్తాడు. కానీ డిన్నర్ సమయంలో వీళ్ళు పెట్ట్టుకున్న ఒక కిస్ హార్ట్ ఐస్ కిల్లర్ దృష్టిలో పడుతుంది. వీళ్లను జంటగా భావించి టార్గెట్ చేస్తాడు. కిల్లర్ రెడ్ హార్ట్ ఐస్ మాస్క్‌తో, వైనరీ, స్పా వంటి చోట్ల జంటలను కిరాతకంగా చంపుతాడు. ఒక వైనరీలో “J.S.” అనే ఇనిషియల్స్ ఉన్న వెడ్డింగ్ రింగ్ ను కిల్లర్ వదిలిపెట్టడంతో, పోలీసులు జే మీద అనుమానం పడతారు.
అల్లీ, జే హార్ట్ ఐస్ కిల్లర్ నుంచి తప్పించుకోవడానికి సిటీ అంతటా పరిగెత్తుతూ, ఒక థియేటర్‌లో దాక్కుంటారు. అక్కడ కిల్లర్ మరిన్ని హత్యలు చేస్తాడు. డిటెక్టివ్ జీనెట్ ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తూ జేని అరెస్ట్ చేస్తాడు. ఎందుకంటే అతని ఇనిషియల్స్ రింగ్‌తో మ్యాచ్ అవుతాయి. అల్లీ ఇప్పుడు నిజమైన కిల్లర్‌తో ఫైట్ చేస్తుంది. ఇక క్లైమాక్స్ లో ఈ హత్యలు చేస్తున్నది ఒకరు కాదు, ఇద్దరని తెలుస్తుంది. ఈ సినిమా ఊహించని ట్విస్టులతో ముగుస్తుంది. చివరికి ఈ సీరియల్ కిల్లర్ ఎవరు ? ఎందుకు ప్రేమికులను టార్గెట్ చేస్తున్నాడు ? రెండో కిల్లర్ ఎవరు ? జే పాత్ర ఇందులో ఉందా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.