Mangli Bathukamma Song Remuneration:తెలంగాణాలో బతుకమ్మల పండగ మొదలైపోయింది.ఇక ఈ క్రమంలో సోషల్ మీడియాలో బతుకమ్మలపై చేసిన పాటలు కూడా ఇబ్బడి ముబ్బడిగా వైరల్ అవుతున్నాయ్ కూడా.అయితే ఎన్ని పాటలొచ్చినా ఫోక్ సింగర్ మంగ్లీ పాడే పాటలకి స్పెషల్ ఫ్యాన్స్ బేస్ ఉంటుందన్న సంగతి తెల్సిందే.
4 రోజుల్లోనే ఈ పాట ఏకంగా 2 మిలియన్స్ వ్యూస్
ఇక తాజాగా మంగ్లీ పాడిన ”సింగిడి సినబోయినాది అమ్మను జూసి.. ఆ రంగులె తడబడినై బొడ్డెమ్మను జూసి” అంటూ మరో బతుకమ్మ సాంగ్ ఇపుడు యూట్యూబ్ ని షేక్ చేస్తుంది కూడా. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే ఈ పాట ఏకంగా 2 మిలియన్స్ వ్యూస్ కొల్లగొట్టడం అంటే అంత ఆశామాషీ కాదు మరి అయితే తాజాగా బతుకమ్మ పాట వైరల్ అవుతుండటంతో అసలు బతుకమ్మ పాటలకి మంగ్లీ ఎంత పారితోషికం తీసుకుంటుంది అంటూ ఆరాలు తీస్తున్నారు ఫోక్ లవర్స్.
మొదట్లో ఒక్కో బతుకమ్మ పాటకి
విషయానికి వస్తే మంగ్లీ కెరీర్ మొదట్లో ఒక్కో బతుకమ్మ పాటకి 10 నుండి 20వేల మధ్యలో తీసుకుందని సమాచారం.ఇక క్రమక్రమంగా ఆడియన్స్ లో మంగ్లీ కి క్రేజ్ పెరగడంతో ఒక్కో పాటకి లక్ష నుండి 2 లక్షల వరకు అందుకుందని సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్.
ఇక ఫోక్ లవర్స్ లో ,ఆడియన్స్ లో ..ఇలా ఎక్కడ చూసినా మంగ్లీ పాటలకి జనాలు నీరాజనాలు పట్టడంతో క్రమంగా తీసుకునే పారితోషికం పెంచిందని ,అది మెల్లిగా మూడు నుండి 5 లక్షల వరకు పెరిగిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.నిజానికి ఆడియన్స్ లో క్రేజ్ ఉన్నప్పుడు పారితోషికం కూడా అదే రేంజ్ లో డిమాండ్ చేస్తారు కూడా.
బతుకమ్మ పాటలని పాడి నటించాలంటే
అయితే కేవలం సినిమాలలో పాట పాడటానికి అయితే ఒకవిధమైన పారితోషికం ఉంటే ఇలా బతుకమ్మ పాటలని పాడి నటించాలంటే మాత్రం ఎక్కువ పారితోషికం తీసుకుంటుదట మంగ్లీ.అయితే మంగ్లీ ఎక్కడా అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోవడంతో ఇవి సోషల్ మీడియాలో వచ్చిన వార్తలుగానే పరిగణించాలి.
ఇక ప్రస్తుతం బతుకమ్మ పాటలంటేనే మంగ్లీ అన్నట్టుగా అయిపోవడంతో తనే స్వంతంగా పాటని నిర్మించి తన స్వంత చానెల్ లోనే అప్ లోడ్ చేయడం మనం చూస్తునే ఉన్నాం.అంటే ఈలెక్కన పాటకి తనే డబ్బులు ఖర్చు పెట్టి వ్యూయర్ షిప్ ద్వారా వచ్చే డబ్బులని తను తీసుకుంటుందన్న మాట.
ALSO READ :బతుకమ్మ పాటలంటే మంగ్లీ తర్వాతే ఎవరైనా.. మరోసారి నిరూపించిందిగా!
ముందు ముందు ఇంకెంత పెరుగుతుందో !
ఏది ఏమైనా మంగ్లీ బతుకమ్మ పాటలకి ఎంత పారితోషికం తీసుకుంటుంది అనే క్యూరియాసిటీ ఆడియన్స్ లో ,ఫోక్ లవర్స్ లో పెరగడానికి కారణం తను చేసిన బతుకమ్మ పాటలు మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టడమనే చెప్పాలి.
ఇక ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ అవుతున్న ”సింగిడి సినబోయినాది అమ్మను జూసి.. ఆ రంగులె తడబడినై బొడ్డెమ్మను జూసి” అనే పాటని తిరుపతి మాట్ల రాయగా సహనా శెట్టి కొరియోగ్రఫీని డిజైన్ చేసిన సంగతి తెల్సిందే. చూడాలి మరి వేలల్లో నుండి లక్షల్లోకి వెళ్ళిన పారితోషికం ముందు ముందు ఇంకెంత పెరుగుతుందో !