Ramana Gogula Song in Ustad Bhagat Singh Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ఈ మధ్య సినిమాల సెట్లో అడుగుపెట్టిన ఈ రెండు చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఓ వైపు ఓజీ, మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్స్ లో ఒకేసారి పాల్గొంటున్నారు. పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో అసలు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఉండకపోవచ్చనే ప్రచారం జరిగింది. దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఎన్నో సందర్భాల్లో అదే అన్నట్టు వ్యవహరించారు.
శరవేగంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్
పవన్ అభిమానిగా ఈ సినిమా చేస్తున్నానని, ఆయన ఛాన్స్ ఇస్తే ఉస్తాద్ భగత్ సింగ్ ను గబ్బర్ సింగ్ కి మించి తీసి అభిమానులకు ట్రీట్ ఫీస్ట్ ఇస్తానంటూ గతంలో ఓ ఇంటర్య్వూలో అన్నాడు. హరీష్ శంకర్ కామెంట్స్ తో ఈ రూమర్స్ కి మరింత బలంగా చేకూరింది. ఈ సినిమా ఉంటుందో, లేదో డైలామాలో పడిపోయారు. కానీ, ఇటీవల ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాడు దర్శకుడు. గత నెల మూవీ షూటింగ్ ని తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం శరవేగంగా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పరుగులు పెడుతోంది.
ఉస్తాద్ కోసం రమణ గోగుల..
ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో ప్రముఖ సింగర్ రమణ గోగుల ఓ పాట పాడబోతున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది తెలిసి అభిమానులంత ఫుల్ ఖుష్ అవుతున్నారు. పవన్, రమణ గోగులది సూపర్ హిట్ కాంబో అనే విషయం తెలిసిందే. పవన్ క్రేజ్, స్టైల్, మ్యానరిజం కి రమణ వాయిస్ తోడైతే.. అది ఏ రేంజ్ లో సెన్సేషన్ అవుతుందో ఇప్పటికే రుజువైంది. తమ్ముడులో ‘వయ్యారి భామ నీ హంస నడక’ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఇందులో పవన్ మాస్ లుక్, క్రేజ్ కు.. రమణ పాడిన ఈ పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అనడంలో సందేహం లేదు. 90’sలో ఈ పాట యూత్ ని ఊర్రుతలూగించింది.
మళ్లీ ‘తమ్ముడు‘ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
లాంగ్ గ్యాప్ తర్వాత ఈ కాంబో మళ్లీ సెట్ అయ్యింది. ఇప్పటికే ఓజీలో రమణ గోగుల పాట పాడుతున్నట్టు అప్డేట్ వచ్చేసింది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కోసం రమణ గోకుల ఓ పాట పాడుతున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో దీనిపై హరీష్ శంకర్ ఓ ఈవెంట్ ప్రస్తావించారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ లోనూ రమణ గోకులతో ఓ పాట ఫిక్స్ అయ్యిందని ఇండస్ట్రీలో గట్టి ప్రచారం జరుగుతోంది. ఇది తెలిసి అభిమానులంత ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతం పవన్ లైనప్ లో ఉన్న చిత్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ కు మంచి బజ్ ఉంది. ఇప్పుడు ఇందులో రమణ గోకుల యాడ్ అవ్వడంతో మూవీపై అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. మరి రమణ గోకుల ఈసారి తన వాయిస్ తో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడో చూడాలి.