Bollywood Ramayana : మనదేశంలో కొన్ని గ్రంథాలకు ఒక ప్రత్యేకమైన విలువ ఉంటుంది. ఆ గ్రంథాలను చాలామంది గౌరవప్రదంగా చూస్తారు. అయితే చిన్నప్పటినుంచి గ్రంధాలు, వేదాలు, పురాణాలు చాలా కథలను చెప్పాయి. కొన్ని కథలు ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తాయి. వాటి నుంచి నేర్చుకోవలసిన అంశాలు చాలా ఉంటాయి. అయితే ఆయా గ్రంథాలను రాసిన రచయితల గురించి కూడా చాలా పుస్తకాలు వచ్చాయి.
ఇదివరకే బాలీవుడ్ లో ఆది పురుష్ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ నితీష్ తివారి దర్శకత్వంలో రామాయణం సినిమా తెరకెక్కుతుంది. దీనికి రామాయణ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా నుంచి వచ్చిన వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అంచనాలు కూడా భారీ స్థాయిలో పెరిగిపోయాయి.
రామయణ రాసింది బాలీవుడ్ వాడా ?
రామాయణ సినిమాకి సంబంధించిన వీడియో రిలీజ్ కాగానే రాముడు పాత్రలో రన్బీర్ కపూర్ ని చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. అలానే రావణుడి పాత్రలో యష్ కనిపిస్తున్నాడు. సాయి పల్లవి సీత పాత్రలో కనిపిస్తుంది. అయితే ఇవన్నీ కూడా బాగానే ప్రజెంట్ చేస్తున్నాడు నితీష్ తివారి. ఈ వీడియో వచ్చిన తర్వాత ఆది పురుష్ సినిమా తీసిన దర్శకుడు ఓం రౌత్ మీద విపరీతమైన ట్రోలింగ్ కూడా నడిచింది. వీడియోలో కొన్ని టైటిల్స్ కూడా రివీల్ చేశారు. టైటిల్స్ లో “రిటైన్ బై – శ్రీధర్ రాఘవన్” అని క్రెడిట్ ఇచ్చుకున్నారు. దీంతో రామయణను శ్రీధర్ రాఘవన్ రాస్తే… మరి వాల్మీకి ఎవరు అంటూ రామ భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ సినిమాపై ట్రోల్స్ వస్తున్నాయి ప్రస్తుతం. హిందూ సంఘాలు తీవ్రమైన వ్యతిరేకాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇది చిత్ర యూనిట్ దృష్టికి చేరి మార్పులు చేస్తారా లేదా తెలియాల్సి ఉంది.
బాయికాట్ రామాయణ
రామాయణాన్ని వాల్మీకి రాశారు అనే విషయాన్ని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రామాయణానికి చాలా వెర్సన్స్ ఉన్నా కూడా, వాల్మీకి రామాయణాన్నే పరిగణలోకి తీసుకుంటారు. ఆ కథలను చిన్నప్పటి నుంచి చాలామంది పేరెంట్స్, టీచర్స్ చెబుతూ వచ్చారు. చాలా సినిమాల్లో కూడా అదే కథను మనం చూసాము. ఇప్పుడు రామాయణం సినిమాకి సంబంధించిన క్రెడిట్ వాళ్లు తీసుకోవడంతో సినిమా పైన తీవ్రమైన నెగెటివిటీ వస్తుంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. దాదాపు నాలుగు వేల కోట్లు ఈ సినిమా కోసం కేటాయిస్తున్నారు. ఈ తరుణంలో ఇలాంటి తప్పిదాలు వలన బాయికాట్ రామాయణ (Boycott Ramayana) అని ట్రెండ్ అవుతుంది. ఇది నిర్మాతలకు తీవ్ర నష్టం కలిగించే పరిణామం. దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు వేచి చూడాలి.
Also Read: Naga Vamsi: ఈ కంపారిజన్ చేస్తే ఆడియన్స్ నన్ను తంతారు